Are you taking out a personal loan? Things to keep in mind when taking a personal loan
Personal loanis one of the few ways to deal with immediate financial needs and unforeseen expenses. When one needs funds in time of an emergency, a personal loan comes in handy. Personal loans are nothing but unsecured loans that can be obtained easily if one has a regular income Debt means risk. No matter what the mistake, the consequences can be long lasting. Have a profound effect on our financial situation. Moreover, personal loans are relatively easy to obtain compared to other home and auto loans. Difficulties are not to be mistaken if the various offers made by the banks in this order are not properly understood. In this context focus on a few minimum things before taking out personal loans
Check credit scoreWhenever we go to a bank for a personal loan, the first thing they do is check our credit score. Some banks use their own procedures to verify a persons creditworthiness. In this context we need to make sure that our credit score does not fall. Those with a score above 750 are more likely to get a loan. This varies depending on our financial activities. Maintaining a good score due to timely installment payments and timely payment of credit card bills
If necessary,as neededPersonal loans are relatively easy to obtain compared to other types of loans. Banks are interested in giving you a higher amount if your credit score is good. Some even come forward to make offers. Care must be taken at such times. Take as much as you need. Decide how much to take into account, such as your ability to repay, future expenses, your liabilities, and other debts. It is best to take as much as you need for your immediate need. Many EMI calculators online if possible
Market studyMany banks and financial institutions will come forward to give you a loan if your financial situation and credit score are good. Find out what the companies are offering. See how profitable they are. Consult a financial expert if necessary. Find and compare interest rates of different banks. Find out about other costs such as processing fees. Assess all this and take a loan from a trusted company that offers low cost. Do not forget that it is possible to bargain with them for a lower interest rate
Do not apply to more companies at onceDo not resort to multiple companies for simultaneous loan applications. Terms vary depending on the organization. You may not be eligible under their terms. The credit score goes down as companies refuse to do so. Rely on trusted, market reputable companies. Do not consult intermediaries working for the Commission in this order. Leading banks and financial institutions do not rely on brokers. They have their own system for granting loans, employees. It is better to contact the banks directly.
Read the contract document thoroughlyYou will need to sign a loan agreement before handing over the money. Read the terms and conditions in it thoroughly. Double check things like interest rate and maturity. Take care of things like extra fees to pay if late. Ask about the consequences of breaking the rules in unforeseen circumstances. Sign everything if you agree
పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా..అయితే ఈ విషయాలు గుర్తుంచుకోండి
తక్షణ ఆర్థిక అవసరాలను, అనుకోకుండా వచ్చిపడే ఖర్చులను ఎదుర్కోవడానికి ఉన్న అతికొన్ని మార్గాల్లో వ్యక్తిగత రుణం(పర్సనల్ లోన్) ఒకటి. రుణం అంటేనే రిస్క్. ఏమాత్రం పొరపాటు చేసినా దాని పర్యవసానాలు దీర్ఘకాలం ఉంటాయి. మన ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. పైగా గృహ, వాహన వంటి ఇతర రుణాలతో పోలిస్తే వ్యక్తిగత రుణాలు పొందడం కాస్త తేలికనే చెప్పాలి. ఈ క్రమంలో బ్యాంకులు చెప్పే వివిధ ఆఫర్లను సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఇబ్బందులు తప్పవు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత రుణాలు తీసుకునే ముందు కొన్ని కనీస విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. అవేంటో చూద్దాం.
క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోండి
మనం ఏ బ్యాంకుకైనా వ్యక్తిగత రుణం కోసం వెళ్లగానే వారు మొట్టమొదట చేసేది మన క్రెడిట్ స్కోర్‌ని చెక్ చేయడం. కొన్ని బ్యాంకుల్లో వారి సొంత విధానాలను వినియోగించి వ్యక్తి రుణ అర్హతను ధ్రువీకరించుకుంటారు. ఈ నేపథ్యంలో మనం మన క్రెడిట్ స్కోర్ పడిపోకుండా చూసుకోవాలి. 750 కంటే అధిక స్కోర్ ఉన్నవారికి రుణం మంజూరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మన ఆర్థిక కార్యకలాపాలను బట్టి ఇది మారుతూ ఉంటుంది. సకాలంలో వాయిదాలు చెల్లించడం, క్రెడిట్ కార్డు బిల్లు గడువులోగా చెల్లించడం వంటి చర్యల వల్ల మంచి స్కోర్ మెయింటైన్ చేయవచ్చు. క్రెడిట్ స్కోర్‌ను తరచూ చెక్ చేసుకోవాలి. తద్వారా ఒకవేళ ఎక్కడైనా తప్పులు దొర్లినా సవరించుకునే అవకాశం ఉంటుంది.
