dharani.telangana.gov.in Process for Land Registration in Dharani Web Portal Online Slot Booking
Hello everyone here in this page we are providing complete information on what is the form of Dharani. This is the way of Easy slot booking .We can enter all the details of where we are sitting. Everything from verification to registration is online. This Website is designed in such a way to make it understandable to the general public Exchange photos and biometrics with fingerprints. Every inch of the state is deposited in the Dharani Portal
Process for Land Registration in Dharani Web Portal Online Slot Booking @ dharani.telangana.gov.in
యావత్తు రాష్ట్ర ప్రజలు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ధరణి పోర్టల్ పారదర్శకత అనే అత్యున్నత లక్ష్యానికి అనుగుణంగా రూపుదిద్దుకున్నది. రాష్ట్ర చరిత్రలోనే విప్లవాత్మక అడుగు వేస్తూ ఈ నెల 25న దసరా పండుగనాడు ప్రజల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. సాంకేతికంగా ధరణి పోర్టల్ పూర్తిస్థాయిలో రెడీ అయ్యింది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. వాటి ఫలితాలను బట్టి అవసరమైతే చిన్న చిన్న మార్పులు చేసుకొని దసరా నుంచి ప్రజలకు ధరణి అందుబాటులోకి రానున్నది. ఈ సందర్భంగా ధరణి పోర్టల్‌లో ఏమేం ఉంటాయి? స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి? తాసిల్దార్ కార్యాలయంలో లావాదేవీలు ఎలా పూర్తవుతాయి? ఏయే పత్రాలు అవసరం అవుతాయి? వంటి పూర్తి వివరాలతో
పోర్టల్‌లో మూడు భాగాలు
డాటా పోర్టల్
పిటిషనర్ పోర్టల్
డిపార్ట్‌మెంట్ పోర్టల్
1. Data Portal
ఇందులో రాష్ట్రంలోని అన్ని రకాల భూముల వివరాలు ఉంటాయి. వ్యవసాయ, వ్యవసాయేతర, అటవీ భూముల సమగ్ర సమాచారం ఇందులో లభిస్తుంది. ఈ పోర్టల్‌ను ప్రజలకు అందుబాటులోకి తెస్తారని సమాచారం. తద్వారా ప్రపంచంలో ఏ మూలన ఉన్నా భూమి వివరాలను తెలసుకొనే అవకాశం కలుగనున్నది.
2. Petitioner Portal
భూ యజమాని లేదా అమ్మకందారు, కొనుగోలుదారులు, వారసులు భూ లావాదేవీకోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియ మొత్తం ఈ పోర్టల్‌లో ఉంటుంది. ఈ విభాగంలో స్లాట్ బుకింగ్ నుంచి చలాన్ చెల్లించేవరకు ఆప్షన్లు ఉంటాయి.
3. Department Portal
తాసిల్దార్లు, ధరణి ఆపరేటర్లు, ఇతర అధికారులకు మాత్రమే కనిపించే విభాగం ఇది. పిటిషన్‌దారు చలాన్ చెల్లించిన తర్వాత దరఖాస్తు తాసిల్దార్ కార్యాలయానికి చేరినప్పటి నుంచి హక్కు పత్రాలు కొనుగోలుదారు లేదా వారసుల చేతికి వచ్చే వరకు ప్రక్రియ అంతా డిపార్ట్‌మెంట్ పోర్టల్‌లో జరుగుతుంది.
Dharani Website - Check Telangana Land Records Online in Telugu
TS Dharani Website Click Here
Process to Book the Slot for Land Registration Online @ dharani.telangana.gov.in
- ధరణి పోర్టల్‌ను ఓపెన్ చేయగానే అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. ఇందులో ‘అగ్రికల్చర్'పై క్లిక్ చేయాలి.
- తర్వాత వచ్చే పేజీలో ఆరు ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో మొదటి ఆప్షన్ ‘స్లాట్ బుకింగ్ ఫర్ సిటిజన్' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- సిటిజన్ లాగిన్ పేజీలో మొబైల్ నంబర్ ఎంటర్ చేయగానే ఫోన్‌కు ఒక పాస్‌వర్డ్ వస్తుంది. ఆ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత కింద గడుల్లో ఉన్న అంకెలు/అక్షరాలను (క్యాప్చా)ను ఎంటర్ చేయాలి. తర్వాత ‘గెట్ ఓటీపీ’ బటన్ క్లిక్ చేయాలి. వచ్చిన ఓటీపీని కింద ఇచ్చిన గడిలో నమోదు చేయాలి.
