Telangana May day Awards Apply Online
మే డే అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
రాష్ట్ర కార్మికశాఖ ఆధ్వర్యంలో మే డే వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ సంయుక్త కమిషనర్ సునీతాగోపాల్‌దాస్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా బెస్ట్ మేనేజ్‌మెంట్ అవార్డులు, ట్రేడ్ యూనియన్ లీడర్లు, మహిళలకు శ్రమశక్తి పురస్కారాలను మే 1న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో ప్రదానం చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారు ఈ నెల 15 సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం నగరంలోని ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ఉన్న టి.అంజయ్య కార్మిక సంక్షేమ భవన్‌లోని కార్యాలయంలో దరఖాస్తు ప్రతులను పొందాలన్నారు. ఆన్‌లైన్‌లో www.labour.telanagana.gov.in కూడా దరఖాస్తుకు అవకాశం కల్పించామని వివరించారు.
For More Details Check Official Website : Click Here