Monday, July 6, 2020

Andhra Pradesh Corporation for Outsourced Services (APCOS) Jobs Registration Apply Online @apcos.ap.gov.in


Andhra Pradesh Corporation for Outsourced Services (APCOS) Jobs Registration Apply Online @apcos.ap.gov.in
APCOS Registration for Outsourced Services
Good News for Outsourced Employees
Hi Everyone .. Thanks for visiting our web page.This Information is very useful for all the Unemployed who are searching for jobs. Just share this post to all your friends if you find it useful, so that all will ger the opprotunity to search for the job.
Andhra Pradesh Corporation for Outsourced Services (APCOS) Jobs Registration; This is to inform you that the Hon’ble Chief Minister Y.S.Jagan Mohan Reddy was launched the activities of Andhra Pradesh Corporation for Outsourced Services (APCOS) on 03-07-2020 through video conferencing, to encourage the outsourcing jobs and to stop the corruption.
As per the Indents (Requirement of manpower) placed by all the Secretariat Departments, State Head of Departments and District Collectors on the APCOS website (apcos.ap.gov.in), about 47,000 outsourced personnel will be handed over the “Placement Intimation Letters (PILs)” throughout the state by Hon’ble Chief Minister/Hon’ble Ministers. The details are as follows.

For more details for Outsourcing Registration Click on to Watch Video
              
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది.
దళారులకు చెక్ : ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త ప్రకటించింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కొండంత అండగా నిలుస్తూ ఏర్పాటు చేసిన ‘ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్‌డ్ సర్వీసెస్’ (ఆప్కాస్) కార్యకలాపాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆయన తన క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. దీని ద్వారా లంచాలు, రికమండేషన్లకు తావులేకుండా.. పారదర్శకంగా కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీలు ఈ నియామకాలను చేపడతాయి. పూర్తి వివరాలకు http://apcos.ap.gov.in/ వెబ్‌సైట్‌ సందర్శించవచ్చు. ఒకేసారి 47 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలను జగన్ జారీ చేయనున్నారు. సచివాలయంలో 26 శాఖలకు సంబంధించి 643 మంది నియామకం కానున్నారు. విభాగాధిపతుల కార్యాలయాలు, కార్పొరేషన్లలో 10,707 మంది నియామకం కానున్నారు. 13 జిల్లాల కలెక్టరేట్లలో 36,042 మందికి ప్లేస్‌మెంట్ ఇంటిమేషన్‌ లెటర్లు అందించనున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆప్కోస్‌ ద్వారానే ఉద్యోగుల నియామకం జరగనుంది. ఇది 100 శాతం ప్రభుత్వ రంగ సంస్థ. 

రాష్ట్ర  ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో వందలాది మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. ప్రస్తుతం వివిధ ఏజెన్సీల ద్వారా వీరిని నియమిస్తున్నారు.ఇప్పటివరకూ వీరు ఆయా ఏజెన్సీల ద్వారా రిక్రూట్‌ అవుతున్నారు. నియమాకాల్లో అందరికీ అవకాశాలు దక్కకపోవడం, పనికి తగినట్టుగా ఉద్యోగులకు చెందాల్సిన జీతం పూర్తిస్థాయిలో లభించకపోవడం, సకాలంలో జీతాలు రాకపోవడం లాంటి సమస్యలను అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీలు నడుపుతున్నవారు తమకు నచ్చిన రీతిలో ఈ నియామకాలను చేపడుతున్నారు. వీరు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పని చేసినా వీరి వేతనాలు చాలా తక్కువ. అంతే కాదు.. ఉద్యోగాలకు గ్యారంటీ ఉండదు.. ఒక్కో ఉద్యోగానికి ఒక్కో వేతనం.. నియామకాల్లోనూ అవకతవకలు.. అందుకే ఇక ఇప్పుడు ఈ ఇబ్బందులు లేకుండా జగన్ వారికి గుడ్ న్యూస్ చెప్పేశారు.
గతంలో కాంట్రాక్ట్ సంస్థలు ఉద్యోగుల సంఖ్యను ఎక్కువ చూపి, తక్కువ సంఖ్యలో నియమించి వారితో పని చేయించుకునేవి. 20 మంది పని చేయాల్సి ఉండగా 15 మందినే నియమించి మిగతా ఐదుగురి వేతనాలను ఆ కాంట్రాక్టర్లు, ఇతర నేతలు పంచుకునేవారు. ఇప్పుడు ఈ కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా వాటన్నింటికీ తావుండదు.  ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో ఎక్కడా వివక్షకు తావుండకూడదు. 50 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇవ్వాలి. వాటన్నింటిలో 50 శాతం మహిళలు ఉండాలి. దళారులు, ప్లేస్‌మెంట్ ఏజెంట్ల వ్యవస్థ, కమీషన్లకు తావు లేకుండా చేసేందుకే ప్రత్యేకంగా ఈ కార్పొరేషన్‌ను ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తామని, ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేయడంతో పాటు ఎటువంటి లంచాలు, వివక్షత లేకుండా జీతాలు వారి చేతుల్లోకి వచ్చేలా ఏర్పాట్లు చేశామని సీఎం జగన్ తెలిపారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జగన్ బంపర్ ఆఫర్ :
  1. ఇక నుంచి కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులందరికీ ఆప్కాస్‌ మాత్రమే ప్లేస్‌మెంట్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.
  2. ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శకంగా ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది నియామకాలు జరుగుతాయి.
  3. రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు, కార్యాలయాల్లో ఔట్‌ సోర్సింగ్‌ ప్రక్రియకు సంబంధించి వన్‌–స్టాప్‌–షాప్‌ గా ఆప్కాస్‌ పని చేస్తుంది.
  4. వీరికి చెల్లించే వేతనాలు డైరెక్టు గా వారి బ్యాంకు ఖాతాలోనే వేయాలని నిర్ణయించారు. తద్వారా మధ్యవర్తులు ప్రమేయం తగ్గించి వారికి నేరుగా లబ్ది చేకూరుతుందని అభిప్రాయపడింది. 
ముందుగా apcos.ap.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌  చేసుకోండి కండి.. ఉద్యోగం పొందండి
Click Here for


Apcos Registration