- ఓటీపీని నమోదు చేయగానే ‘సిటిజన్ డ్యాష్‌బోర్డ్' పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో ఏడు ఆప్షన్లు కనిపిస్తాయి. రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకునేవారు మొదటి ఆప్షన్ ‘అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ (సేల్/గిఫ్ట్)’ను ఎంపిక చేసుకోవాలి. వెంటనే పక్కన వచ్చే యువర్ అప్లికేషన్‌లో ‘ప్రీ రిజిస్ట్రేషన్'ను ఎంచుకోవాలి.
- ప్రీ రిజిస్ట్రేషన్‌లో ‘నేచర్ ఆఫ్ డీడ్, నేచర్ ఆఫ్ సబ్‌డీడ్'లలో మన లావాదేవీ ఏ రకమో (సేల్/గిఫ్ట్/పార్టిషన్) ఆప్షన్‌ను ఎంచుకోవాలి. చివరగా పట్టాదార్ పాస్‌బుక్ (పీపీబీ) నంబర్‌ను ఎంటర్ చేయాలి. తర్వాత ‘ఫెచ్' బటన్ క్లిక్ చేయాలి.
- పీపీబీ నంబర్‌పై ఉన్న ఆస్తి వివరాలు కనిపిస్తాయి. జిల్లా, మండలం, గ్రామం, ఖాతా నంబర్, యజమాని పేరు, తండ్రి పేరు వంటి వివరాలు వస్తాయి. ఆ తర్వాత సదరు సర్వే నంబర్‌లో ఉన్న సబ్ సర్వే నంబర్లు, వాటి కింద ఎంత విస్తీర్ణంలో భూములు ఉన్నాయో వివరాలు కనిపిస్తాయి. ఈ భూముల్లో ఎంతమేర బదలాయించాలనుకుంటున్నారో వివరాలు ఎంటర్ చేయాలి. ఒకేసారి ఒకటికి మించి సర్వే నంబర్లను ఎంపిక చేసుకోవచ్చు. చివరగా ‘ప్రొసీడ్'ను క్లిక్ చేయాలి.
- తర్వాత వచ్చే ‘ఫోర్ బౌండరీ డీటెయిల్స్'లో అమ్మాల్సిన భూమికి నాలుగు దిక్కులా ఉన్న హద్దుల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందులో విద్యాసంస్థ, అదర్స్, రైల్వే, రోడ్, సర్వే నంబర్, టెంపుల్ తదితర ఆప్షన్లు ఉంటాయి. ఒక్కో దిక్కు ఏ హద్దు ఉన్నదో వివరాలను చేర్చాలి.
- సెల్లర్ డీటెయిల్స్ పేజీలో పట్టాదార్ పాస్‌బుక్ ఆధారంగా అప్పటికే నమోదైన యజమాని ఆధార్ నంబర్, పేరు(తెలుగులో), లింగం, కులం వంటి వివరాలు కనిపిస్తాయి. అనంతరం ఆధార్‌కార్డులో ఉన్న పేరు (ఇంగ్లిష్‌లో), రిలేషన్ టైప్, వయసు, వృత్తి, ఫారం 60/61ను సబ్‌మిట్ చేశారా? అని అడుగుతుంది. ఒకవేళ చేయకపోతే పాన్‌కార్డు నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత భూ యజమాని ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి పూర్తి చిరునామాను నమోదు చేయాలి. చివరగా సేవ్ అండ్ కంటిన్యూ బటన్‌ను క్లిక్ చేయాలి.
