TET Paper 1 and Paper 2 Study Materials Download
త్వరలో టేట్
విద్యాశాఖ సన్నాహాలు షురూ*🛍🛍️సిలబస్ రూపకల్పనపై కసరత్తు🌍ప🌍పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహించే చాన్స్‌దరాబాద్, *🌍రా🌍రాష్ట్రంలో టీచర్ అర్హత పరీక్ష(టీఎస్‌టెట్)ను నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ దృష్టి సారించింది. త్వరలోనే టీచర్ల భర్తీ ప్రక్రియ ప్రారంభంకానున్న నేపథ్యంలో టెట్‌ను నిర్వహించాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు. పరీక్షకు సంబంధించి జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి(ఎన్‌సీటీఈ) మార్గదర్శకాల ప్రకారం నియమ నిబంధనలు, సిలబస్ రూపకల్పన, ప్రశ్నల సరళిని రూపొందించటంపై ఎస్సీఈఆర్‌టీ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించి, పరీక్షను కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని భావిస్తున్నారు. కొవిడ్ నిబంధనల దృష్ట్యా ఇదే బెటర్ అని అభిప్రాయపడుతున్నారు. టెట్ నిర్వహణతో బీఈడీ, డీఈడీ, భాషాపండిత కోర్సులు పూర్తి చేసిన దాదాపు మూడున్నర లక్షల మంది అభ్యర్థులకు ప్రయోజనం కలుగనున్నది.
Also Read
TET, DSC - Study Material, Model Papers, Bit Bank, Previous Question Papers Download
For More Related TET TRT DSC Materials Click Here
2017లో టెట్‌ను నిర్వహించారు. అందులో 45 వేల మంది మాత్రమే అర్హత సాధించారు. ఇప్పుడు కొత్తగా 1.50 లక్షల మంది బీఈడీ, డీఈడీ పూర్తిచేసినవారు, గతంలో అర్హత సాధించనివారు దాదాపు రెండు లక్షల వరకు ఉన్నారు. బీఈడీ పూర్తి చేసినవాళ్లు ఎస్‌జీటీకి కూడా అర్హులేనని ఎన్‌సీటీఈ ప్రకటించటంతో ఈ సారి దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. 2021 నుంచి టెట్‌లో ఒకసారి అర్హత సాధిస్తే జీవిత కాలం వర్తిస్తుండటంతో ఈసారి నిర్వహించబోయే పరీక్షకు ప్రాధాన్యత పెరుగనున్నది.
Click Here to Download