Thursday, July 9, 2020

Video Lessons for 1st to 10th Class @ medchalbadi.com

Video Lessons from 1st to 10th Class @ medchalbadi.com
‘మేడ్చల్‌ బడి’ పేరిట మేడ్చల్‌లో బడి వెబ్‌సైట్‌ను ప్రారంభించిన కలెక్టర్‌  6 వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠాలు
రాష్ట్రంలోనే తొలిసారిగా రికార్డు చేసిన పాఠాలతో ‘మేడ్చల్‌ బడి’ పేరిట ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది
మేడ్చల్ జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కరోనా మహమ్మారి దృష్ట్యా డిజిటల్ బోధన తరగతులను అందజేయాలన్న ఉద్దేశంతో గత నెల రోజులుగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సమిష్టి కృషితో మేడ్చల్ బడి https://medchalbadi.com  అనే వెబ్ సైట్ ని సగర్వంగా నేడు మన  మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా పరిపాలన అధికారి శ్రీ డాక్టర్ వాసం వెంకటేశ్వర రావు గారు ప్రారంభించారు. ఇంటర్నెట్‌ ఉంటే చాలు..  ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నట్టింట్లో ఉండి చదువుకునే వెసులుబాటును కల్పించారు మేడ్చల్‌ జిల్లా విద్యాధికారులు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని మేడ్చల్‌ జిల్లా విద్యాశాఖ వినూత్న ఆలోచన చేసింది.
టీచర్ లాగిన్,  విద్యార్ధి లాగిన్, అడ్మిన్ లాగిన్, మరియు పాఠాలు ఎలా వినాలి  పూర్తి వివరాల కొరకు  క్రింది వీడియోను చుడండి
            
రాష్ట్రంలోనే తొలిసారిగా రికార్డు చేసిన పాఠాలతో ‘మేడ్చల్‌ బడి’ పేరిట ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. జిల్లా విద్యాశాఖాధికారిణి విజయకుమారి ఆలోచన మేరకు రూపొందించిన ఈ సైట్‌ను సోమవారం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ వి.వెంకటేశ్వర్లు ప్రారంభించారు. 6 వ తరగతి నుంచి 10వ తరగతి  వరకు అన్ని సబ్జెక్టుల పాఠాల వీడియోలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. తొలుతగా 8, 9, 10 తరగతులకు సంబంధించి పాఠాలను అందుబాటులో ఉంచారు. త్వరలోనే 6, 7 తరగతులకు సంబంధించి పాఠాలు అప్‌లోడ్‌ చేయనున్నారు. స్వచ్ఛంద సంస్థ స్ఫూర్తి ఫౌండేషన్‌.. ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ కాగ్నిజెంట్‌ సహకారంతో ఈ వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఇందులో ప్రత్యేకంగా స్టూడెంట్‌, టీచర్‌, అడ్మిన్‌ లాగిన్‌ ఉంటాయి. విద్యార్థులు స్టూడెంట్‌ లాగిన్‌లోకి వెళ్లి తరగతిని ఎంచుకుని పాఠాలు(తెలుగు/ఇంగ్లిష్‌) వినవచ్చు.
కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నింటికీ ప్రభుత్వం సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రైవేటు స్కూళ్లలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు కొన్ని యాజమాన్యాలు ఆన్‌లైన్‌లో పాఠాలు చెబుతున్నప్పటికీ.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ క్రమంలో మేడ్చల్‌ జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల సౌకర్యార్థం మనబడి వెబ్‌సైట్‌లో ప్రభుత్వ పాఠశాల అధ్యాపకులు స్వయంగా తయారు చేసిన పాఠ్యాంశాలను అప్‌లోడ్‌ చేసి.. సోమవారం నుంచి ఈ వెబ్‌సైట్‌ను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. 
మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో www.medchalbadi.com వెబ్‌సైట్‌ను జిల్లా కలెక్టర్‌ డా.వాసం వెంకటేశ్వర్లు తన చాంబర్‌లో డీఈవో విజయకుమారితో కలిసి ప్రారంభించారు. సబ్జెక్టుల వారీగా పాఠాలు, వర్క్‌షీట్లు ఉన్నాయి. వర్క్‌షీట్లలో చేసిన సమాధానాలను విద్యార్థులు నేరుగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. అధ్యాపకులు వీటిని పరిశీలించి.. విద్యార్థుల ప్రతిభను అంచనా వేసే అవకాశం ఉందని జిల్లా విద్యాధికారిణి ఐ.విజయకుమారి ‘నమస్తే తెలంగాణ’తో తెలిపారు. ఈ అవకాశాన్ని మేడ్చల్‌ జిల్లాలో 6 నుంచి 10వ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, ఇంట్లో ఇంటర్నెట్‌ ఉంటే అన్ని సమయాల్లో వెబ్‌సైట్‌లోని పాఠాలను చదువుకోవచ్చని ఆమె విద్యార్థులకు సూచించారు. 
ఇందులో ప్రత్యేకంగా స్టూడెంట్‌, టీచర్‌, అడ్మిన్‌ లాగిన్‌ ఉంటాయి. విద్యార్థులు స్టూడెంట్‌ లాగిన్‌లోకి వెళ్లి తరగతిని ఎంచుకుని పాఠాలు(తెలుగు/ఇంగ్లిష్‌) వినవచ్చు.
Click Here for
watch Videos Here :Official Website