- కొనుగోలు చేసే వ్యక్తి వివరాలను నింపాలి. ఇప్పటికే పట్టాదార్ పాస్‌బుక్ ఉంటే ఆ వివరాలు నమోదు చేయాలి. దీంతో ఆ వ్యక్తి పూర్తి వివరాలు ప్రత్యక్షం అవుతాయి. ఆ తర్వాత అన్ని వివరాలు నింపాలి. ఒకవేళ పట్టాదార్ పాస్‌బుక్ లేదని ఎంపిక చేసుకుంటే అక్కడ కనిపించే అన్ని రకాల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
- పేమెంట్ అండ్ ట్రాన్సాక్షన్ సమ్మరీ పేజీలో ట్రాన్సాక్షన్ సమ్మరీ రిసిప్ట్‌ను క్లిక్ చేస్తే ఇప్పటి వరకు మనం నమోదు చేసిన అన్ని రకాల వివరాలు అందులో ప్రత్యక్షం అవుతాయి. భూ లావాదేవీకి సంబంధించి ఎంత చెల్లించాలో కూడా కనిపిస్తుంది. వివరాలన్నీ సరిచూసుకున్న తర్వాత ‘యెస్' అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి ‘ప్రొసీడ్ టు పేమెంట్'ను ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ తప్పుగా నమోదైతే వెనక్కి వెళ్లి మరోసారి వివరాలు నమోదు చేయాలి.
- చలాన్ పేజీలో డబ్బు ఎవరు కడుతున్నారు? సెల్లర్, బయ్యర్, ఇతరులు ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. వెంటనే అప్పటికే మనం ఎంటర్ చేసిన సెల్లర్/బయ్యర్ వివరాలు కనిపిస్తాయి. ఎంత మొత్తం చెల్లించాలో అందులో వివరాలన్నీ కనిపిస్తాయి. ఒకసారి సరిచూసుకొని జనరేట్ చలాన్ ఆప్షన్ ఎంపిక చేయాలి.
- పేమెంట్ డీటెయిల్స్‌లో.. వివరాలన్నీ సరిచూసుకొని ‘ప్రొసీడ్' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అప్పుడు పేమెంట్ ‘గేట్ వే’ తెరుచుకుంటుంది. ఈ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో లేదా చలాన్ ప్రింట్ తీసుకొని వెళ్లి ఎస్‌బీఐ బ్యాంకులో నేరుగా కట్టుకోవచ్చు.
- పేమెంట్ అయిపోయిన తర్వాత మళ్లీ ‘ప్రీ రిజిస్ట్రేషన్' పేజీకి వెళ్లి అక్కడ ‘విట్‌నెస్ డీటెయిల్స్' (సాక్షుల వివరాలు) నమోదు చేయాలి. సాక్షి పేరు, ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, అడ్రస్ ఎంటర్ చేయాలి. కనీసం ఇద్దరు సాక్షులు ఉండాలి.
- ఆ తర్వాత డాక్యుమెంట్ డీటెయిల్స్‌లో అఫిడవిట్-1, అఫిడవిట్-2, ఫారం 60/61ను అప్‌లోడ్ చేయాలి. కావాలంటే నమూనా డాక్యుమెంట్లు పక్కనే ఉంటాయి. వాటిని డౌన్‌లోడ్ చేసుకొని, నింపి, అప్‌లోడ్ చేయవచ్చు. తర్వాత కనిపించే ‘జనరేట్ డాక్యుమెంట్, కన్ఫర్మ్ డాక్యుమెంట్, ప్రొసీడ్ ఫర్ స్లాట్ బుకింగ్' ఆప్షన్లను వరుసగా ఎంపిక చేసుకోవాలి. ఈ సందర్భంగా కనిపించే వివరాలన్నింటినీ సరిచూసుకోవాలి.
- చివరగా స్లాట్ బుకింగ్ ఆప్షన్‌కు వెళ్తుంది. ఇక్కడ అప్లికేషన్ టైప్, టీఎక్స్‌ఎన్ నంబర్, తాసిల్దార్ ఆఫీస్ వంటి వివరాలన్నీ ఆటోమేటిక్‌గా వస్తాయి. పక్కన ఉన్న క్యాలెండర్‌లో ఏ తేదీన, ఏ సమయానికి స్లాట్ ఖాళీగా ఉన్నదో కనిపిస్తుంది. మనకు అనువైన సమయం ఎంపిక చేసుకొని ‘బుక్ స్లాట్' ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. వెంటనే స్లాట్ బుక్ అవుతుంది. కింద కనిపించే ‘ప్రింట్ రిసిప్ట్'ను క్లిక్ చేసి ప్రింటవుట్ తీసుకోవచ్చు.
Documents to be issued to Vendor/Vendee
అమ్మకందారుకు..
అప్‌డేట్ అయిన పాస్ బుక్ (అమ్మిన భూమిని డిలీట్ చేసి) ఇస్తారు.
