Saturday, August 26, 2023

Aadhar Biometric : What to do if you want to lock Aadhar Biometric?

 Aadhar Biometric : What to do if you want to lock Aadhar Biometric?

Aadhar Biometric lock and unlock process: Did you know that there is a facility to lock the biometric information in Aadhar card from being accessed by others? But this lock can also be done temporarily.

Internet Desk: Whether it is to get a new SIM card, to open an account in a bank, to get benefit from welfare schemes, one must have  an Aadhar card. Along with that, fingerprint also has to be registered. However, wherever this is required, we provide fingerprint details along with Aadhar. Scammers are committing frauds on a large scale by taking these as additions. Fingerprints are collected through various means and cash is paid. Recently we have been hearing about these types of incidents. It is better to lock the biometric to escape from their clutches. It can also be unlocked when needed. This prevents others from using the biometric without your involvement. But now let's see how to do this lock/ unlock online easily.

Aadhar Biometric : What to do if you want to lock Aadhar Biometric?

How to Lock Aadhar biometric?

  1. For this you have to login in My Aadhar Portal through Aadhar number and OTP (https://myaadhaar.uidai.gov.in/).
  2. Click on Lock/ Unlock biometric option on the screen.
  3. It includes an explanation of how the lock/ unlock works. Click on the next option that appears on that page.
  4. Soon please select to lock will open. Tick the check box below and click on next.
  5. Your biometrics have been locked successfully will be displayed on the screen. That's it, your Aadhar biometric will be locked. Once locked, a red lock will appear in the Lock/ Unlock  biometric option.

How to unlock your Aadhar Biometric?

  1. A red lock will appear on the Lock/Unlock Biometric option after logging into the portal. If this means your biometric is locked.
  2. To unlock, follow the same method as mentioned above.
  3. However, when you tick the Please Select to Lock term box, two options will appear.
  4. It will ask if your biometric unlock is temporary or permanent. Select the option you want.
  5. Choose and click on Next. Your biometrics have been unlocked successfully will appear on the screen. That's it your biometric is unlocked.
  6. If you choose the temporary unlock option, your biometric will be unlocked only for 10 minutes.
  7. However, if Aadhaar biometric details are locked.. there will be no problem in completing OTP based verification.

Aadhar biometric: ఆధార్‌ బయోమెట్రిక్ లాక్‌ చేసుకోవాలా?.. ఇలా చేయండి.

Aadhar biometric lock and unlock process: ఆధార్‌లోని బయోమెట్రిక్‌ సమాచారాన్ని ఇతరులు యాక్సెస్‌ చేయకుండా లాక్ చేసుకునే సదుపాయం ఉందనే విషయం మీకు తెలుసా? అయితే ఈ లాక్‌ తాత్కాలికంగా కూడా చేయొచ్చు.

ఇంటర్నెట్‌డెస్క్‌: కొత్త సిమ్ కార్డు తీసుకోవాలన్నా, బ్యాంకులో ఖాతా తెరవాలన్నా, సంక్షేమ పథకాల నుంచి లబ్ధి పొందాలన్నా.. ఇలా ఏ పని జరగాలన్నా ఆధార్‌ కార్డు (Aadhaar) ఉండాల్సిందే. దాంతో పాటూ వేలిముద్రను కూడా నమోదు చేయాల్సిందే. అయితే ఇలా అవసరమున్న ప్రతి చోటా ఆధార్‌తో పాటు వేలిముద్ర వివరాలు ఇచ్చేస్తుంటాం. వీటినే అదునుగా తీసుకొని కేటుగాళ్లు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. వివిధ మార్గాల ద్వారా వేలిముద్రలను సేకరించి నగదును కాజేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా ఘటనల గురించి తరచూ వింటూనే ఉన్నాం. వీటి బారి నుంచి తప్పించుకోవటానికి బయోమెట్రిక్‌ను లాక్‌ చేసుకోవడం ఉత్తమం. కావాల్సినప్పుడు అన్‌లాక్‌ కూడా చేయవచ్చు. దీంతో ఇతరులు మీ ప్రమేయం లేకుండా బయోమెట్రిక్‌ని వినియోగించటానికి వీలుండదు. అయితే ఈ లాక్‌/ అన్‌లాక్‌ ఆన్‌లైన్‌లో సులువుగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఆధార్‌ బయోమెట్రిక్‌ లాక్‌

  1. దీని కోసం ముందుగా మై ఆధార్‌ పోర్టల్‌లో ఆధార్‌ నంబర్‌, ఓటీపీ ద్వారా లాగిన్‌ అవ్వాలి. (https://myaadhaar.uidai.gov.in/)
  2. స్క్రీన్‌పై Lock/Unlock Biometric ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  3. అందులో లాక్‌/అన్‌లాక్‌ ఎలా ఉపయోగపడుతుందనే వివరణ ఉంటుంది. ఆ పేజీలో కనిపించే Next ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  4. వెంటనే Please Select to Lock ఓపెన్ అవుతుంది. కింద ఉన్న టర్మ్‌ బాక్స్‌లో టిక్‌ చేసి Next పై క్లిక్ చేయాలి.
  5. Your biometrics have been locked sucessfully అని స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. అంతే మీ ఆధార్‌ బయోమెట్రిక్‌ లాక్‌ అయిపోతుంది. లాక్‌ అవ్వగానే Lock/Unlock Biometric ఆప్షన్‌లో ఎరుపు రంగు లాక్ కనిపిస్తుంది.

అన్‌లాక్ ఇలా

  1. పోర్టల్‌లో లాగిన్ అవ్వగానే Lock/Unlock Biometric ఆప్షన్‌లో ఎరుపు రంగు లాక్ కనిపిస్తుంది. ఇలా ఉంటే మీ బయోమెట్రిక్‌ లాక్‌ అయిందని అర్థం.
  2. అన్‌లాక్‌ కోసం పైన చెప్పిన పద్ధతినే ఫాలో అవ్వాలి.
  3. అయితే ఇందులో Please Select to Lock టర్మ్‌ బాక్స్‌లో టిక్‌ చేయగానే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.
  4. మీ బయోమెట్రిక్‌ అన్‌లాక్ తాత్కాలికమా లేదా శాశ్వతంగానా అని అడుగుతుంది. ఇందులో మీకు కావల్సిన ఆప్షన్‌ ఎంచుకోవాలి.
  5. ఎంచుకొని Nextపై క్లిక్ చేయాలి. Your biometrics have been unlocked sucessfully అని స్క్రీన్‌పై కనిపిస్తుంది. అంతే మీ బయోమెట్రిక్‌ అన్‌లాక్‌ అయినట్టే.
  6. తాత్కాలికంగా అన్‌లాక్ ఆప్షన్‌ ఎంచుకుంటే కేవలం 10 నిమిషాలు మాత్రమే మీ బయోమెట్రిక్‌ అన్‌లాక్‌ అవుతుంది.
  7. అయితే, ఒకవేళ ఆధార్‌ బయోమెట్రిక్‌ వివరాలను లాక్‌ చేసినా.. ఓటీపీ ఆధారిత వెరిఫికేషన్‌ పూర్తి చేసుకోడంలో ఎలాంటి ఇబ్బందీ ఉండదు.