Search This Blog

Monday, March 17, 2025

Rajiv Yuva Vikasam Scheme 2025: Apply Now and Unlock Your Path to Success with Government Support!

Rajiv Yuva Vikasam Scheme 2025: Apply Now and Unlock Your Path to Success with Government Support!

The Telangana government has launched the Rajiv Yuva Vikasam scheme to support self-employment among unemployed youth from Scheduled Castes (SC), Scheduled Tribes (ST), Backward Classes (BC), and minority communities. This initiative aims to provide financial assistance to help beneficiaries start their own businesses.

Table of Contents




Rajiv Yuva Vikasam Scheme 2025: Apply Now and Unlock Your Path to Success with Government Support!

*తెలంగాణ యువతకు గుడ్ న్యూస్- గైడ్ లైన్స్: అర్హతలు ఇవే*

బడుగు, బలహీన, అట్టడుగు వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఆర్థిక సహయాన్ని అందించడానికి ఉద్దేశించిన పథకం ఇది.

రాజీవ్ యువ వికాసం..

దీని పేరు- రాజీవ్ యువ వికాసం. వెనుకబడిన తరగతులకు చెందిన నిరుద్యోగులకు స్వయం ఉపాధిని కల్పించడానికి ఈ పథకానికి రూపకల్పన చేసింది రేవంత్ సర్కార్. దీనికింద నిరుద్యోగ యువతకు మూడు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని పొందే అవకాశం ఉంది. ఈ పథకం ద్వారా అయిదు లక్షలమందికి లబ్ది కలుగుతుంది.

 

ఏప్రిల్‌ 5వ తేదీ వరకు దరఖాస్తు..

రాజీవ్‌ యువ వికాసం పథకం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 17వ తేదీన ప్రారంభమైంది. ఆన్‌లైన్ బెనిఫిషియరీ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (OBMMS) పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

స్వయం ఉపాధి కోసం..

ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు మైనార్టీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం 3 లక్షల రూపాయల వరకు రుణాలు మంజూరు చేయనుంది. ఇందులో 60 శాతం నుంచి 80 శాతం వరకు రాయితీ లభిస్తుంది. దాదాపు 5 లక్షల మందికి 6,000 కోట్ల మేర ఈ రుణాలను అందించనుంది.

లబ్ధిదారుల జాబితా..

పూర్తి వివరాల కోసం https://tgobmms.cgg.gov.in/ ను దర్శించవచ్చు. దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 5వ తేదీన ముగిసిన వెంటనే అంటే ఏప్రిల్ 6 నుంచి మే 31వ తేదీ వరకు వాటిని సంబంధిత అధికారులు పరిశీలిస్తారు. వాటిని వడపోస్తారు. అనంతరం లబ్ధిదారుల జాబితాను విడుదల చేస్తారు.

జూన్ 2న రుణ మంజూరు పత్రాలు

ఈ స్కీమ్కు ఎంపికైన లబ్దిదారులకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజైన జూన్ 2వ తేదీన రుణ మంజూరు పత్రాలు ప్రభుత్వం అందజేస్తుంది. ఈ రుణ పత్రాల మంజూరు కార్యక్రమం 9వ తేదీ వరకు కొనసాగుతుంది. దీనికోసం మండల స్థాయిలో అధికారుల కమిటీని ఏర్పాటు చేయనుంది.

లక్షలమందికి..

ఏ జిల్లాకు సంబంధించిన లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ ఆ జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ కొనసాగుతుంది. లబ్ధిదారుల తుది జాబితాను ప్రకటిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా అయిదు లక్షల మందికి రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తే- ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున 4,200 మందికి లబ్ధి చేకూరుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తోన్నాయి.

జీవో జారీ..

ఈ పథకానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం సంక్షేమ శాఖల జిల్లా అధికారులు, కార్పొరేషన్ల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లను సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది. తాజాగా ఈ పథకం అమలుకు అవసరమైన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. అర్హతలను ప్రకటించింది. ఈ మేరకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ జీవో నంబర్ 7 జారీ చేసింది. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ ఈ జీవోను ఇచ్చారు.

అర్హతలు ఇలా..

ఈ జీవో ప్రకారం- గ్రామణ ప్రాంతాల్లో వార్షికాదాయం రూ. 1,50,000, పట్టణ ప్రాంతాల్లో రూ. 2,00,000 వరకు ఆదాయం ఉన్న వాళ్లు అర్హులు. దరఖాస్తు చేసుకునేటప్పుడే లబ్దిదారులు తమ రేషన్ కార్డు వివరాలను అందులో పొందుపర్చాల్సి ఉంటుంది. రేషన్ కార్డు లేని వాళ్లు మీసేవ కేంద్రాలు జారీ చేసిన ఇన్‌కమ్ సర్టిఫికెట్‌ను జత చేయాల్సి ఉంటుంది.

 

సడలింపు..

