సర్వీస్ పెన్షన్ & కమ్యూటేషన్ విలువ లెక్కించు విధానం.
దీనిలో ముఖ్యంగా 3 స్టెప్స్ ఉన్నాయి.
1.సర్వీస్ పెన్షన్ కనుక్కోవడం.
2.commutation అమౌంట్ కనుక్కోవడం
3.total commutation అమౌంట్ తెలుసుకోవడం.
Ex. ఒక ఉద్యోగి రిటైర్మెంట్ సమయం(61 ఇయర్స్) లో అతని బేసిక్ పే 67990 రూపాయలు ఉన్నప్పుడు సర్వీస్ పెన్షన్ ,commutation విలువ కనుక్కొందాం.
STEP 1
సర్వీస్ పెన్షన్ .
సూత్రం:లాస్ట్ బేసిక్ పే X టోటల్ సర్వీస్ /66
ఆ ఉద్యోగికి గ్రేస్ పీరియడ్ (5 ఇయర్స్)కలుపుకొని 33 ఇయర్స్ సర్వీస్ ఉన్నచో...
67990 X 33/66=33995 రూపాయలు ఆ ఉద్యోగి సర్వీస్ పెన్షన్.
STEP:2
సర్వీస్ పెన్షన్ లో 40 శాతం COMMUTATION చేస్తాడు అనుకొంటే...
సర్వీస్ పెన్షన్ X 40/100.
33995 X 40/100 = 13598 రూపాయలు వస్తుంది.
అసలు విషయానికి వద్దాం.
TOTAL COMMUTATION వాల్యూ అమౌంట్ కనుక్కోవడానికి ప్రభుత్వం 1971 చట్టం ప్రకారం ఒక టేబుల్లో విలువలను తెలిపింది ,ఆ విలువలను బట్టి టోటల్ COMMUTATION విలువ వస్తుంది.
దీనిని కనుక్కొనే టప్పుడు ఉద్యోగి రిటైర్ అయిన next ఇయర్ విలువను లెక్కించాలి.
తెలంగాణ ఉద్యోగి 61 కి రిటైర్ అయితే 62 ఇయర్ వాల్యూ తో లెక్కించాలి.as per table 62 ఇయర్స్ value.8.093.
STEP: 3
ఇప్పడు టోటల్ పెన్షన్ commutation value సూత్రం.
Commutation పెన్షన్ అమౌంట్ X 12 X 8.093.
ఇక్కడ 13598 X 12 X 8.093 =1320583.
Note:ఇక్కడ ఆ ఉద్యోగి quantam of pension period తగ్గించడానికి గాని ,రిటైర్మెంట్ ఏజ్ పెంచడానికి గాని ఎలాంటి సంబంధం లేదు.