Saturday, July 25, 2020

TS RTA Friendly Electronic Services of Transport (FEST) Online Services Get Details Here


TS RTA  Friendly Electronic Services of Transport (FEST) Online Services Get Details Here

Telangana Transport Minister Puvvada Ajay Kumar on Friday Launched Friendly Electronic Services of Transport (FEST) Five Online Services with the help of M-governance and T-Appfolio, Now citizens can get a duplicate learners licence, duplicate driving licence, badges and new smart card licence (in place of old licence) and among other services are able to avail through the FEST, without visiting the RTA offices.  According to the officials, the government has made these services online to ensure there is a role of brokers and citizens can get these services without coming to RTA offices. 



TS RTA Friendly Electronic Services of Transport (FEST) Online Services Get Details Here /2020/07/TS-RTA-Friendly-Electronic-Services-of-Transport-FEST-Online-Services-Get-Details-Here.html

Candidates can fill their application through RTA Website from their personal computers and also from smart phones. Applicants would have to give all the details like supporting documents online and there would be three levels of authentication before the citizen gets their document. The applicant would have to upload their name, Father's name, address, Driving Licence and Learner's licence number along with clicking a selfie. The RTA Friendly Electronic Services of Transport (FEST) would complete the process, informed a Senior Official. 

The selfie of the candidate will be checked through Artificial Intelligence (AI) based technology. The big data-based technology would check and authenticate the names (Spelling mistakes if any) and with the help of Deep Learning Based Image Technology, the photo will be authenticated. After three levels of authentificatin, the applicants can make payments thorugh their smart phones. Minister Puvvada Ajay Kumar said that the government wants to remove the involvement of brokers, the minister also said that these five services were make online and more services would be made  available online in future,.

రవాణా శాఖలో కొత్త ప్రయోగాలకు మంత్రి పువ్వాడ శ్రీకారం
ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. ఈ సేవలను మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. వీటి ద్వారా 5 రకాల ఆన్‌లైతెలంగాణ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు, వారికి సులభతర సేవలు అందించేందుకు రవాణాశాఖ మరికొన్ని ఆన్‌లైన్‌ సేవలను ప్రవేశపెట్టింది. ఫెస్ట్‌ (ఫ్రెండ్లీ ఎలక్ట్రానిక్‌ సర్వీస్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్టు) పేరిట ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్‌ ఈ సేవలను శుక్రవారం ప్రారంభించారు. 

వీటి ద్వారా 5 రకాల ఆన్‌లైన్‌ సేవలను ప్రవేశపెట్టారు.  
1) డూప్లికేట్ LLR పొందుట,
2) డూప్లికేట్ లైసెన్స్ పొందుట
3) బ్యాడ్జి మంజూరు
4) స్మార్ట్ కార్డ్ పొందుట(పాత లైసెన్స్ సమర్పించి కొత్తది పొందుట)
5) లైసెన్స్ హిస్టరీ షీట్ పొందుట
ఈ 5 సేవలను మంత్రి పువ్వాడ ఆవిష్కరించారు. ఆయా సేవలు ఇక నుండి పూర్తి ఆన్లైన్లోనే పొందవచ్చు అని పేర్కొన్నారు. దీంతో ప్రజల సమయం ఆదా కానుంది. అంతేకాక, అక్రమాలకు అడ్డుకట్ట వేసి సేవల్లో పారదర్శకత కూడా ఏర్పడనుంది.  పారదర్శక పాలన అందించేందుకు ఇప్పటికే ఆధార్‌ను తప్పనిసరి చేశామని, ఇప్పటికే అనేక సేవలను ఆన్‌లైన్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు వినియోగించుకుంటున్నారని అన్నారు. వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ పదే పదే తిరగనవసరం లేదు. మధ్యవర్తులు, దళారులను ఆశ్రయించాల్సిన అవసరం అసలే ఉండదు. ఈ నూతన విధానం ద్వారా రిజిస్ట్రేషన్‌ సేవలను ఆన్‌లైన్‌ చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రజల వెసులుబాటు కోసం శాఖలో మరిన్ని సేవలు మరింత తేలికపాటిగా పొందేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.

లెర్నింగ్‌ పత్రాల విషయంలో ఇకపై డూప్లికేట్లు, బ్యాడ్జీలను అందజేయడం, డూప్లికేట్‌ లైసెన్స్‌, హిస్టరీ షీట్‌, పాతకార్డు స్థానంలో స్మార్ట్‌ కార్డులను ఇవ్వడం వంటి 5 రకాల సేవలను ఆన్‌లైన్‌ ద్వారా అందిస్తారు. మరో 6 సేవల్ని కూడా త్వరలోనే ఇందులో అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి పువ్వాడ వివరించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో (కృత్రిమ మేథ) పని చేసే ఈ సేవలను స్మార్ట్ ఫోన్‌లో సైతం పొందవచ్చని మంత్రి వివరించారు.

ఆన్‌లైన్‌ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని తాజాగా ప్రతిపాదించిన నూతన విధానంతో రవాణా శాఖ మరో అడుగు ముందుకేసి ఈ 5 సేవలు అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చిన క్రమంలో మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా దేశంలోనే తొలిసారిగా రవాణాశాఖలో ఆన్‌లైన్‌ సేవలను ప్రారంభించామని మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు.నూతనంగా అమల్లోకి వచ్చిన ఆన్‌లైన్‌ విధానం ప్రజలందరికీ ఎంతో ఉపయోగకరమని మధ్యవర్తులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా కావాల్సిన సేవలను పొందాలని కోరారు.  రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, కమిషనర్‌ ఎంఆర్‌ఎం రావు, జేటీసీలు రమేష్‌, మమతాప్రసాద్‌, పాండురంగ నాయక్‌, ఆర్టీసీ సీనియర్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ మేనేజర్‌ జీఆర్‌ కిరణ్‌ పాల్గొన్నారు.

Click Here for