Saturday, June 12, 2021

How To Claim Money From The Savings Bank Account Of A Dead Person?

How To Claim Money From The Savings Bank Account Of A Dead Person?
Withdrawal of money from deceased person's account.
How can we withdraw money from a dead person's account?
 మ‌ర‌ణించిన వారి బ్యాంకు ఖాతా నుంచి విత్‌ డ్రా ఎలా?
Many elderly individuals who have opened account at a very early stage may not have made a nomination. While ideally you must, here are is what could happen in case the person meets with death and there is no nomination in the savings account. A few method in which money can be claimed from the savings account of a dead person.
ఉదాహ‌ర‌ణ‌కు బ్యాంకు ఖాతాను తీసుకుంటే.. మ‌ర‌ణించిన వ్య‌క్తికి బ్యాంక్ ఖాతా ఉంటే ఆ విష‌యం కుటుంబ స‌భ్యుల‌కు తెలిస్తే, బ్యాంకు నుంచి డ‌బ్బు విత్‌డ్రా చేసుకోవ‌డం సుల‌భం అవుతుంది. పిన్ నెంబ‌రు తెలిస్తే, ఏటీఎం ద్వారా ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. ఒక‌వేళ తెలియ‌క‌పోయినా బ్యాంకును సంప్ర‌దించి, కొన్ని ప‌త్రాలు స‌మ‌ర్పించ‌డం ద్వారా ఖాతాలో ఉన్న సొమ్మును విత్‌డ్రా చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.  ఇందుకు కాస్త స‌మ‌యం ప‌ట్టొచ్చు.

How To Claim Money From The Savings Bank Account Of A Dead Person

నామినీని ఏర్పాటు చేసి ఉంటే.

ఒక‌వేళ ఖాతాదారుడు, నామినీని ఏర్పాటు చేసి ఉంటే ఖాతాలో ఉన్న మొత్తాన్ని బ్యాంక్‌ నామినీకి చెల్లిస్తుంది. డిపాజిట్ చేసిన వ్య‌క్తి మ‌ర‌ణిస్తే, నామినీ ఆ ఖాతాకు ధ‌ర్మ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. వ్య‌క్తిగ‌త ఖాతాకు సంబంధించి ఖాతాదారుడు మ‌ర‌ణించిన త‌రువాత ఆ ఖాతాలోని నిధుల‌ను నామినీ యాక్సిస్ చేయ‌వ‌చ్చు. ఒక‌వేళ నామినీ ఏర్పాటు చేయ‌క‌పోతే, చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన వార‌సులుకు అంద‌జేస్తారు.
సింగిల్ ఖాతా..
వ్య‌క్తిగ‌త ఖాతా విష‌యంలో మ‌ర‌ణించిన వ్య‌క్తి విల్ ఏర్పాటు చేసి ఉంటే దాని ప్ర‌కారం, హ‌క్కుదారులు ఆస్తిని క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. ఒక‌వేళ లేక‌పోతే ఇండెమ్నిటి-క‌మ్‌-అఫిడెవిట్ బేసిస్‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన వార‌సుల‌కు ఆస్తుల‌ను బ్యాంక్‌ అప్ప‌గిస్తుంది. క్లెయిమ్ చేసే వారిపై ఎలాంటి సందేహాలు, గొడ‌వ‌లు, స‌మ‌స్య‌లు లేక‌పోతే, చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన వార‌సులంద‌రూ క‌లిసి ఉమ్మ‌డిగా ఇండెమ్నిటి స‌మ‌ర్పించి క్లెయిమ్ చేసుకోవచ్చు.
జాయింట్ ఖాతాల విష‌యంలో 
ఒక ఖాతాదారుడు మ‌ర‌ణించినా.. జీవించి ఉన్న వ్య‌క్తి ఖాతాలోని డ‌బ్బును తీసుకోవ‌చ్చు. ఖాతాను నిర్వ‌హించేదుకు రెండో వ్యక్తికి పూర్తి అధికారం ఉంటుంది. తాము లేనన‌ప్పుడు కుటుంబ స‌భ్యుల‌కు ఎటువంటి ఇబ్బందులూ తలెత్త‌కుండా వ్య‌క్తిగ‌త ఖాతాను తెరిచి నామినీని త‌ప్ప‌నిస‌రిగా నియ‌మించాలి.  మ‌ర‌ణం త‌రువాత సంపూర్ణ య‌జమాని కావాల‌నుకునేవారు ఆ వ్య‌క్తితో క‌లిసి జాయింట్ ఖాతాను తెర‌వొచ్చు.
ప్రాసెస్‌..
ఖాతాదారుని మ‌ర‌ణానంత‌రం ఖాతాలోని మొత్తాన్ని తీసుకునేందుకు ఒక ప్రాసెస్ ఉంటుంది. ముందుగా మ‌ర‌ణించిన వ్య‌క్తి డెత్ స‌ర్టిఫికేట్‌ (మ‌ర‌ణ ధ్రువీకరణ పత్రం)ను తీసుకోవాలి. దీంతో పాటు అవ‌స‌ర‌మైన అన్ని ప‌త్రాలు.. నామినీ ఐడీ, అడ్రస్‌ ప్రూఫ్‌ వంటివి బ్యాంకుకు ఇవ్వాలి. నామినీ ట్రస్టీగా మాత్ర‌మే వ్య‌హ‌రించాలి. ఖాతాదారుడు విల్లు రాసి ఉంటే దాని ప్ర‌కారం హ‌క్కుదారుల‌కు ఆ మొత్తాన్ని అందించాలి. నామినీ కూడా చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన వార‌సుడైతే, విల్లులో ప్ర‌స్తావించిన విధంగా ఇత‌ర చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన వార‌సుల‌తో పాటు నామినీ కూడా క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. విల్లు లేక‌పోయినా ఆ మొత్తాన్ని చ‌ట్ట‌బ‌ద్ధమైన హ‌క్కుదారుల‌కు అంద‌జేయాలి.
It is always a better proposition to open a joint account or one that has a nomination. This would ensure that you would have people who are family members get the proceeds from the savings bank account of a dead person.