Friday, August 2, 2024

Telangana Job Calendar 2024-25

తెలంగాణలో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల

 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఏయే ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేయాలనే విషయాలను క్యాలెండర్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. నోటిఫికేషన్‌ విడుదల చేసే నెల, పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే వివరాలతో పాటు నియామకాలు నిర్వహించే ఏజెన్సీ, ఉద్యోగానికి కావాల్సిన అర్హతల గురించి అందులో పొందుపర్చారు. ఈ మేరకు జాబ్‌ క్యాలెండర్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంంబ్లీలో ప్రకటించారు. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్‌-1 పరీక్షలు అక్టోబరులో, గ్రూప్‌-2ను డిసెంబరులో, గ్రూప్‌-3 నవంబరులో నిర్వహించనున్నారు.


Telangana Job Calendar 2024-25

వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్ నియామకాల కోసం సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల... నవంబర్‌లో పరీక్షలు.

ట్రాన్స్‌కోలోని వివిధ ఇంజినీరింగ్ ఉద్యోగాల కోసం అక్టోబర్‌లో నోటిఫికేషన్.. వచ్చే ఏడాది జనవరిలో నియామక పరీక్షలు 

నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చే ఏడాది జనవరిలో పరీక్షలు 

వివిధ శాఖల్లో గెజిటెడ్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జనవరిలో నోటిఫికేషన్ విడుదల.. ఏప్రిల్‌లో పరీక్షలు 

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల .. ఏప్రిల్‌లో పరీక్షలు  

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ .. మేలో పరీక్షలు 

గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్ష వచ్చే ఏడాది జులైలో నిర్వహించనున్నారు

ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ విడుదల చేసి ఆగస్టులో పరీక్షలు నిర్వహిస్తారు

డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులకు వచ్చే ఏడాది జూన్‌లో నోటిఫికేషన్..సెప్టెంబర్‌లో పరీక్షలు

వచ్చే ఏడాది మేలో మరోసారి గ్రూపు2 నోటిఫికేషన్.. అక్టోబర్‌లో పరీక్షలు 

వచ్చే ఏడాది జులైలో గ్రూప్‌-3 నోటిఫికేషన్ నవంబర్‌లో పరీక్షలు 

సింగరేణిలో పలు ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జులైలో నోటిఫికేషన్.. నవంబర్‌లో పరీక్షలు 


కొలువుల జాతర

అక్టోబరులో మరో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌

2025లో కొత్త గ్రూప్‌-2, 3 ప్రకటనలు

ఫిబ్రవరిలో డీఎస్సీ 

ఉద్యోగ క్యాలెండర్‌ప్రకటించిన ప్రభుత్వం

యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ తరహాలో ముందస్తు ప్రణాళిక

శాసనసభలో జాబ్‌ క్యాలెండర్‌ వివరాలు వెల్లడిస్తున్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ సర్కారు ఉద్యోగ క్యాలెండర్‌ ప్రకటించింది. ఉద్యోగ ప్రకటనలు ఎప్పుడు వెలువడేదీ, పరీక్షలు ఎప్పుడు నిర్వహించేదీ స్పష్టమైన కాలపరిమితితో కూడిన షెడ్యూలును అసెంబ్లీలో శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క వెల్లడించారు. గ్రూప్‌-1, 2, 3 సర్వీసులతో పాటు పోలీసు, సింగరేణి, గురుకుల, వైద్య విభాగాల ఉద్యోగాలతో పాటు ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులు ఇందులో ఉన్నాయి. యూపీఎస్సీ, స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) తరహాలో ఈ క్యాలెండర్‌ను ప్రభుత్వం రూపొందించింది. భర్తీ చేసే ఉద్యోగాల సంఖ్య, ఇతర వివరాలను ఉద్యోగ ప్రకటన(నోటిఫికేషన్‌)ల్లో వెల్లడించనుంది. ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసిన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ప్రధాన పరీక్షల సమయానికి కొత్తగా మరో గ్రూప్‌-1 ప్రకటన జారీ చేయనుంది. జీవో నం.55లోని 19 ప్రభుత్వ విభాగాలు, తత్సమాన స్థాయి పోస్టులతో పాటు యూపీఎస్సీ తరహాలో అటవీ విభాగంలోని సహాయ కన్జర్వేటర్‌(ఏసీఎఫ్‌) పోస్టులకు కలిపి గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఉంటుందని ఉద్యోగ క్యాలెండర్‌లో ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చే ఏడాది కొత్త గ్రూప్‌-2, 3 ఉద్యోగ ప్రకటనలు వెలువడనున్నాయి. 


