Friday, August 11, 2023

UPI New Feature : Now you can use UPI apps offline to make payments up to Rs. 500

 UPI New Feature : Now you can use UPI apps offline to make payments up to Rs. 500

RBI launched new UPI Lite feature that offers offline payments up to Rs. 500 using NFC.

  1. For many Indians, especially younger generations, UPI has become a need since it provides a safe and practical way to make payments.
  2. For many Indians, especially younger generations, UPI has become a need since it provides a safe and practical way to make payments.
  3. There will be Hindi and English versions of the function, with other languages to come.
  4. UPI Lite would enable quicker, more dependable, contactless payments for small-value transactions and transit payments by raising the per transaction cap to Rs 500. 
  5. To reduce the dangers connected with the relaxation of two-factor authentication, the daily cap will be established at Rupees 2,000.
  6. NFC technology will soon be used for UPI offline payments, encouraging the usage of UPI-Lite and assuring speed and little transaction decrease.
  7. Users will be able to make digital payments thanks to this invention even in situations with poor or no internet access.
UPI New Feature : Now you can use UPI apps offline to make payments up to Rs. 500

Steps to use UPI Lite:

Nearly all payment applications that accept UPI payments, such Paytm, PhonePe, and Gpay, include the UPI Lite capability. Go to the settings of these applications, find the UPI Lite option, and turn on the payment system to enable this function.
Using UPI Lite:
  1. Open the UPI Lite-compatible app.
  2. Link your bank account to your UPI Lite settings.
  3. Fill up your UPI Lite wallet with cash.
  4. Simply launch the UPI payment app as you would for regular UPI payments to make a payment.
  5. Scan the QR code on the receipts or enter a cellphone number.
  6. Enter the required payment amount.
  7. Select UPI Lite for payment.

UPI lite: యూపీఐ లైట్‌ లిమిట్‌ పెంపు.. ఇకపై 500 వరకు పాస్‌వర్డ్‌ అక్కర్లేదు



UPI lite limit: యూపీఐ లైట్‌ లిమిట్‌ పెంచుతూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ఇకపై పిన్‌ లేకుండా రూ.500 వరకు చెల్లింపులు చేయొచ్చు.



ముంబయి: డిజిటల్‌ పేమెంట్స్‌కు సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) మరో కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ లైట్‌లో (UPI lite) పేమెంట్‌ కోసం ఉన్న పరిమితిని రూ.200 నుంచి రూ.500కు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గురువారం వెల్లడించారు. ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాల వెల్లడి సంద్భంగా ఈ విషయాన్ని తెలిపారు. ఈ నిర్ణయంతో యూపీఐ లైట్‌ ద్వారా రూ.500 వరకు పిన్‌ నమోదు చేయకుండానే సేవలను వాడుకోవచ్చు.



సింగిల్‌ లావాదేవీలో పరిమితి మొత్తాన్ని పెంచినప్పటికీ.. యూపీఐ లైట్‌ వ్యాలెట్‌లో లోడ్‌ చేసుకునేందుకు ఉన్న మొత్తాన్ని రూ.2 వేలకే పరిమితం చేశారు. యూపీఐ లైట్‌ చెల్లింపుల పరిమితిని పెంచాలన్న డిమాండ్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శక్తికాంత దాస్‌ తెలిపారు. అయితే, టు-ఫ్యాక్టర్‌ అథంటికేషన్‌ లేకుండా చెల్లింపుల విషయంలో రిస్కులు పొంచి ఉన్న నేపథ్యంలో వ్యాలెట్‌ పరిమితిని పెంచలేదన్నారు. చెల్లింపుల పరిమితికి సంబంధించిన సూచనలను త్వరలో జారీ చేయనున్నట్లు శక్తికాంతదాస్‌ తెలిపారు.



మరోవైపు డిజిటల్‌ చెల్లింపులకు టెక్నాలజీని జోడించే ఉద్దేశంతో కొత్తగా ‘కన్వర్జేషనల్‌ పేమెంట్స్‌’ను తీసుకొస్తున్నట్లు గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలిపారు. ఇందుకోసం యూపీఐకి ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ను (AI) జోడించనున్నామని తెలిపారు. దీనివల్ల ఏఐ ఆధారిత సిస్టమ్స్‌తో సంభాషిస్తూ సురక్షితంగా లావాదేవీలు పూర్తి చేయొచ్చని గవర్నర్‌ తెలిపారు. ఇది తొలుత హిందీ, ఇంగ్లీష్‌లో భాషల్లో అందుబాటులోకి రానుంది. తర్వాత ఇతర భాషలను జోడిస్తామని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఎన్‌పీసీఐకి త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తామని శక్తికాంత దాస్‌ తెలిపారు.