మ్యుటేషన్ ఆర్డర్
లావాదేవీ సారాంశం రిజిస్ట్రేషన్ అండ్ మ్యుటేషన్ డాక్యుమెంట్
కొనుగోలుదారుకు
అప్‌డేట్ అయిన పాస్‌బుక్ (కొనుగోలు చేసిన భూమిని కలిపి) ఇస్తారు.
కొన్నవ్యక్తికి ఆ గ్రామంలో పాస్‌బుక్ లేకపోతే కొత్త పాస్‌బుక్ ప్రింట్ చేసి ఇస్తారు. దీనిని కొరియర్ ద్వారా కొనుగోలుదారుకు పంపిస్తారు.
రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్
ఈ-పీపీబీలావాదేవీ సారాంశం- రిజిస్ట్రేషన్ అండ్ మ్యుటేషన్ డాక్యుమెంట్ పాస్‌బుక్‌లో ఏముంటాయి?
అమ్మకందారు..
లావాదేవీకి ముందు
ఏ సర్వేనంబరు భూమి.. అది ఎన్ని ఎకరాలు ఉంది
లావాదేవీ తరువాత
ఏ సర్వే నంబరు భూమి.. అది ఎన్ని ఎకరాలు ఉంది
ఏ తేదీన విక్రయించారు
ఇతర వివరాలు
కొనుగోలుదారు..
లావాదేవీకి ముందు
పాస్ బుక్‌లో గతంలో ఉన్న భూమి సర్వే నంబరు, ఎన్ని ఎకరాలు ఉంది.
లావాదేవీ తరువాత
పాస్ బుక్‌లో గతంలో ఉన్న భూమి సర్వే నంబరు, ఎకరాలు
ఇప్పుడు కొనుగోలు చేసిన భూమి సర్వే నంబరు, ఎకరాలు
ఏ తేదీన కొనుగోలు చేశారు.
భూముల వివరాలన్నీ ఒకేచోట
హోం పేజీలో అగ్రికల్చర్ ఆప్షన్‌ను ఎంచుకున్నాక మొత్తం ఆరు ఆప్షన్లు కనిపిస్తాయి. ఇందులో మొదటి ఆప్షన్ స్లాట్ బుకింగ్ కాగా, మిగతావి రాష్ట్రంలోని భూముల వివరాలు తెలియజేస్తాయి.
స్టేట్ ల్యాండ్స్ డీటెయిల్స్ రాష్ట్రంలోని మొత్తం భూముల విస్తీర్ణం వివరాలు ఉంటాయి. ఏయే రకం భూములు ఎంతమేర ఉన్నాయో కనిపిస్తుంది.
ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్
పౌరులు రాష్ట్రంలోని ఏ భూమి వివరాలైనా ఇక్కడ తెలుసుకునే అవకాశం ఉంటుంది. జిల్లా, మండలం, గ్రామం, సర్వే నంబర్ ఆధారంగా ఆ భూమి ఎవరి పేరుపై ఉందో తెలుసుకోవచ్చు.
ప్రొహిబిటెడ్ ల్యాండ్స్
రిజిస్ట్రేషన్లు నిషేధించిన భూములు అంటే.. దేవాదాయ, వక్ఫ్, అసైన్డ్, అటవీశాఖ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భూముల వివరాలు ఇందులో ఉంటాయి.
ఎన్‌కంబరెన్స్ డీటెయిల్స్ ఆస్తులకు సంబంధించిన ఈసీ వివరాలు (భూమి లావా దేవీల చరిత్ర) ఉంటాయి.
మార్కెట్ వ్యాల్యూ
సర్వే నంబర్ల వారీగా నిర్దేశించిన మార్కెట్ వ్యాల్యూ, స్టాంప్‌డ్యూ టీ వివరాలు కనిపిస్తాయి.
స్లాట్ బుక్ కాగానే.. భూ యజమాని లేదా అమ్మకందారు ఫోన్‌నంబర్‌కు, కొనుగోలుదారు ఫోన్ నంబర్‌కు ఎస్‌ఎంఎస్ రూపంలో సమాచారం వెళ్తుంది. ఏ సమయంలో ఎక్కడికి రావాలో స్పష్టంగా ఉంటుంది. కింద ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేస్తే ఏయే డాక్యుమెంట్లు అవసరం అవుతాయో సమాచారం వస్తుంది. నిర్దేశిత తేదీన, ఆయా డాక్యుమెంట్లు, కొనుగోలుదారు, అమ్మకందారు, సాక్షులు కలిసి తాసిల్దార్ కార్యాలయానికి వెళ్తే వెంటనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తవుతుంది. హక్కు పత్రాలు చేతికి వస్తాయి. అమ్మకందారు ఖాతా నుంచి ఆ మేరకు విస్తీర్ణం తగ్గిపోయి, కొనుగోలుదారు పేరుమీదికి బదిలీ అవుతుంది. బయ్యర్‌కు అప్పటికే పట్టాదార్ పాస్‌బుక్ ఉంటే తాజా కొనుగోలు భూమి వివరాలు అందులో నమోదవుతాయి. లేకుంటే కొత్త పాస్‌బుక్ వస్తుంది.
