Search This Blog

Sunday, June 25, 2023

READ Programme Guidelines

READ Programme Guidelines

రీడ్ కార్యక్రమం

*అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 26 జూన్ నుండి పఠనోత్సవం నిర్వహించాలి.

*ఈ విద్యా సంవత్సరంలో భాగంగా 26 జూన్ సోమవారం నుండి 31 జూలై వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుండి 10వ తరగతి వరకు విద్యాశాఖ ఆదేశాల మేరకు పఠనోత్సవం కార్యక్రమం నిర్వహించాలి.

READ Programme Guidelines

 *విద్యార్థులు ధారాళంగా చదవడం చదవడం ఒక అలవాటుగా చేసుకోవడం చదువుతూ ఆనందం పొందడం స్వతంత్ర పాఠకులుగా ఎదగడం దీని యొక్క ప్రధాన లక్ష్యాలు.

*పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులందరూ ఈ కార్యక్రమం నిర్వహించాలి* *ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షణ చేయాలి.

*ఇందులో భాగంగా ప్రతిరోజు పుస్తక పఠనం కోసం ఒక పీరియడ్ ( లైబ్రరీ) కేటాయించాలి.

*ప్రతిరోజు ప్రతి పీరియడ్లు ప్రతి ఉపాధ్యాయుడు తన సబ్జెక్టుకు సంబంధించిన అంశాన్ని విద్యార్థులతో పది నిమిషాలు బాహ్య పఠనం చేయించాలి.

*చార్టులపై లేదా నల్లబల్లపై పదాలను రాసి ప్రదర్శించాలి.

*అలాగే గ్రంధాలయ పీరియడ్  లో ప్రతిరోజు విద్యార్థులచే కథల పుస్తకాలు చదివించాలి.

*మూడు రోజులు మాతృభాషలో మిగతా మూడు రోజులు ఆంగ్ల భాషలోని కథల పుస్తకాలు చదివించాలి.

*గ్రంథాలయ కమిటీలను ఏర్పాటు చేయాలి వీరు విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా పుస్తకాలు గ్రంథాలయం నుండి ఎంపిక చేసుకుని చదివేలా ప్రోత్సహించాలి.

*విద్యార్థులు చదివే స్థాయిని బట్టి వారిని గ్రూపులుగా విభజించి ఒకరికొకరు సహాయం చేసుకునే విధంగా ప్రోత్సహించాలి.

*ఇంటి వద్ద కూడా విద్యార్థులు చదివే విధంగా వారికి గ్రంథాలయ పుస్తకాలతో పాటు రకరకాల మ్యాగజిన్ లు కూడా ఇవ్వాలి, వాటిని తల్లిదండ్రులకు చదివి వినిపించమని చెప్పండి.

*ప్రతిరోజు ప్రార్థన సమయంలో ఇద్దరు లేదా ముగ్గురు విద్యార్థులచే పుస్తకాలను చదివించాలి.

*విద్యార్థులు చదివే సందర్భంలో వాటిని వీడియో చేసి పాఠశాల గ్రూపుల్లో షేర్ చేయాలి, అలాగే వాటిని జిల్లా స్థాయికి రాష్ట్రస్థాయికి తల్లిదండ్రులకు పంపాలి.

*విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచేందుకు ప్రతి శనివారం పట్టణ పోటీలు నిర్వహించాలి

*ప్రతి మాసంలో మూడో శనివారం తల్లిదండ్రుల సమావేశంలో విద్యార్థులచే చదివించాలి బాగా చదివే పిల్లలను అభినందించాలి.

*విద్యార్థులు ఇంటి వద్ద కూడా చదివే విధంగా తల్లిదండ్రులని ప్రోత్సహించమని చెప్పాలి

*విద్యార్థుల పుట్టినరోజు సందర్భంగా వారికి బహుమతులుగా పుస్తకాలని ఇవ్వాలి

*స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేయాలి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సభ్యులను ఇందుకోసం వినియోగించుకోవాలి.

*అన్ని పాఠశాలల్లో 10 జూలై నుండి 15 జులై వరకు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించాలి.*

*విద్యార్థులకు వ్యాసరచన ఉపన్యాస పోటీలను నిర్వహించాలి.

*విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రముఖులు, ఇతరులు పాఠశాలను సందర్శించిన సందర్భంలో వారిచే గ్రంథాలయంలోని కథల పుస్తకాలను విద్యార్థుల ముందు వారిచే చదివింప చేసి విద్యార్థులలో పుస్తక పఠనం పట్ల ఆసక్తిని పెంపొందింప చేయాలి.