జీవో 55లో పేర్కొన్న ప్రభుత్వ విభాగాలతో పాటు ఇతర విభాగాల్లోని తత్సమాన స్థాయి పోస్టులను వీటిలో చేర్చనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే గ్రూప్‌-4 ఉద్యోగాలను గ్రూప్‌-3తో కలిపి నిర్వహిస్తామని తెలిపింది. గ్రూప్‌-2 ప్రకటన 2025 మే నెలలో, గ్రూప్‌-3 నోటిఫికేషన్‌ జులైలో వెలువడనున్నాయి.

ఏడాది వ్యవధిలో రెండు టెట్‌ నోటిఫికేషన్లు

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కీలకమైన అర్హత పరీక్ష(టెట్‌)ను రానున్న 12 నెలల వ్యవధిలో రెండుసార్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి టెట్‌ నోటిఫికేషన్‌ 2024 నవంబరులో, రెండో నోటిఫికేషన్‌ 2025 ఏప్రిల్‌లో వెలువడనుంది. తొలి టెట్‌ 2025 జనవరిలో, రెండో పరీక్ష 2025 జూన్‌లో జరుగుతుంది. టెట్‌కు బీఈడీ, డీఈడీ తత్సమాన అర్హతలు ఉండాలని ప్రభుత్వం తెలిపింది. 

షెడ్యూలు ప్రకారమే గ్రూప్‌-1 ప్రధాన, గ్రూప్‌-2, 3 

త్త ప్రభుత్వం కొలువుదీరాక ఫిబ్రవరిలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ జారీ అయింది. ప్రిలిమినరీ పరీక్ష పూర్తయి 1:50 నిష్పత్తిలో ప్రధాన పరీక్షలకు అభ్యర్థుల జాబితా వెలువడింది. మెయిన్స్‌ పరీక్షలు ఈ ఏడాది అక్టోబరు 21 నుంచి 27 వరకు జరగనున్నాయని ఉద్యోగ క్యాలెండర్‌లో ప్రభుత్వం స్పష్టం చేసింది. 2022లో వెలువడిన గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ పరీక్షలు డిసెంబరులో నిర్వహించేందుకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. గ్రూప్‌-3 ప్రకటనకు సంబంధించిన రాతపరీక్షలు ఈ ఏడాది నవంబరు 17, 18 తేదీల్లో జరుగుతాయని సర్కారు తెలిపింది.


Telangana Job Calendar 2024-25

The Congress-led state administration fulfilled one of its political promises on Friday by issuing an employment calendar in the Legislative Assembly. According to the work calendar, the Group-1 notification will be released in October 2024, and the preliminary examination will take place in February 2025. The Group-1 mains assessment will take place in July 2025.

1. Group I Mains: Oct 21-27, 2024 (Notified: Feb 2024)

2. Group III Services: Nov 17-18, 2024 (Notified: Dec 2022)

3. Lab Tech/Nurse/Pharmacist: Nov 2024 (Notified: Sep 2024)

4. Group II Services: Dec 2024 (Notified: Dec 2022)

5. Engg Posts in TGTRANSCO: Jan 2025 (Notified: Oct 2024)

6. Gazetted Engg Services: Jan 2025 (Notified: Oct 2024)

7. Teacher Eligibility Test: Jan 2025 (Notified: Nov 2024)

8. Group I-Prelims: Feb 2025 (Notified: Oct 2024)

9. Gazetted Other Services: Apr 2025 (Notified: Jan 2025)

10. DSC of Teachers: Apr 2025 (Notified: Feb 2025)

11. Forest Beat Officer: May 2025 (Notified: Feb 2025)

12. Teachers Eligibility Test: Jun 2025 (Notified: Apr 2025)

13. Group I-Mains: Oct 2025 (Notified: Jul 2025)

14. SI Civil Posts: Aug 2025 (Notified: Apr 2025)

15. PC Civil Posts: Aug 2025 (Notified: Apr 2025)

16. Academic Posts in Degree Colleges: Sep 2025 (Notified: Jun 2025)

17. Degree Lecturers in Res Colleges: Sep 2025 (Notified: Jun 2025)

18. Group II (Incl Forest Range Officers): Oct 2025 (Notified: May 2025)

19. Group III (w/ Group IV): Nov 2025 (Notified: Jul 2025)

20. Exec Cadre Posts: Nov 2025 (Notified: Jul 2025)

Click Here to Download

Telangana Job Calendar 2024-25

Telangana Job Calender 2024-25