Tuesday, June 9, 2020

Bachelor of Science (B.Sc.) Optometry Information


Bachelor of Science (B.Sc.) Optometry Information

B.Sc. Optometry is a full-time 3-year undergraduate course, divided into six semesters, of six months each. It essentially involves an advanced study of the clinical skills involved in professionally measuring eyesight, prescribing corrective lenses, and detecting eye diseases.

కంటి వెలుగును కాపాడే కొలువులు - ఇంటర్‌ తర్వాత ఆప్టోమెట్రీ కోర్సులు


ఎప్పుడైనా ఏదైనా ఇబ్బందితో కంటి ఆసుపత్రికి వెళితే ముందుగా బోర్డు మీద విభిన్న పరిమాణాల్లో ఉన్న  అక్షరాలను చదవమని అడుగుతారు. కనిపించకపోయినా.. కాస్త  మసక అనిపించినా.. రకరకాల ఆప్టిక్స్‌ పెట్టి పరీక్షిస్తుంటారు. ఆ తర్వాతే ప్రధాన వైద్యుడిని కలవడానికి పంపుతారు. వాళ్లే ఆప్టోమెట్రీషియన్లు.

కంటి పరీక్షలను ప్రాథమిక స్థాయిలో క్షుణ్ణంగా నిర్వహించేవాళ్లు ఆప్టోమెట్రీషియన్లు
ఈ ఉద్యోగాల్లోకి ప్రవేశించాలంటే ఆప్టోమెట్రీ డిప్లొమా లేదా డిగ్రీ పొంది ఉండాలి.*
ఇంటర్మీడియట్‌ అర్హతతో విద్యార్థులు ఆ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు*.
ఇంటర్‌ విద్యార్హతతో ఆప్టోమెట్రీలో డిప్లొమా, బ్యాచిలర్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
ఇంటర్‌ అన్ని గ్రూపుల వారూ డిప్లొమాలో చేరవచ్చు*.



Bachelor of Science (B.Sc.) Optometry Information/2020/06/Bachelor-of-science-B.Sc-Optometry-information.html

*వ్యవధి రెండేళ్లు*.

*అది పూర్తిచేసుకున్నవారు ఆప్టోమెట్రీ యూజీ కోర్సులో నేరుగా రెండో ఏడాదిలోకి ప్రవేశించవచ్చు*.
ఈ అవకాశం కొన్ని సంస్థల్లోనే లభిస్తుంది.
 *బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ వ్యవధి నాలుగేళ్లు*
. రాష్ట్ర స్థాయి సంస్థల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ లేదా బీఎస్సీ ఆప్టోమెట్రీలో చేరాలంటే ఇంటర్మీడియట్‌ బైపీసీ గ్రూపుతో ఉత్తీర్ణులై ఉండాలి.

జాతీయస్థాయి, పేరున్న సంస్థలు మాత్రం బైపీసీతోపాటు ఎంపీసీ వారికీ అవకాశం కల్పిస్తున్నాయి.
ఇంటర్‌ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు నాలుగేళ్ల యూజీ కోర్సులో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు.
 నాలుగేళ్ల కోర్సులో చివరి ఏడాది మొత్తం ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. ఏదైనా కంటి ఆసుపత్రిలో దీన్ని చేయాలి. జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో పలు సంస్థలు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ కోర్సులను నిర్వహిస్తున్నాయి. తర్వాత ఆసక్తి ఉన్నవారు రెండేళ్ల మాస్టర్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీలో చేరవచ్చు. అనంతరం పీహెచ్‌డీకీ అవకాశాలు ఉన్నాయి.

బీ-ఆప్టోమెట్రీ అందించే సంస్థల్లో కొన్ని పీజీ, పీహెచ్‌డీలనూ నిర్వహిస్తున్నాయి.



 దేశంలోని ప్రసిద్ధ నేత్ర వైద్యశాలలూ యూజీ, పీజీ,  పీజీ డిప్లొమా, పీహెచ్‌డీ స్థాయుల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. యూజీ విద్యార్థులకు ఏడాది ఇంటర్న్‌షిప్‌ అవకాశాన్నీ కల్పిస్తున్నాయి. ఇంటర్‌ బోర్డు లేదా ఓపెన్‌ విధానంలో బైపీసీ గ్రూపు చదివినవారు;  బయాలజీ, ఫిజిక్స్‌ల్లో బ్రిడ్జ్‌ కోర్సు పూర్తిచేసుకున్న ఒకేషనల్‌ విద్యార్థులు రాష్ట్ర స్థాయి సంస్థల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

 *కోర్సు ప్రారంభమైన సంవత్సరం డిసెంబరు 31 నాటికి 17 ఏళ్లు నిండడం తప్పనిసరి*.
*ఇంటర్‌ మార్కుల ఆధారంగా అడ్మిషన్‌ ఇస్తారు*.
*ప్రకటనలు జూన్‌ లేదా జులైల్లో వెలువడతాయి.*
 *జాతీయ స్థాయి సంస్థలు ప్రత్యేక ప్రవేశ పరీక్ష లేదా నీట్‌ స్కోర్‌తో చేర్చుకుంటున్నాయి.*
*ఆప్టోమెట్రిస్ట్‌గా సేవలు అందించాలకునే వారికి దృష్టిలోపం ఉండకపోతే మంచిది.*

ఇవీ సంస్థలు*

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆరేళ్ల వ్యవధితో ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ (ఎం-ఆప్టోమ్‌) కోర్సు అందిస్తోంది. ఇందులో 28 సీట్లు ఉన్నాయి. ఇంటర్‌లో బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ సబ్జెక్టులు చదువుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 60 శాతం మార్కులు తప్పనిసరి. పరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశాలుంటాయి. ప్రకటన వెలువడింది. జూన్‌ 30లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.  రాత పరీక్షలో చూపిన ప్రతిభతో అవకాశం లభిస్తుంది. వంద మార్కులకు జనరల్‌ సైన్స్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టుల నుంచి ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి.

అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) న్యూదిల్లీ, రిషికేశ్‌ క్యాంపస్‌ల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ కోర్సు అందిస్తున్నారు. ఈ రెండు సంస్థల్లో కలిపి 34 సీట్లు ఉన్నాయి. పరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశం  లభిస్తుంది. ఈ సంస్థల్లో చేరిన విద్యార్థులకు నెలకు రూ.500 స్ట్టైపెండ్‌  చెల్లిస్తారు. నాలుగో ఏడాది ఇంటర్న్‌షిప్‌లో ప్రతి నెల రూ. 10,250 అందుతుంది. బైపీసీ, ఎంపీసీ రెండు గ్రూపుల విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్‌ సబ్జెక్టుల్లో ప్రశ్నలు వస్తాయి. విద్యార్థులు బయాలజీ లేదా మ్యాథ్స్‌ల్లో ఒక సబ్జెక్టు ప్రశ్నలకు జవాబులు రాస్తే సరిపోతుంది.

శంకర నేత్రాలయ, చెన్నై ఆధ్వర్యంలో నడుస్తున్న ఎలైట్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీలో బ్యాచిలర్‌, మాస్టర్‌, డాక్టరేట్‌ స్థాయి కోర్సులున్నాయి.బ్యాచిలర్స్‌లో చేరినవారు మొదటి రెండేళ్లు శస్త్ర యూనివర్సిటీ, తంజావూరులో చదువుతారు. తర్వాత రెండేళ్లు ఎలైట్‌ స్కూల్‌, శంకర నేత్రాలయలో చదువు, ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేస్తారు. ప్రవేశం నీట్‌ స్కోర్‌, ఇంటర్‌ మార్కులతో ఉంటుంది లేదా శస్త్ర నిర్వహించే రాత పరీక్షలో మెరిట్‌ సాధించాలి. ఈ కోర్సులకు బైపీసీ, ఎంపీసీ రెండు గ్రూపుల విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రకటన వెలువడింది. ఆసక్తి ఉన్నవారు శస్త్ర వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.

ఆప్టోమెట్రీలో యూజీ, పీజీలను మణిపాల్‌ అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అందిస్తోంది. పరీక్ష, ఇంటర్వ్యూలతో ప్రవేశం లభిస్తుంది. బైపీసీ, ఎంపీసీ రెండు గ్రూపుల విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది.

ఆప్టోమెట్రీ మూడేళ్ల కోర్సు పూర్తిచేసుకున్న విద్యార్థులు నాలుగో ఏడాది ఇంటర్న్‌షిప్‌ను హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ, భువనేశ్వర్‌ల్లోని ఎల్‌వీ ప్రసాద్‌ ఐ హాస్పిటల్‌ క్యాంపస్‌ల్లో చేసుకోవచ్చు. పరీక్షలో చూపిన ప్రతిభతో అవకాశం లభిస్తుంది. ఈ సంస్థ వివిధ మాడ్యూళ్లలో పీజీ డిప్లొమా ఇన్‌ ఆప్టోమెట్రీ అండ్‌ విజన్‌ సైన్సెస్‌ కోర్సులను 18 నెలల వ్యవధితో అందిస్తోంది. ఆప్టోమెట్రీలో బ్యాచిలర్‌ కోర్సులు చదివినవారు వీటికి అర్హులు.



* అమృత విశ్వవిద్యాపీఠం, కొచ్చి క్యాంపస్‌లో ఆప్టోమెట్రీ కోర్సు ఉంది. రాత పరీక్ష ఆధారంగా అడ్మిషన్‌ ఇస్తారు.
* భారతీ విద్యాపీఠ్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ, పుణెలో యూజీ, పీజీలు ఉన్నాయి.
* గీతం, విశాఖపట్నం క్యాంపస్‌లో ఆప్టోమెట్రీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.
* ఆంధ్రప్రదేశ్‌లో బీ-ఆప్టోమెట్రీని కర్నూల్‌ మెడికల్‌ కాలేజీ, ఆంధ్రా మెడికల్‌ కాలేజీ, సిద్ధార్థ మెడికల్‌ కాలేజీ, కోనసీమ
ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌-అమలాపురం, బొల్లినేని మెడ్‌ స్కిల్స్‌ శ్రీకాకుళం (రాగోలు), జీఎస్‌ఎల్‌ పారామెడికల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌-రాజమండ్రి, సమత స్కూల్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ-విశాఖపట్నం (వేపగుంట)ల్లో అందిస్తున్నారు. ఇంటర్‌ బైపీసీ మార్కుల ఆధారంగా ప్రవేశాలుంటాయి. జులైలో ప్రకటన వెలువడుతుంది.