*15 జూలై రోజు అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించి ప్రముఖులను ఆహ్వానించాలి.

*ప్రతి ఉపాధ్యాయుని వద్ద తమ తరగతిలో వారి వారి సబ్జెక్టులో ఎంత మంది విద్యార్థులు ధారాళంగా చదువుతారు ఎంతమంది నెమ్మదిగా చదువుతారు ఎంతమంది చదువు రానివారు ఉన్నారు మొదలైన వివరాలు కలిగి ఉండాలి.

*ప్రధానోపాధ్యాయుల వద్ద మొత్తం పాఠశాలకు సంబంధించిన వివరాలు ఉండాలి.

*కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తమ పరిధిలోని అన్ని పాఠశాలలను నెలకు ఒకసారి కనీసంగా సందర్శించి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలి, కాంప్లెక్స్ సమావేశాల్లో వీటిని సమీక్షించుకోవాలి.

*మండల విద్యాధికారులు నోడల్ అధికారులు తొలిమెట్టు కార్యక్రమంలో సూచించిన విధంగా వివిధ పాఠశాలలను సందర్శించినప్పుడు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేయాలి.

*మండల , జిల్లా స్థాయిలో తెలుగు, ఆంగ్లము, హిందీ, ఉర్దూ, ఉపాధ్యాయులతో కోర్ కమిటీ టీం ఏర్పాటు చేసి వారు ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా కథలు గేయాలు ఆడియో స్టోరీస్ మొదలైన వాటిని పాఠశాలలకు పంపే విధంగా చూడాలి.

*జిల్లాస్థాయిలో నెలకొకమారు మండల విద్యాధికారులు నోడల్ అధికారులు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించుకోవాలి, ఇందులో డైట్ లెక్చరర్స్ ను భాగస్వాములు చేయాలి.

*రాష్ట్రస్థాయిలోని ఎస్సీఈఆర్టీ సమగ్ర శిక్ష అధికారులు వివిధ జిల్లాలో మానిటరింగ్ నిర్వహిస్తారు.

*ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తే దీనిద్వారా తొలిమెట్టు ద్వారా మనం ఆశించే ఫలితాలను మరింత తొందరగా చేరుకుంటాం కావున ఈ కార్యక్రమంలో అందరూ ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు నోడల్ అధికారులు పాల్గొని విజయవంతం చేయాలి.

Click Here to Download

Read Program Guidelines

English Short and Moral Stories for Children 


*READ Campaign*


 *పఠనోత్సవం - 1st  to  10th Class.*


మీరు రేపు బడికి వెళ్లి మీ విద్యార్థులను *3 గ్రూపులు* చేసుకోండి.


*1.ధారాళంగా చదివే వారు,*


*2.ఆగి-ఆగి చదివే వారు లేదా - ధారాళంగా చదవ లేని వారు,*


*3.అసలు చదవలేని వారు.*


*ఓ కాపీలో మూడు గ్రూపులు చేసి పిల్లల పేర్లు వ్రాసుకోండి. మీ Headmaster గారికి ఓ కాపీ ఇవ్వండి. రేపటి Date 26.6.2023 వేసుకోండి.*

    *ఇగ మీ పవిత్ర కార్యం ద్వారా మీ పిల్లలు మీరు చెప్పే భాషను, మిమ్ములను అనుకరిస్తూ ధారాళంగా తప్పులు లేకుండా చదవడం నేర్చుకుంటారు. వారానికోసారి సారి మీరే సమీక్ష చేసుకోండి. పిల్లల అభివృద్ధిని నమోదు చేసుకోండి. బాగా చదవగలిగిన పిల్లలను మొదటి గ్రూపులో వ్రాసుకోండి. వారం తరవాత ప్రగతిని చూపిస్తూ HM గారికి రిపోర్ట్ ఇవ్వండి.*


    *SCERT నుండి అధికారులెవరైనా వస్తే తరగతి గదికి సాదరంగా ఆహ్వానించి,  పిల్లల ప్రగతిని వారి మాటల్లోనే చెప్పించండి. బస్ అంతే, మీ పవిత్ర కార్యం సఫలమవుతుంది. పిల్లలు ఎనలేని ఆనందంతో అభ్యసనా సామర్థ్యాలను సాధిస్తూ మీకు మంచి పేరు తెస్తారు.*