Friday, May 21, 2021

How to change/Update Address in Aadhar Card with out any ID Proofs

How to change/Update Address in Aadhar Card  with out any ID Proofs

 ప్రూఫ్స్ లేకుండానే ఆధార్‌లో అడ్ర‌స్ మార్చ‌డ‌మెలా

మీ ఆధార్ కార్డు (Aadhar ) పై ఉన్న‌ అడ్ర‌స్ నుంచి మారిపోయారా? కొత్త అడ్ర‌స్‌ను అప్‌డేట్ చేయ‌డానికి స‌మ‌యం దొర‌కడం లేదా? ఒక‌వేళ స‌మ‌యం దొరికినా అప్‌డేట్ చేయ‌డానికి కొత్త అడ్ర‌స్‌పై ఎలాంటి ప్రూఫ్స్ లేవ‌ని ఆలోచిస్తున్నారా? అయితే ఇప్పుడు దాని గురించి పెద్ద‌గా ఆలోచించాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే ఎలాంటి అడ్ర‌స్ ప్రూఫ్ లేకుండానే ఆధార్ కార్డులో మ‌న అడ్ర‌స్‌ను మార్చుకునే స‌దుపాయాన్ని యూఐడీఏఐ అందుబాటులోకి తీసుకొచ్చింది. అది కూడా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్ల‌కుండా ఆన్‌లైన్‌లోనే అడ్ర‌స్ మార్చుకునే వెసులుబాటు క‌ల్పించింది. మ‌రి ఆన్‌లైన్ ద్వారా అడ్ర‌స్ మార్చుకోవ‌డం ఎలాగో ఈ కింది స్టెప్స్ ద్వారా తెలుసుకోండి.

How to change/Update Address in Aadhar Card  with out any ID Proofs

ముందుగా ఆధార్ అధికారిక వెబ్‌సైట్ (https://uidai.gov.in/) ఓపెన్ చేయాలి.

హోం పేజిలోని My aadhaar సెక్ష‌న్‌లో Update your aadharపై క్లిక్ చేయాలి

ఆ త‌ర్వాత Update Demographics Data Online పై క్లిక్ చేయాలి.

 అప్పుడు ఆధార్ సెల్ఫ్ స‌ర్వీస్ అప్‌డేట్ పోర్ట‌ల్ ఓపెన్ అవుతుంది. అందులో  Proceed to Update Aadhaar పై క్లిక్ చేయాలి.

ఆధార్ నంబ‌ర్‌, క్యాప్చా కోడ్ ఎంట‌ర్ చేసి Send OTPపై క్లిక్ చేయాలి.

మీ రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌ర్‌కు వ‌చ్చిన ఓటీపీని అక్క‌డ ఎంట‌ర్ చేసి లాగిన్ అవ్వాలి.

లాగిన్ అయ్యాక Update Addressపై క్లిక్ చేయాలి

అప్పుడు మీకు రెండు ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి. అవి 1. Update Address via Address Proof  2. Update Address via Secret Code 

మొద‌టి ఆప్ష‌న్‌ను ఎంచుకుంటే అడ్ర‌స్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ స‌బ్‌మిట్ చేయాల్సి ఉంటుంది.

మీ ద‌గ్గ‌ర అడ్ర‌స్ ప్రూఫ్ లేక‌పోతే Address Validation Letterను తీసుకోవాలి

దీని కోసం నాలుగు స్టెప్స్ ఫాలో అవ్వాలి. అవి 

◆1. Resident initiates request, 

◆2. Address verifies consents, 

◆3.Resident submits request, 

◆4.Use secret code to complete. 

★ఈ నాలుగు స్టెప్స్ పూర్తి చేస్తే మీకు అడ్ర‌స్ వ్యాలిడేష‌న్ లెట‌ర్ పోస్టులో వ‌స్తుంది.

★ఆ లెట‌ర్ వ‌చ్చాక పైన చెప్పిన రెండో ఆప్ష‌న్(Update Address via Secret Code )‌ను ఎంచుకోవాలి

★లెట‌ర్‌లో ఉన్న సీక్రెట్‌ను కోడ్‌ను అక్క‌డ ఎంట‌ర్ చేయ‌డం ద్వారా ఆధార్ కార్డులో అడ్ర‌స్ అప్‌డేట్ చేసుకోవ‌చ్చు. 

★ఈ ప్రాసెస్ మొత్తం పూర్తి చేయ‌గానే ఒక స‌ర్వీస్ రిక్వెస్ట్ నంబ‌ర్(SRN) వ‌స్తుంది.‌

 ★ఈ SRN నంబ‌ర్ ద్వారా అడ్ర‌స్ అప్‌డేష‌న్ స్టేట‌స్‌ను తెలుసుకోవ‌చ్చు.```