స్లాట్ బుక్ అయ్యాక ప్రక్రియ ఇలా..
- స్లాట్ బుక్ చేసుకున్నాక ఆ దరఖాస్తు ధరణి డిపార్ట్‌మెంట్ పోర్టల్‌కు వెళ్తుంది. ఇక్కడ తాసిల్దార్ కమ్ జాయింట్ సబ్‌రిజిస్ట్రార్, డీఈవో (ధరణి ఆపరేటర్) వివిధ దశల్లో ప్రక్రియను పూర్తి చేస్తారు.
- రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ ఇచ్చిన సమయానికి తొలుత ధరణి ఆపరేటర్ (డీఈవో) దగ్గరకు వెళ్లాలి. ఇక్కడ విట్‌నెస్ డీటెయిల్స్ (సాక్షి వివరాలు) నమోదు చేయడంతో పాటు విక్రయదారు, కొనుగోలుదారుల, సాక్షుల బయోమెట్రిక్ (వేలిముద్రలు), ఫొటోలు తీసుకుంటారు. దరఖాస్తు రిజిస్ట్రేషన్/సక్సెషన్/పార్టిషన్ దేనికి ఉద్దేశించినదో పోర్టల్‌లో ఆప్షన్‌ను ఎంపిక చేసి అందులో విట్‌నెస్ వివరాలు నమోదు చేస్తారు. అనంతరం విక్రయదారు, కొనుగోలుదారుల బయోమెట్రిక్, ఫొటోను తీసుకుంటారు. ఫొటోలను అక్కడే వెబ్‌క్యామ్ ద్వారా తీసుకుంటారు.
- అనంతరం తాసిల్దార్ దగ్గరకు వెళ్లాలి. ఇక్కడ బయోమెట్రిక్, ప్రాపర్టీ, స్టాంపుడ్యూటీ వివరాలను తనిఖీ చేసి, ఓ డాక్యుమెంట్ నెంబరు కేటాయించి రిజిస్ట్రేషన్‌ను అప్రూవ్ చేస్తారు. అనంతరం మ్యుటేషన్ అండ్ సైనింగ్ ఆఫ్ రికార్డు ప్రక్రియను పూర్తి చేస్తారు.
- కొనుగోలుదారు, విక్రయదారు అక్కడి నుంచి తిరిగి డీఈవో దగ్గరకు వెళ్లాలి. ఇక్కడే కొనుగోలుదారు, విక్రయదారు ఇద్దరికి పాస్‌బుక్‌లు ప్రింట్ చేసి ఇవ్వడంతో పాటు రిజిస్ట్రార్ డాక్యుమెంట్‌ను ఇస్తారు.
సక్సెషన్ ప్రక్రియ ఇలా
- సక్సెషన్ కోసం స్లాట్ బుక్ చేసుకునే సమయంలో సిటిజన్ డ్యాష్‌బోర్డులో ‘అప్లికేషన్ ఫర్ సక్సెషన్' ఆప్షన్‌ను ఎంపిక చేసుకొని కుటుంబసభ్యుల అందరి వివరాలు నమోదు చేయాలి. అనంతరం కుటుంబ సభ్యులందరూ కలిసి ఉమ్మడిగా రాసుకున్న షేర్ డాక్యుమెంట్ (ఒప్పంద పత్రం)ను అప్‌లోడ్ చేయాలి. మిగతా స్లాట్ బుకింగ్ ప్రక్రియను పూర్తి చేయాలి.
- స్లాట్ ఇచ్చిన సమయానికి కుటంబసభ్యులందరూ కలిసి కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. ధరణి ఆపరేటర్ సంబంధిత వివరాలను తనిఖీ చేసి తాసిల్దార్ దగ్గరకు పంపిస్తారు.
