Sunday, September 22, 2024

AP TET 2024 Hall Tickets @ aptet.apcfss.in

AP TET Hall Tickets 2024  Download 

AP TET 2024 Hall Tickets Released

3 అక్టోబర్ నుండి జరగబోయే టెట్ పరీక్షల హాల్ టికెట్ లు విడుదల

కాండిడేట్ ఐడి, మరియు పుట్టిన తేదీ తో డౌన్లోడ్ చేసుకోవచ్చు 

ఏపీ టెట్ హాల్ టికెట్స్ విడుదల

ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబి లిటీ టేస్ట్ పరీక్ష హాల్ టికెట్లు ను శనివారం రాత్రి విడు దల చేసింది..ఇందుకు సంబధించిన వ్రాత పరీక్షలు అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 20వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. 

ఈ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్టు విధానంలో నిర్వహించనున్నారు. టెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్స్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. 

టెట్ పరీక్షలు రెండు సెషన్లలో 18 రోజులు పాటు జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరుగుతుంది. 

ఇక రెండో సెషన్ మధ్యా హ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతుంది. హాల్ టికెట్లు డౌన్ చేసుకోండిలా - ఏపీ టెట్ అభ్యర్థులు https://aptet.apcfss.in/# వెబ్ సైట్లోకి వెళ్లాక అక్కడ హోం పేజీలో కనిపించే AP TET Hall Tickets(July) 2024 అనే ఆప్షన్ పై క్లిక్ చేయాండి. -

ఇక్కడ అభ్యర్థి Candidate ID, పుట్టిన తేదీతోపాటు వెరిఫికేషన్ కోడ్ ను ఎంటర్ చేయాలి. -లాగిన్ పై క్లిక్ చేస్తే టెట్ హాల్ టికెట్ డిస్ల్పే అవుతుంది. -

ప్రింట్ లేదా డౌన్ లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని తీసుకోవాలి. -పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలంటే హాల్ టికెట్ తప్పని సరిగా ఉండాలి.

The AP TET Hall Ticket download link for 2024 is accessible on the official website of https://aptet.apcfss.in. All candidates who applied for the AP TET 2024 exam can get their hall ticket/admission card by logging in using their Candidate ID, DOB (dd/mm/yyyy), and verification code. 

Candidates must download their AP TET Hall Ticket 2024 well in advance of the exam date and review the information contained on it. 

AP TET 2024 Hall Tickets @ aptet.apcfss.in

Steps to Download the AP TET Hall Ticket 2024

Candidates can get the AP TET Admit Card 2024 using their login information from the official website or the direct link mentioned above. The processes for downloading the AP TET Hall Ticket 2024 are listed below.

1. Browse the Department of School Education's official website at https://aptet.apcfss.in.

2. On the homepage, click the link that says Hall Ticket - Candidate Login.

3. A new login gateway appears on screen.

4. Fill in the Candidate ID, Date of Birth, and Verification Captcha Code.

Click Here to Download 

AP TET 2024 Hall Tickets 

https://aptet.apcfss.in/CandidateLogin.do

AP TET 2024 Online Mock Test

🅰️🅿️ TET Hall Tickets

*🎯టెట్‌ హాల్‌టికెట్లలో తప్పులు ఉంటే.. ఇలా చేయండి!*

ఏపీ టెట్‌ హాల్‌ టికెట్లలో ఏవైనా తప్పులు దొర్లితే అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు సూచించారు. పరీక్ష కేంద్రం వద్ద వాటిని సరిచేసుకొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

అమరావతి: *ఏపీలో టెట్‌ పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. అక్టోబర్‌ 3నుంచి జరగనున్న ఈ పరీక్షలకు ఇప్పటికే హాల్‌టికెట్లు విడుదల చేయగా.. కొందరికి ఒకేరోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించడం వంటి పొరపాట్లు దొర్లాయి. దీంతో టెట్‌ అభ్యర్థులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో అధికారులు స్పందించారు. హాల్‌టికెట్లలో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే.. అవసరమైన ఒరిజినల్‌ సర్టిఫికెట్లు సమర్పించి పరీక్ష కేంద్రం వద్ద నామినల్‌ రోల్స్‌లో సరిచేయించుకోవచ్చని అభ్యర్థులకు సూచించారు. ఇందుకోసం పరీక్ష కేంద్రం దగ్గరే అధికారులు ఏర్పాట్లు చేస్తారని తెలిపారు. AP TET Examsకు మొత్తంగా 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటివరకు 2,84,309మంది తమ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారని అధికారులు వివరించారు.*


టెట్‌ పరీక్ష విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే.. అభ్యర్థులు డైరెక్టరేట్ కమిషనర్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ వి. విజయరామరాజు సూచించారు. ఉదయం 10గంటల కాల్‌ చేసి సమాధానం తెలుసుకోవచ్చన్నారు. ఇందుకోసం 9398810958, 6281704160, 8121947387,  8125046997, 7995789286,  9398822554, 7995649286, 9963069286, 9398822618 నంబర్లకు ఫోన్‌ చేయడంతో పాటు సందేహాలను ఈ-మెయిల్ ద్వారా grievences.tet@apschooledu.in కు పంపవచ్చని సూచించారు.