అవసరమైతేనే.. అవసరం ఉన్నంతే
ఇతర రుణాలతో పోలిస్తే వ్యక్తిగత రుణాలు పొందడం కాస్త తేలిక. మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే ఎక్కువ మొత్తంలో ఇవ్వడానికి బ్యాంకులు ఆసక్తి చూపుతాయి. కొన్ని ఆఫర్లను ఇవ్వడానికి కూడా ముందుకు వస్తాయి. అలాంటి సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీకు ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. మీరు తిరిగి చెల్లించే స్తోమత, భవిష్యత్తు ఖర్చులు, మీ బాధ్యతలు, ఇతర రుణాలు వంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఎంత తీసుకోవాలన్నది నిర్ణయించుకోండి. మీ తక్షణ అవసరానికి ఎంత కావాలో అంతే తీసుకోవడం ఉత్తమం. వీలైతే ఆన్‌లైన్‌లో అనేక ఈఎంఐ కాలిక్యులేటర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని వినియోగించుకోవచ్చు. మీ నెలవారీ ఆదాయంలో ఈఎంఐల వాటా 40%-50% మించకుండా చూసుకోవడం ఉత్తమం.
మార్కెట్ అధ్యయనం
మీ ఆర్థిక పరిస్థితి, క్రెడిట్ స్కోర్ బాగుంటే చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణం ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. ఆయా సంస్థలు ఇస్తున్న ఆఫర్లు ఎంటో కనుక్కోండి. అవి ఎంత వరకు లాభదాయకమో చూడండి. అవసరమైతే ఆర్థిక నిపుణుల్ని సంప్రదించండి. వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు కనుక్కొని పోల్చి చూడండి. ప్రాసెసింగ్ ఫీజు వంటి ఇతరత్రా ఖర్చులను ఆరా తీయండి. వీటన్నింటినీ బేరీజు వేసుకొని తక్కువ ఖర్చుతో ఇచ్చే నమ్మకమైన సంస్థ వద్ద రుణం తీసుకోండి. తక్కువ వడ్డీరేటు కోసం వారితో బేరాలాడే అవకాశం ఉంటుందని మరవొద్దు.*
ఒకేసారి ఎక్కువ సంస్థల్లో దరఖాస్తు చేయొద్దు
ఏకకాలంలో రుణం కోసమై అనేక సంస్థల్ని ఆశ్రయించి దరఖాస్తులు ఇవ్వొద్దు. సంస్థను బట్టి నిబంధనలు మారుతుంటాయి. వారి నియమాల ప్రకారం మీరు అర్హులు కాకపోవచ్చు. అలా సంస్థలు తిరస్కరిస్తున్న కొద్దీ క్రెడిట్ స్కోర్ పడిపోతూ ఉంటుంది. నమ్మకమైన, మార్కెట్లో పేరున్న సంస్థల్నే ఆశ్రయించాలి. ఈ క్రమంలో కమిషన్ కోసం పనిచేసే మధ్యవర్తులను సంప్రదించొద్దు. ప్రముఖ బ్యాంకులు, ఆర్థిక సంస్థలేవీ బ్రోకర్లపై ఆధారపడవు. రుణాల మంజూరుకు వారికి సొంత వ్యవస్థ, ఉద్యోగులు ఉంటారు. నేరుగా బ్యాంకులను సంప్రదిస్తేనే మేలు.*
ఒప్పంద పత్రాన్ని క్షుణ్నంగా చదవండి
సొమ్ము మీ చేతికి అందే ముందు రుణ ఒప్పందంపై మీరు సంతకం చేయాల్సి ఉంటుంది. దానిలోని నియమ నిబంధనల్ని క్షుణ్నంగా చదవండి. వడ్డీరేటు, కాలపరిమితి వంటి వాటిని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి. ఆలస్యమైతే చెల్లించాల్సిన అదనపు రుసుము వంటి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో నిబంధనల్ని ఉల్లంఘించినట్లయితే ఉండే పర్యవసానాల్ని అడిగి తెలుసుకోండి. అవన్నీ మీకు సమ్మతమైతేనే సంతకం చేయండి.