Friday, August 30, 2024

How to Check your Income Tax Refund Status

Check Your Income Tax  Refund Status

 IT refund status: ఆదాయ పన్ను రీఫండ్‌ స్టేటస్‌ ఏంటి? ఇలా తెలుసుకుందాం..

IT refund status: ఐటీఆర్‌ రీఫండ్‌ రాకపోతే స్టేటస్‌ ఏంటో తెలుసుకునే వెసులుబాటు ఉంది. అలాగే ఆలస్యానికి గల కారణాలు కూడా తెలుసుకోవచ్చు.

IT refund status | ఇంటర్నెట్‌ డెస్క్‌: జులై 31తో ఐటీఆర్‌ దాఖలు గడువు ముగిసింది. సకాలంలో పన్ను చెల్లించినవారంతా రీఫండ్‌ (IT refund) కోసం వేచి చూస్తున్నారు. కావాల్సిన దానికంటే అధికంగా పన్ను చెల్లించినవారంతా రీఫండ్‌ను ఆశించొచ్చు. రిటర్నులను ఆదాయ పన్ను విభాగం ప్రాసెస్‌ చేసి నోటీసు ద్వారా ధ్రువీకరిస్తుంది. ఆ తర్వాతే రీఫండ్‌ వస్తుంది.

How to Check your IT Income Tax  Refund Status

రీఫండ్లను ఎస్‌బీఐ ప్రాసెస్‌ చేస్తుంది. ఐటీఆర్‌లో (ITR) పేర్కొన్న బ్యాంకు ఖాతాకు జమ చేస్తుంది. అందుకే సరైన ఖాతా సంఖ్య, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ ఇవ్వడం చాలా ముఖ్యం. ఆదాయ పన్ను ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌లో బ్యాంకు ఖాతాను వేలిడేట్‌ చేయాల్సి ఉంటుంది. అలాగే అకౌంట్‌ను పాన్‌తో అనుసంధానించడం కూడా తప్పనిసరి.

రీఫండ్‌కు ఎంతకాలం?

రీఫండ్‌ (ITR refund) రావాలంటే రిటర్నులను కచ్చితంగా వెరిఫై చేయాల్సి ఉంటుంది. సాధారణంగా రీఫండ్ జమ కావడానికి నాలుగైదు వారాలు పడుతుంటుంది. అప్పటికీ రాకపోతే ఆదాయ పన్ను విభాగం నుంచి ఏమైనా సమాచారం వచ్చిందేమో ఈమెయిల్‌ను చెక్‌ చేసుకోవాలి. పైగా ఈ-ఫైలింగ్‌ సైట్‌లో రీఫండ్‌ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

స్టేటస్‌ ఎలా?

♦️ఆదాయ పన్ను విభాగపు వెబ్‌సైట్‌లో రీఫండ్‌ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.

 ♦️www.incometax.gov.in వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ కావాలి

♦️ఈ-ఫైల్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి

♦️అందులో ‘ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్స్‌’ను ఎంచుకొని ‘వ్యూ ఫైల్డ్‌ రిటర్న్స్‌’పై క్లిక్‌ చేయాలి

♦️ఇటీవల దాఖలు చేసిన ఐటీఆర్‌ను ఎంచుకోవాలి

♦️‘వ్యూ డీటెయిల్స్’ ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేసుకోవాల

♦️దాఖలు చేసిన ఐటీఆర్‌ స్టేటస్‌తో పాటు రీఫండ్‌ జారీ అయిన మొత్తం, తేదీ వంటి వివరాలు వస్తాయి.

స్టేటస్‌లు ఇలా..

◼️రీఫండ్‌ వచ్చినప్పుడు: ఐటీఆర్‌ ఫైలింగ్‌ ప్రాసెస్‌ పూర్తయి రీఫండ్‌ బ్యాంకు ఖాతాకు జమైంది.

◼️రీఫండ్‌ పాక్షికంగా సర్దుబాటు చేసినప్పుడు: క్రితం బకాయిలేమైనా ఉంటే ఐటీ విభాగం వాటిని ఈ ఏడాది రీఫండ్‌ నుంచి సర్దుబాటు చేసుకుంటుంది. అలాంటప్పుడు ముందే సెక్షన్‌ 245 కింద నోటీసు పంపుతుంది. మీరు దానికి సమ్మతిస్తూ రిప్లయ్‌ పంపాల్సి ఉంటుంది. లేదంటే ప్రాసెస్‌ పూర్తి చేసి సర్దుబాటు మేరకే రీఫండ్‌ను జమ చేస్తుంది.

◼️రీఫండ్‌ పూర్తిగా సర్దుబాటు చేసినప్పుడు: బకాయిల కింద పూర్తి మొత్తాన్ని సర్దుబాటు చేసుకున్నా ఐటీ విభాగం తెలియజేస్తుంది.

◼️రీఫండ్‌ ఫెయిల్‌ అయినప్పుడు: ఐటీ విభాగం రీఫండ్‌ను జారీ చేసినప్పటికీ.. బ్యాంకు వివరాల్లో తప్పుల కారణంగా జమ కాలేదు.

కారణాలేమై ఉండొచ్చు?

♦️పాన్‌ యాక్టివ్‌గా లేకపోవడం. ఆధార్‌తో పాటు బ్యాంకు ఖాతాలకు పాన్‌ను అనుసంధానించమని మెసేజ్‌ కూడా చూపిస్తుంది

♦️బ్యాంకు ఖాతా సంఖ్య, ఎంఐసీఆర్‌ కోడ్‌, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌, పేరులో పొరపాటు వంటి బ్యాంకు వివరాల్లో తప్పులు*

♦️కేవైసీ పూర్తి కాకపోవడం

♦️కరెంటు లేదా సేవింగ్స్‌ ఖాతా కాకుండా ఇతర ఖాతా వివరాలు సమర్పించడం

♦️బ్యాంకు ఖాతా క్లోజ్‌ అయి ఉండడం

♦️బ్యాంకు ఖాతాను ప్రీ-వ్యాలిడేట్‌ చేయకపోవడం

Official Website : Ckick Here