- తాసిల్దార్ కుటుంబసభ్యుల బయోమెట్రిక్ (వేలిముద్రలు), ఫొటోలు తనిఖీ చేస్తారు.
- ఒప్పందం ఆధారంగా కొత్త ఖాతాలు లేదా సర్వే నంబర్లను సృష్టిస్తారు. చివరగా మ్యుటేషన్ ప్రక్రియ పూర్తి చేసి తాసిల్దార్ ఆ పత్రాలను డీఈవోకు పంపిస్తారు. అక్కడ మిగిలిన ప్రక్రియ పూర్తి చేసి హక్కు పత్రాలను చేతికి ఇస్తారు.
Click Here for
Dharani Portal for Land Registration
How to Upload Non Agricultural Property Details Online-TS Dharani Website @ npb.telangana.gov.in
Non Agricultural Property Updation Portal
Government of Telangana started enlisting Non agriculture properties to issue new marron NPB (Non agriculture property book).
The Government of Telangana has decided to register online all non-agriculture properties such as houses constructed near agriculture fields and wells, farm houses and beyond the village settlement areas and incorporate them in the Dharani web portal without collecting any charge.
Therefore no non-agriculture land assessment (NALA) conversion charges will be collected for mutations. Making his government’s intentions clear, chief minister K Chandrashekar Rao on Wednesday said mutations i.e., transfer of properties and property registrations would be done only through Dharani Website in future.He also announced that all the non-agriculture properties would be given maroon colour passbooks on the lines of greencolour passbooks given to the farm.
Therefore finally on this decision given by our Chief Minister there are many doubtes running in the minds of common people like Doubts among the people about personal assets online ? Why assets are being made online. What is its main purpose ...? Are personal details confidential ...?Who should I contact to get online ...? How much fee to pay ...?What kind of documents should be shown for online ...?Should the owner be present when measuring the house ...? If there is only space without a house, will you make it online ...? What kind of documents are required for that ...?How are you doing online within the corporation ...? What documents are required ...?
For all the Answers to the them we have found an arctle in one of the social medias that we are providing here which are given by Kedala Prasad. He has given clearly all answers to the above questions
ఆస్తుల నమోదుకు వెబ్‌సైట్..
మీ–సేవ కేంద్రాల్లో ఉచిత నమోదుకు వెసులుబాటు
యజమానులే స్వయంగా వ్యవసాయేతర ఆస్తులు నమోదు చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్ (www.npb.telangana.gov.in) ను అందుబాటులోకి తెచ్చింది. జీహెచ్‌ఎంసీ సహా రాష్ట్రంలోని ఇతర పురపాలికల్లోని వ్యవసాయేతర ఆస్తులను ఈ వెబ్‌సైట్‌లో యజమానులే నమోదు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శనివారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. మీ–సేవ ద్వారా కూడా ఉచితంగా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మీ–సేవ కేంద్రాలకు చెల్లించాల్సిన చార్జీలను జీహెచ్‌ఎంసీ/పురపాలికలే చెల్లిస్తాయని చెప్పారు.
నకిలీ లావాదేవీలను నిర్మూలించేందుకు ఆధార్ నంబర్, యాజమాన్య హక్కులకు సంబంధించిన లావాదేవీలపై అప్రమత్తం చేసేందుకు మొబైల్ ఫోన్ నంబర్, ఆస్తులపై కుటుంబసభ్యుల హక్కులను పరిరక్షించేందుకు వారి వివరాలను, మెరూన్ రంగు పాసుబుక్‌పై ముద్రించేందుకు యజమాని ఫొటో, స్థలం విస్తీర్ణం/ నిర్మిత ప్రాంతం వివరాలను యజమాని పొందుపర్చాల్సి ఉంటుందని వివరించారు. ప్రవాస భారతీయులు(ఎన్‌ఆర్‌ఐ), ఓసీలకు సంబంధించిన ఆస్తుల నమోదుకు త్వరలో ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. శనివారం నాటికి 75.74 లక్షల ఆస్తుల నమోదు పూర్తవుతుందని పేర్కొన్నారు. ఆస్తుల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం ధరణి ప్రాజెక్టు తీసుకొస్తోందని, ఆస్తుల క్రయవిక్రయాలు జరిగిన వెంటనే మ్యూటేషన్లు జరిగేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు.ఆస్తుల యజమానుల వివరాలను రహస్య (ఇన్‌క్రిప్టెడ్) కోడ్ భాషలో రాష్ట్ర ప్రభుత్వ సర్వర్లలో నిల్వ చేస్తామన్నారు. ఈ సమాచారాన్ని ధరణి అవసరాలకు మాత్రమే వినియోగిస్తామని వివరించారు.