21 నుంచి 55 సంవత్సరాల వరకు వయస్సు ఉన్న వాళ్లు ఈ పథకం కింద లబ్ది పొందడానికి అర్హులు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు చెందిన వాళ్లకు సడలింపు ఉంది. 60 సంవత్సరాల వయస్సు ఉన్న వాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే క్రమంలో ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.

ఒక కుటుంబానికి ఒక్కరే..

ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా ఇన్‌కమ్ సర్టిఫికెట్, కుల ధృవీకరణ, పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్, పట్టాదార్ పాస్ పుస్తకం, సదరం సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, వల్నరబుల్ గ్రూప్ సర్టిఫికెట్‌ను తమ దరఖాస్తు ఫారానికి జత చేయాల్సి ఉంటుంది. ఈ పథకం కింద ఒక కుటుంబానికి ఒక్కరే లబ్ది పొందడానికి అర్హులు.



జిల్లా స్థాయిలో సెలెక్షన్ కమిటీ..

దరఖాస్తులను జిల్లా స్థాయిలో సెలెక్షన్ కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ కమిటీకి కలెక్టర్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఇందులో- అదనపు కలెక్టర్, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్, ఎస్సీ/బీసీ కార్పొరేషన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి, దివ్యాంగుల సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ, గిరిజన సంక్షేమ శాఖ డీటీడీఓ, లీడ్ జిల్లా మేనేజర్ సభ్యలు. డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.

Benefits of the Scheme:

  1. Financial Assistance: Eligible candidates can receive up to Rs. 3 lakh each to support their self-employment ventures.
  2. Total Budget: The government has allocated Rs. 6,000 crore for this scheme, targeting to benefit 5 lakh youth across the state.

Key Details of the Scheme

  • Application Period: March 17 to April 14, 2025
  • Total Budget: ₹6,000 crore
  • Target Beneficiaries: 5 lakh unemployed youth from SC, ST, and BC communities
  • Loan Amount: ₹1 lakh to ₹3 lakh per unit
  • Subsidy Structure:
    • 80% subsidy for ₹1 lakh projects
    • 70% subsidy for ₹2 lakh projects
    • 60% subsidy for ₹3 lakh projects


Implementation Process

  • The scheme will be implemented through the welfare corporations of the respective departments.
  • Selected beneficiaries will receive financial support to start small businesses or self-employment ventures.

Eligibility Criteria:

  1. Applicants must be unemployed residents of Telangana belonging to SC, ST, BC, or minority communities. 
  2. They should have a viable business plan for self-employment.
  3. They should be young individuals.
  4. They must be currently unemployed


How to Apply for TSOBMMS Rajiv Yuva Vikasam Scheme

  1. Access the Official Website: Visit tgobmms.cgg.gov.in.
  2. Register: Sign up using your mobile number and email ID.
  3. Complete the Application Form: Provide your personal, educational, and employment details.
  4. Upload Required Documents: Attach scanned copies of necessary certificates.
  5. Submit Your Application: Review all details carefully and submit before April 5, 2025.

Important Dates – Rajiv Yuva Vikasam Scheme 2025

  • Application Start Date: March 17, 2025
  • Application End Date: April 14, 2025
  • Verification & Selection Process: April 6 – May 31, 2025
  • Final Beneficiary List Announcement: June 2, 2025 (Telangana Formation Day)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *రాజీవ్ యువ వికాస పథకం* లో భాగంగా అన్ని కులాల వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు 400000/- వరకు ఆర్ధిక సహాయం అందిస్తోంది..
దీనిలో కనీసం *60 % -80% సబ్సిడీ* కూడా అందిస్తోంది..

దరఖాస్తు కు కావాల్సినవి

1. *ఆధార్* 
2. *కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి (అన్ని కులాల వారికి )* 
3. *పాన్ కార్డు* 
4. *Passport ఫోటో* 
5. *లబ్ధిదారుడి ఫోన్ నంబర్* 

ముఖ్య సూచన : *ఒక రేషన్ కార్డులోని సభ్యులలో ఒకరికి మాత్రమే అవకాశం కలదు..* 

ఉపాధి అంశాలు :
*@.వ్యవసాయ అంశాలు*
1.ఎద్దుల బండ్లు 
2.ఆయిల్ ఇంజిన్ 
3.పంప్ సెట్ 
4.ఎయిర్ కంప్రెషర్ 
5.పత్తి సేకరణ యంత్రం 
6.వేరుషనగ మిషన్ 
7.వర్మీ కంపోస్ట్
8. ఆయిల్ ఫామ్ పంట 
*@.పశుపోషణ*
1. గేదెలు
2. ఆవులు
3. డైరీ ఫారం
4. కోడిగుడ్ల వ్యాపారం 
5. చేపల వ్యాపారం
6. మేకల పెంపకం
7. పాల వ్యాపారం
8. పౌల్ట్రీ ఫారం 
9. గొర్రెల పెంపకం

