Saturday, August 22, 2020

TS Municipal Ward Officers Recruitment Decision by Govt - Get the Details


TS Municipal Ward Officers Recruitment Decision by Govt - Get the Details


For the first time in the country, there is nowhere in the municipality, one officer for each ward .. Telangana Government Decision 

The Telangana state government has been working for some time to fill the vacant posts in the municipal department of the state. A key decision has been taken in this regard.The Telangana government will appoint an officer to the ward in the municipalities like nowhere else in the country.The government hopes that the appointment of ward officers will serve as a bridge between the people and the government. It was decided to undertake the appointment of ward officers in each municipality. Minister KTR was of the view that by doing so the urban progress program would go further. The decision seems to have come after a lengthy exercise by senior officials in the municipal department on filling the vacancies. The Minister has directed the officials to fill the vacancies in a highly transparent manner.


           

The TRS government, which brought in a new municipal law in telangana a few months ago, said the urbanization process in the state should be different from the past.Accordingly, the ministers briefed the public on the provisions of the new municipal law.Programs such as urban progress were also undertaken. Earlier, Minister said that urbanization is going on fast in Telangana. Minister KTR said that the vacancies in the municipal department should be filled accordingly. It seems that the government wants to see the municipalities grow faster by appointing an officer to the ward in the latest municipalities.

A team of municipal officials has already met six times internally and done a lengthy exercise on the rationalization of posts and filling of vacancies. Vacancies will be filled soon. Minister KTR directed that these vacancies should be filled in the most transparent manner. The minister said that the replacement of vacancies will contribute to the hierarchical development of the towns, to provide quick to the people with civic services as a citizen center. Minister also said that this would take the spirit of the new municipal law further.


Telangana government will be released the detailed Notification regarding Municipal ward officers recruitment.

దేశంలోనే తొలిసారిగా ఎక్కడా లేని విధంగా మునిసిపాలిటీల్లో  ఒక్కో వార్డుకు ఒక్కో అధికారి.. తెలంగాణ సర్కార్ నిర్ణయం..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంపై కొంతకాలంగా కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఈ అంశంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆరుసార్లు అంతర్గతంగా సమావేశమై పోస్టుల రేషనలైజేషన్, ఖాళీల భర్తీపైన పురపాలక శాఖ ఉన్నతాధికారుల బృందం సుదీర్ఘ కసరత్తు చేసింది. తాజాగా మున్సిపాలిటిల్లో వార్డుకు ఒక అధికారిని నియమించి మున్సిపాలిటీలు వేగంగా అభివృద్ధి చెందేలా చూడాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.దేశంలో ఎక్కడా లేని విధంగా మునిసిపాలిటీల్లో వార్డుకు ఒక అధికారిని నియమించనుంది . ప్రజలకు, ప్రభుత్వానికి వారధులుగా వార్డు ఆఫీసర్లనియామకం ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి మునిసిపాలిటీల్లో వార్డు ఆఫీసర్ల నియామకం చేపట్టాలని నిర్ణయించారు. ఇలా చేయడం ద్వారా పట్టణ ప్రగతి కార్యక్రమంమరింత ముందుకు సాగుతోందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. 

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా వార్డు ఆఫీసర్లను నియమించనున్నారు. ప్రతి పురపాలికలో వార్డు ఆఫీసర్లను నియమించాలని నిర్ణయించింది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వార్డు ఆఫీసర్లు వ్యవహరించనున్నారు. ఈ మేరకు వివరాలను తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కాగా ఖాళీల భర్తీపై మున్సిపల్ శాఖలోని ఉన్నతాధికారులు సుదీర్ఘ కసరత్తు చేసిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అత్యంత పారదర్శకంగా ఖాళీల భర్తీ జరగాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.

ప్రగతి భవన్‌లో పురపాలక శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. దేశంలోనే మొదటిసారిగా వార్డుకు ఒక అధికారిని నియమించనున్నామని తెలిపారు. పురపాలక శాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుందని చెప్పారు.  ఇప్పటికే ఆరుసార్లు అంతర్గతంగా సమావేశమై పోస్టుల రేషనలైజేషన్, ఖాళీల భర్తీపైన పురపాలక శాఖ ఉన్నతాధికారుల బృందం సుదీర్ఘ కసరత్తు చేసింది. త్వరలోనే ఖాళీలను భర్తీ చేయనున్నారు.  తెలంగాణలో రాష్ట్రంలోని కొన్ని నెలల క్రితం కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చిన  ప్రభుత్వం.. రాష్ట్రంలో పట్టణీకరణ ప్రక్రియ గతానికి భిన్నంగా జరగాలని తెలిపింది. అందుకు తగ్గట్టుగానే కొత్త మున్సిపల్ చట్టంలో ఉన్న అంశాలకు సంబంధించి ప్రజలకు సమగ్రంగా వివరించారు మంత్రులు. తెలంగాణలో పట్టణీకరణ వేగంగా జరుగుతోందని.. అందుకు తగ్గట్టుగానే మున్సిపల్ శాఖలో ఖాళీల భర్తీ చేయాలని గతంలో మంత్రి కేటీఆర్ తెలిపారు. దీని ద్వారా నూతన పురపాలక చట్టం స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వీలవుతుందని మంత్రి కేటీఆర్ వివరించారు.అత్యంత పాదర్శకంగా ఈ ఖాళీల భర్తీ జరగాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు.