Telangana Government Green Signal to Recruit 1000 Jobs in Irrigation Department
Government of Telangana
Irrigation & CAD Department
Irrigation & CAD Department : CM KCR announced that the government is ready to sanction one thousand new posts for the Irrigation Department. He said the system of irrigating 25 lakh crore acres should be a management armory. He said that the Department of Irrigation would be renamed as the Department of Water Resources (Water Resources Department) from now on. The Department of Water Resources should be under a single umbrella. The different sections no longer continue. The state should be divided under as many territorial areas as possible. Each CEO should be appointed in-charge for each regional area. All projects, canals, ponds and lifts should be within the CE. The work of filling the ponds must be done in an armored manner.
Chief Minister KCR was held a review meeting with senior officials on the scope for overhaul of the Irrigation department to ensure that the government’s vision of irrigating 1.25 crore acre of land in the coming days would come to fruition as soon as possible. The officials led by Irrigation Secretary Rajat Kumar and Special Secretary in the CMO Smitha Sabharwal submitted draft of the outlines encompassing the measures that would be need to restructure the department in line with the changing requirements.
నీటిపారుదల శాఖకు వెయ్యి పోస్టులు ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్, త్వరలో నోటిఫికేషన్...
తెలంగాణలో 1000 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
తెలంగాణ నీటిపారుదల శాఖకు వెయ్యి పోస్టులు కొత్తగా మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే వ్యవస్థ నిర్వహణ పకడ్బందీగా ఉండాలని ఆయన చెప్పారు. నీటి పారుదల శాఖను ఇక నుంచి జల వనరుల శాఖ (వాటర్ రిసోర్సెస్ డిపార్టుమెంటు)గా మారుస్తున్నట్లు తెలిపారు. జలవనరుల శాఖ ఒకే గొడుగు కింద ఉండాలి. వేర్వేరు విభాగాలు ఇకపై కొనసాగవు. రాష్ట్రాన్ని వీలైనన్ని ఎక్కువ ప్రాదేశిక ప్రాంతాల కింద విభజించాలి. ఒక్కో ప్రాదేశిక ప్రాంతానికి ఒక్కో సీఈని ఇన్‌చార్జిగా నియమించాలి. అక్కడి ప్రాజెక్టులు, కాల్వలు, చెరువులు, లిఫ్టులన్నీ సీఈ పరిధిలోనే ఉండాలి. చెరువులు నింపే పని పకడ్బందీగా జరగాలి. అవసరమైతే మరో వెయ్యి పోస్టులు కొత్తగా మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం అన్నారు. పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఎంత మంది ఈఎన్సీలు ఉండాలనే విషయం నిర్ధారించాలన్నారు.
Govt of Telangana Irrigation & CAD Dept Website
TSPSC Official Website