Telangana Intermediate Academic Calendar 2020-21
Telangana Academic calendar has been released for State Intermediate Colleges. The Telangana Inter Board has released the academic calendar of junior colleges a short while ago. The total working days of the academic year are 182 days mentioned in this academic calendar. According to the academic calendar, the people of Telangana give only 3 days for Dussehra and 2 days for Sankranthi, which are considered big festivals.
Inter examinations will be held from March 24 to April 12 next year. The last working day of the academic year is April 16, 2021. However, there is a need for clarity on when to attend colleges directly. Inter first year admissions in government junior colleges started from today. Should the inter-syllabus be reduced in the face of declining working days? The Inter-Board Committees set out the extent to which any curriculum should be eliminated if reduced. However, the Inter-Board officials sent proposals to the government while the committees reported.
ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసిన ఇంటర్ బోర్డ్
తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ అకడమిక్ క్యాలెండర్ విడుదలైంది. జూనియర్ కాలేజీల అకడమిక్ క్యాలెండర్‌ను తెలంగాణ ఇంటర్ బోర్డు నేడు విడుదల చేసింది. విద్యాసంవత్సరం మొత్తం పనిదినాలు 182 రోజులు. దసరాకు 3 రోజులు, సంక్రాంతికి 2 రోజులు మాత్రమే సెలవులు. వచ్చే ఏడాది మార్చి 24 నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు ఇంటర్ పరీక్షల నిర్వహణ. అకడమిక్ ఇయర్ లాస్ట్ వర్కింగ్ డే 2021 ఏప్రిల్ 16.
తెలంగాణా రాష్ట్ర ఇంటర్మీడియట్ కాలేజీలకి అకడమిక్ క్యాలెండర్ విడుదలైంది. జూనియర్ కాలేజీల అకడమిక్ క్యాలెండర్ ను తెలంగాణ ఇంటర్ బోర్డు కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. విద్యాసంవత్సరం మొత్తం పనిదినాలు 182 రోజులుగా ఈ అకడమిక్ క్యాలెండర్ లో పేర్కొన్నారు. ఇక తెలంగాణా ప్రజలు పెద్ద పండుగలుగా భావించే దసరాకు 3 రోజులు, సంక్రాంతికి 2 రోజులు మాత్రమే సెలవులు ఇస్తున్నట్టు అకడమిక్ క్యాలెండర్ లో పేర్కొన్నారు.
వచ్చే ఏడాది మార్చి 24 నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు ఇంటర్ పరీక్షల నిర్వహించనున్నారు. ఇక అకడమిక్ ఇయర్ లాస్ట్ వర్కింగ్ డే 2021 ఏప్రిల్ 16 అని పేర్కొన్నారు. అయితే ఎప్పటి నుండి కాలేజ్ లకి డైరెక్ట్ గా హాజరవ్వాలనే అంశం మీద క్లారిటీ రావలసి ఉంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్స్ నేటి నుండి ప్రారంభం అయ్యాయి. పనిదినాలు తగ్గుతున్న నేపథ్యంలో ఇంటర్ సిలబస్ ని తగ్గించాలా ? తగ్గిస్తే ఏ పాఠ్యాంశాలను తొలిగించాలి ఎంత మేరకు తగ్గించాలి అనే దానిపై ఇంటర్ బోర్డ్ కమిటీలు వేసింది. అయితే ఆ కమిటీలు రిపోర్ట్ ఇవ్వగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు ఇంటర్ బోర్డు అధికారులు.
Click Here
Download TS Academic Calander 2020-21