25న ‘ధరణి’ ప్రారంభం: ఈ నెల 25న ధరణి పోర్టల్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు లాంఛనంగా ప్రారంభిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. ఆ రోజు నుంచి తహసీళ్లలో సాగు భూముల రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు మొదలవుతాయని వెల్లడించారు. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్, ధరణి నిర్వహణ, సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు
Non Agriculturl Property Details Online Through TS Dharani Portal dharani.telangana.gov.in
వ్యక్తిగత ఆస్తుల ఆన్‌లైన్‌పై ప్రజల్లో ఉన్న సందేహాలు.. వాటికి సమాధానాలు... సేకరణ:-మీ కేడల ప్రసాద్
ఆస్తులను ఎందుకు ఆన్‌లైన్ చేస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి...?
వ్యవసాయ భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్నట్టే.. వ్యవసాయేతర ఆస్తులకూ పాసు పుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇండ్లతోపాటు, ఇతర ఖాళీస్థలాలపై యాజమానికి ఉన్న హక్కును ధ్రువీకరించడంతోపాటు వాటికి రక్షణ కల్పించాలన్నదే ముఖ్య ఉద్దేశం. పంచాయతీ/ మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు ఉన్న రికార్డు ఆధారంగా ఇండ్లను ఆన్‌లైన్ చేస్తున్నారు. ఇల్లు ఎవరిది? ఎవరి నుంచి ఎవరికొచ్చింది? తర్వాత వారసులెవరు? తదితర వివరాలను ఆన్‌లైన్‌చేసి.. వాటిని మెరూన్ రంగు పాస్‌బుక్‌లో ముద్రించి ఇస్తారు. దీంతో ఏండ్లుగా ఉన్న ఆస్తి వివాదాలకు చెక్ పడటంతోపాటు, భవిష్యత్తులో క్రయవిక్రయాలు సులభంగా, పారదర్శకంగా జరుగుతాయి.
వ్యక్తిగత వివరాలు ఇస్తే గోప్యంగా ఉంటాయా...?
భూ వివాదాల్లేని తెలంగాణను ఆవిష్కరించడమే ప్రభుత్వలక్ష్యం. రికార్డులన్నీ పక్కాగా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. వ్యవసాయ భూముల రికార్డులు దాదాహపు క్లియర్‌గానే ఉన్నాయి. వ్యవసాయేతర భూముల వివరాలు కూడా క్లియర్‌గా ఉండాలనే ఈ ప్రక్రియను చేపట్టారు. ఇంటియాజమానితో పాటు ఇంట్లో ఎవరెవరు ఉంటారు అనే వివరాలు తీసుకుంటున్నారు. కుటుంబానికి సంబంధించిన సమాచారం మొత్తం మెరూన్ పాస్‌బుక్‌లోకి చేరుతుంది. దీంతో వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఆన్‌లైన్ చేసుకోవడానికి ఎవరిని సంప్రదించాలి...? ఎంత ఫీజు కట్టాలి...?
ఇంటిని ఆన్‌లైన్ చేసుకోవడానికి ఎవరి దగ్గరకూ వెళ్లాల్సిన అవసరం లేదు. పంచాయతీ, మున్సిపాలిటీ అధికారులే ఇంటికి వచ్చి వివరాలు నమోదు చేసుకొంటారు. ఇందుకోసం ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంటిపన్ను, నల్లా పన్ను మొదలైనవి బకాయి ఉంటే వాటిని చెల్లిస్తే సరిపోతుంది.
ఆన్‌లైన్ కోసం ఎలాంటి డాక్యుమెంట్లు చూపాలి...?