*@. సొంత వ్యాపారం*

1. ఎయిర్ కూలర్ల వ్యాపారం 
2. స్టీల్ సామాన్ల వ్యాపారం
3. ఆటోమొబైల్ షాపు 
4. బేకరీ షాపు 
5. గాజుల దుకాణం
6. హెయిర్ కటింగ్ షాపు
7. బుట్టల తయారీ షాపు 
8. బ్యూటీ పార్లర్ షాపు
9. జనరల్ స్టోర్
10. ఇటుకలు తయారీ వ్యాపారం
11. డిష్ టీవీ ల ఏర్పాటు
12. వడ్రంగి షాపు
13. సీసీ కెమెరాల రిపేర్ షాప్ 
14. ఎలక్ట్రిక్ షాపు
15. ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ కేంద్రం  వైరింగ్ కేంద్రం
16. మగ్గం టైలరింగ్
17. చెప్పులు అమ్మే దుకాణం 
18. పండ్ల వ్యాపార కేంద్రం 
19. పండ్ల రసాల దుకాణం 
20. బట్టల దుకాణం
21. కిరాణం జనరల్ స్టోర్ 
22. జనరేటర్ షాప్ 
23. గిఫ్ట్ ఆర్టికల్ షాప్ 
24. బంగారు నగల దుకాణం 
25. పిండి గిర్ని కేంద్రం 
26. హోటల్ ఏర్పాటు
27. ఐస్ క్రీమ్ పార్లర్ ఏర్పాటు 
28. ఐరన్ బిజినెస్
29. లేడీస్ కార్నర్
30. లాండ్రీ షాపు డ్రై క్లీనింగ్ 
31. పేపర్ ప్లేట్ల తయారీ
32. లైట్స్ డెకరేషన్ సౌండ్ సిస్టం
33. అగరబత్తుల తయారీ
34. మినీ సూపర్ బజార్
35. మెడికల్ అండ్ జనరల్ స్టోర్ 
36. ఆటో టిఫిన్ సెంటర్
37. మోటార్ మెకానిక్ 
38. మోటార్ అండ్ పైప్ లైన్ 
39. మటన్ షాపు 
40. పాన్ షాపు 
41. పేపర్ బ్యాగుల తయారీ 
42. ఫోటో అండ్ వీడియో షాపు 
43. పిండి గిర్ని 
44. ఫిల్టర్ వాటర్ కేంద్రం 
45. రెడీమేడ్ బట్టల దుకాణం
46. చీరల వ్యాపారం 
47. స్లాబ్ కటింగ్ మిషన్
48. స్ప్రే పెయింటింగ్ మిషన్
49. స్టీల్ అండ్ సిమెంట్ 
50. స్టిచింగ్ మిషన్ 
51. సప్లయర్స్ షాపు
52. మిఠాయిల షాపు
53. టైలరింగ్
54. వెల్డింగ్ షాపు 
55. వాటర్ సర్వీసింగ్ సెంటర్
56. కూరగాయల వ్యాపార షాపు
57. టిఫిన్ అండ్ టీ షాప్
58. టీవీ మెకానిక్ షాప్  
59. సెల్ ఫోన్ రిపేర్ షాప్
60. సిమెంటు ఐరన్ షాపు 
61. సెంట్రింగ్ పరికరాల షాపు 
62. చెప్పుల తయారీ షాపు 
63. చికెన్ సెంటర్ 
64. బట్టల వ్యాపారం
65. కాఫీ హోటల్ 
66. కాంక్రీట్ మిల్లర్స్ పరికరాలు 
67. కూల్ డ్రింక్ షాప్ 
68. క్రేన్ 
69. కర్రీస్ పాయింట్ 
70. సైకిల్ మెకానిక్ 
71. వ్యాధి నిర్ధారణ కేంద్రాల ఏర్పాటు
72. డీజిల్ ఆటో 
73. డిజిటల్ కెమెరా షాపు 
74. సెటప్ బాక్స్ ల ఏర్పాటు 
75. కూరగాయల దుకాణం
పై వాటికి దరఖాస్తు చేయడానికి చివరి తేదీ : 14/04/2025.
Official Website - Click Here

 

Frequently Asked Questions (FAQ)

Q: Can graduates from general categories apply for this scheme?

A: No, this scheme is specifically for unemployed youth from SC, ST, BC, and minority communities residing in Telangana.

Q: How much subsidy will I receive for a Rs.2 lakh loan?

A: For loan amounts between Rs.1 lakh and Rs.2 lakh, the government provides a 70% subsidy (Rs.1.4 lakh), and the beneficiary is responsible for the remaining 30% (Rs.60,000).

Q: Where can I check my application status?

A: Applicants can track their application status on the official portal at https://tgobmms.cgg.gov.in after the verification process is completed (post-May 31, 2025).

Q: Is collateral required to avail of the financial assistance?

A: No, there is no collateral requirement. The subsidy is linked directly to the loan amount, and beneficiaries contribute a portion based on their category.