TS Intermediate 2021 Model Question Papers Download
TS: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లో మోడల్ కొశ్చన్ పేపర్స్
కోవిడ్ కారణంగా విద్యాసంస్థలు మూతబడిన నేపథ్యంలో ఇంటర్మీడియట్ సిలబస్‌ను 70 శాతానికే పరిమితం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇంటర్ పరీక్షల ప్రశ్నాపత్రాల్లో స్వల్ప మార్పులు చేశారు. ఈ మేరకు ఇంటర్ మోడల్ పేపర్స్‌ను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. అన్ని సబ్జెక్టుల ప్రశ్నాపత్రాల్లో మార్పులు చేసినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది.
రెండు మార్కుల ప్రశ్నలు పదింటికి పది రాయాల్సి ఉంటుంది. 4 మార్కులు, 8 మార్కుల ప్రశ్నల్లో మార్పులు చేశారు. మోడల్ పేపర్స్ కోసం* https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
TS Intermediate 2021 Model Question Papers Download
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను మే 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. మే 1 నుంచి 19 వరకు ప్రథమ సంవత్సరం, మే 2 నుంచి 20 వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు.* *ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయి.
ఏప్రిల్ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్నల్ పరీక్షలయిన ఎథిక్స్ అండ్ హ్యుమన్ వ్యాల్యూస్ పరీక్షను ఏప్రిల్ 1న, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను ఏప్రిల్ 3న నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారిక షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు.
Click Here to Download TS Inter Model Question Papers