ఇంటిని ఆన్‌లైన్ చేయడానికి అధికారి వచ్చినప్పుడు యాజమాని ఆధార్‌కార్డుతో పాటు వ్యవసాయ భూముల పట్టాదారు పాసుపుస్తకం చూపించాలి. ఇంటినంబర్/ పట్టాదారు పాసుబుక్ వివరాలు యాప్‌లో నమోదు చేయగానే మీకు సంబంధించిన వివరాలన్నీ అందులోకి వచ్చేస్తాయి. ఎలాంటి డాక్యుమెంట్ కాపీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. పట్టాదారు పాసుపుస్తకాలు లేనివారు ఆధార్‌కార్డుతో పాటు ఉపాధి హామీ కార్డు/ రేషన్ కార్డు/ పెన్షన్ కార్డు/ జీరో అకౌంట్‌లలో ఏదైనా ఒకటి చూపిస్తే చాలు.
ఇంటిని కొలిచేటప్పుడు యజమాని తప్పని సరిగా ఉండాలా...?
యజమాని ఉంటే వివరాలు సమగ్రంగా నమోదుచేయడానికి వీలవుతుంది. ఎలాంటి అనుమానాలు కలిగినా వెంటనే నివృత్తి చేసుకోవచ్చు. కచ్చితంగా రాలేని పరిస్థితి ఉంటే బంధువులు లేదా అద్దెకు ఉంటున్నవారి సహాయంతో వివరాలు అందజేయాలి.
ఇల్లు లేకుండా స్థలం మాత్రమే ఉంటే దాన్ని ఆన్‌లైన్ చేస్తారా...?దానికోసం ఎలాంటి డాక్యుమెంట్లు కావాలి...?
ఇల్లు లేకుండా స్థలం మాత్రమే ఉంటే దాన్ని ఆన్‌లైన్ చేయరు. భవిష్యత్‌లో ఇల్లు కట్టుకున్నప్పుడు ఆన్‌లైన్‌లోకి ఎక్కించి పాస్‌బుక్ జారీ చేస్తారు. అక్రమ లేఅవుట్, వ్యవసాయ భూమిలో ప్లాట్ కొంటే దాన్ని ఎల్‌ఆర్‌ఎస్ పథకం కింద క్రమబద్ధీకరించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఇండ్లను మాత్రమే ఆన్‌లైన్ చేస్తున్నారు
కార్పొరేషన్ పరిధిలో ఆన్‌లైన్ ఎలా చేస్తున్నారు...?ఏమేం డాక్యుమెంట్లు అవసరం...?
కార్పొరేషన్ పరిధిలో ఇప్పటికే దాదాపు అన్నిఇండ్ల వివరాలు సీడీఎంఏ పోర్టల్‌లో నమోదై ఉన్నాయి. వారందరికీ పీటీఐఎన్ (ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్) ఇచ్చారు. ఇతర వివరాలు నమోదు చేయాలనుకునేవారికోసం యజమాని ఫోన్‌నంబర్‌కు ప్రత్యేకంగా వెబ్ లింక్‌ను పంపుతున్నారు. దాని ఆధారంగా మీసేవ పోర్టల్‌లో వివరాలను సరిచూసుకోవచ్చు. ఆ ఇంటికి సంబంధించిన అదనపు వివరాలు, కుటుంబసభ్యుల వివరాలను నమోదు చేయొచ్చు. చివరగా ఇంటి యజమాని ఫొటోను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సొంతంగా వివరాలు అప్‌లోడ్ చేసుకునేందుకు <https://ts.meeseva.telangana.gov.in/>TSPortaleef/UserInterface/Citizen/ RevenueServices/SMSSendOTP.aspx లింక్‌ను సందర్శించవచ్చు.
వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల వివరాలన్నీ ధరణి పోర్టల్‌లో నమోదు కానున్నాయి. ప్రస్తుతం సేకరిస్తున్న వివరాలన్నీ పోర్టల్‌కు అనుసంధానమవుతాయి. తద్వారా భవిష్యత్‌లో క్రయవిక్రయాలు సులభంగా జరుగుతాయి:
Step By Step Process to Upload Property Details Online
- Go to the Official Link given Click Here
- Enter Mobile Number
- Enter OTP (will be recieved to given mobile number)
- Enter Property Falls Under ( GHMC/Muncipality/ Gram Panchayat )
- Enter Property Identification number ( If you don't know your Property Identification Number, then) Click here to Know
- Your Property Form will be opened
- Fill the the details carefully
- At Identification Document Details If u select Non of above, Aadhaar Identification will be allowed
- Photo should be uploaded
- Click on Submit Button
Model Completed Form
Update the property details through online
If you do not have Property Tax Identification Number (PTIN/Assessment No) and want to enlist the property freshly Click Here
TS Dharani Website Click Here