TSPSC Group-1 Mains Exam Pattern and Syllabus
TSPSC గ్రూప్-1 ప్రధాన పరీక్ష విధానం ఖరారు
సబ్జెక్టు నిపుణుల కమిటీ సిఫార్సుకు ఆమోదం
గ్రూప్-1 ప్రధాన పరీక్షల ప్రశ్నపత్రం విధానాన్ని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. సబ్జెక్టు నిపుణుల కమిటీ సిఫార్సులను కమిషన్ ఆమోదించింది. ఈ మేరకు పరీక్ష విధానం వివరాలను వెబ్‌సైట్లో పొందుపరిచింది. ప్రధానపరీక్షలో ఒక్కోపేపరుకు 150 మార్కుల చొప్పున మొత్తం 900 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పదోతరగతి స్థాయిలో ఇంగ్లిష్ పరిజ్ఞానంపై 150 మార్కులకు అర్హత పరీక్ష నిర్వహించనుంది.
పరీక్ష విధానం ఇలా...
పేపర్-1 : జనరల్ ఎస్సే
ఈ పేపర్‌లో మూడు సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్‌కు 50 మార్కులు కేటాయించారు. ఒక్కో సెక్షన్‌లో మూడు ప్రశ్నలు ఉంటాయి. ప్రతిసెక్షన్‌లో ఒక ప్రశ్నకు తప్పనిసరిగా సమాధానం రాయాలి. ఇది వెయ్యిపదాల్లో ఉండాలి. మూడు సెక్షన్లకు కలిపి 150 మార్కులు ఉంటాయి.
పేపర్-2 : చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ
పేపర్-3 : భారతీయ సమాజం, రాజ్యాంగం, పరిపాలన
పేపర్-4 : ఎకానమీ, డెవలప్‌మెంట్
పేపర్-2, 3, 4లలో మూడు సెక్షన్లు ఉంటాయి. ప్రతిసెక్షన్‌లో అయిదు ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఒక్కో సెక్షన్‌కు 50 మార్కులుంటాయి. ప్రశ్నకు సమాధానం 200 పదాల్లో ఇవ్వాలి. ఒక్కోప్రశ్నకు పది మార్కులు ఉంటాయి. అయితే ఒక్కో సెక్షన్‌లో అయిదు ప్రశ్నల్లో తొలిరెండు ప్రశ్నలకు సమాధానం తప్పనిసరిగా ఇవ్వాలి. మూడు, నాలుగు, అయిదు ప్రశ్నల్లో ఛాయిస్ ఆప్షన్ ఉంటుంది.
పేపర్-5 : సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్
ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి. మొదటి రెండు సెక్షన్లలో అయిదు ప్రశ్నల చొప్పున ఉంటాయి. ఈ సెక్షన్లలో తొలిరెండు ప్రశ్నలకు తప్పనిసరిగా జవాబు ఇవ్వాలి. మిగతా మూడు ప్రశ్నలకు ఛాయిస్ ఉంటుంది. ప్రశ్నలకు సమాధానం 200 పదాల్లో ఉండాలి. ఇక మూడో సెక్షన్‌లో మొత్తం 30 ప్రశ్నలుంటాయి. వీటిలో 25 ప్రశ్నలకు సమాధానమివ్వాలి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున 50 మార్కులు ఉంటాయి.
పేపర్-6 : తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు
ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి. ప్రతిసెక్షన్‌లో అయిదు ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానం రాయాలి. ప్రతి ప్రశ్నకు సమాధానం 200 పదాల్లో ఇవ్వాలి. ఒక్కోప్రశ్నకు పది మార్కులు చొప్పున మొత్తం 15 ప్రశ్నలకు 150 మార్కులు కేటాయించింది. అయితే ఒక్కో సెక్షన్‌లోని అయిదు ప్రశ్నల్లో తొలిరెండు ప్రశ్నలకు సమాధానం తప్పనిసరి ఇవ్వాలి. ఇందులో ఛాయిస్ ఉండదు. మూడు, నాలుగు, అయిదు ప్రశ్నల్లో ఛాయిస్ ఆప్షన్ ఉంటుంది.
*➡️జనరల్‌ఇంగ్లిష్ అర్హత పరీక్ష: ఇందులో పదిహేను ప్రశ్నలు ఉంటాయి.
TSPSC Group 1 Mains Exam Pattern 2023
TSPSC Group 1 Mains Exam consists of 6 descriptive papers and a qualifying English language paper.
The duration of each paper is 3 hours.
General English is of qualifying nature and marks will not be added to the merit list.
There will be no negative marking in the TSPSC Group 1 Mains Exam.
The language of the Mains Exam will be English, Telugu, and Urdu.
TSPSC Group 1 Mains Syllabus
Check TSPSC Group 1 Mains Syllabus for General English, General Essay, History, Culture, and Geography, Indian Constitution, Society and Governance, Economy and Development, Science and Technology and Data Interpretation, and Telangana Movement and State Formation from the below table-
1 . General English (Qualifying)
Spotting Errors – Spelling; Punctuation
Fill in the blanks – Prepositions; Conjunctions; Verb tenses
Re-writing sentences – Active and Passive voice; Direct & Reported Speech
Usage of Vocabulary
Jumbled sentences
Comprehension
Précis Writing
Expansion
Letter Writing
2. Paper-1 (General Essay)
Contemporary Social Issues and Social Problems
Issues of Economic Growth and Justice
Dynamics of Indian Politics
Historical and Cultural Heritage of India
Developments in Science and Technology
Education and Human Resource Development
3. Paper 2 (History, Culture, and Geography)
Modern Period (1757-1947 AD) history and culture of India
Telangana culture and history
Telangana Geography
Indian Geography
4. Paper 3 (Indian Constitution, Society and Governance)
Indian Society Structure
Social Movements and Issues
Constitution of India
Governance aspects
5. Paper 4 (Economy and Development)
Indian Economy and Development
Economy of Telangana
Development and Environment issues
6. Paper 5 (Science and Technology and Data Interpretation)
Science and Technology role and its effects
Recent trends in Science
Problem Solving and Interpretation of Data
7. Paper 6 (Telangana Movement and State Formation)
Telangana Movement
Mobilization Phase
Formation of Telangana State