IRCTC Special Trains Ticket Booking @ irctc.co.in
నేటి నుంచి ప్రయాణికుల రైళ్లు కూత మొదలు పెట్టనున్నాయి.
15 pairs of trains (30 Return Journeys). These trains will be run as special trains from New Delhi Station connecting Dibrugarh, Agartala, Howrah, Patna, Bilaspur, Ranchi, Bubabeswar, Secunderabad, Bengaluru, Chennai, Thiruvananthapuram, Madgaon, Mumbai Central, Ahmedabad and Jammu Tawi.
ప్రయాణికుల రైళ్లు మంగళవారం నుంచి మళ్లీ కూతపెట్టనున్నాయి. దేశంలోని వివిధ రాష్ర్టాల రాజధానులకు, ఢిల్లీకి మధ్య తిరిగే 15 మార్గాల్లో రైలు సేవలను పునరుద్ధరించనున్నట్లు రైల్వే శాఖ ఆదివారం తెలిపింది. ఈ మార్గాల్లో దిబ్రుగఢ్, అగర్తల, హౌరా, పాట్నా, బిలాస్‌పూర్, రాంచి, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్గావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్ము తావి స్టేషన్లు ఉండనున్నాయి. ఢిల్లీకి ఆయా స్టేషన్లకు 15 చొప్పున ఇరువైపులా 30 రైళ్లు తిరుగనున్నాయి. ఇవన్నీ ఏసీ సర్వీసులే అని రైల్వేశాఖ పేర్కొంది. వీటిలో సూపర్ ఫాస్ట్ ట్రైన్ సమానమైన చార్జీలను వసూలు చేస్తామని, ఈ చార్జీలపై ఎటువంటి రాయితీలు ఉండబోవని చెప్పింది. రైళ్లలోని సీట్ల సంఖ్యకు సమానంగా పూర్తి సామర్థ్యంతో నడపుతానని పేర్కొంది. నిర్ణీత రైల్వే స్టేషన్లలోనే ఆగే ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణానికి సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి కేవలం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో మాత్రమే రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.
All Passenger to kindly note that on arrival at their destination, the traveling passengers will have to adhere to such health protocols as are prescribed by the destination State/UT. Click Here to see state wise advisory on Arrival.
For trains cancelled till 17th May 2020 by Indian Railways, full refund will be provided automatically by IRCTC. Users need not cancel their e-tickets. Full fare will be credited back into users accounts from which payment was made.
Catering Service is not available and catering charges not included in the fare.
- 15 ‘రాజధాని ఎక్స్‌ప్రెస్' మార్గాల్లో 30 ఏసీ రైళ్లు
- సూపర్ ఫాస్ట్ ట్రైన్‌కు సమానంగా చార్జీల వసూలు
- ప్రయాణానికి గంట ముందుగా రైల్వేస్టేషన్‌కు చేరుకోవాలి
- వైద్య పరీక్షల తర్వాతే రైలు ఎక్కేందుకు అనుమతి
- రిజర్వేషన్ టికెట్ ఉన్నవారికే ప్రయాణానికి అనుమతి.
- ప్రయాణానికి గంట ముందుగా స్టేషన్‌కు చేరుకోవాలి.
- కరోనా లక్షణాలు లేవని తేలిన తర్వాతే అనుమతి.
- ముఖానికి మాస్కు ధరించడం తప్పనిసరి.
- ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- రైళ్లలో దుప్లట్లు, టవల్స్ వంటివి సమకూర్చరు.
దిల్లీ నుంచి పలు నగరాలకు, సికింద్రాబాద్‌కు కూడా నేటి నుంచి ఆన్‌లైన్‌లో బుకింగ్ మొదలు.టికెట్ల బుకింగ్ సాయంత్రం 4 గంటల నుంచి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా ప్రారంభమవుతాయి. కేవలం ఈ వెబ్‌సైట్ ద్వారానే బుక్‌చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రయాణికుల రైళ్లను క్రమంగా పునరుద్ధరించడానికి భారతీయ రైల్వే సిద్ధమైంది. మంగళవారం నుంచి 15 జతల రైళ్లను (అప్ అండ్ డౌన్ కలిపి 30 రైళ్లు) ప్రారంభించాలని నిర్ణయించింది. ఇవి కొత్తదిల్లీ రైల్వేస్టేషన్ నుంచి దిబ్రూగడ్, అగర్తల, హవ్‌డా, పట్నా, బిలాస్‌పుర్, రాంచీ,భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్‌గావ్, ముంబయి సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూతావిల మధ్య నడుస్తాయి. వీటిని ప్రత్యేక రైళ్లుగా పరిగణిస్తారు. ఇవన్నీ రాజధాని రైళ్లు తిరిగే మార్గాలు కావడం గమనార్హం.
రైల్వేస్టేషన్లలోని టికెట్ల కౌంటర్లు మాత్రం తెరుచుకోవు. అక్కడ ప్లాట్‌ఫామ్ టికెట్లు తప్ప ఎలాంటి టికెట్లు ఇవ్వరు.
కేవలం కన్‌ఫర్మ్ టికెట్లు ఉన్న ప్రయాణికులను మాత్రమే రైల్వేస్టేషన్లలోకి అనుమతిస్తారు.
స్క్రీనింగ్ కోసం ప్రయాణికులు కనీసం గంట ముందుగా స్టేషన్‌కు రావాల్సి ఉంటుంది.
ఈ రైళ్లలో జనరల్ బోగీలు ఉండవు.టికెట్లపై ఎలాంటి రాయితీలు ఇవ్వబోరు.
మధ్యలోని కొన్ని స్టేషన్లలో రైలు ఆగుతుంది.
ఇవన్నీ ఏసీ రైళ్లే. సూపర్‌ఫాస్ట్ రైళ్ల ఛార్జీలు వసూలు చేస్తారు.
శ్రామిక్ స్పెషల్‌రైళ్లలో బోగీకి 54 మంది ప్రయాణికులను అనుమతిస్తుండగా, వీటిలో పూర్తి సామర్థ్యం మేరకు 72 మందిని అనుమతిస్తారు.
ఏసీ రైళ్లే అయినప్పటికీ ప్రయాణికులకు బెడ్‌షీట్లు, దుప్పట్లు ఇవ్వరు. సాధారణం కన్నా కాస్త ఎక్కువగా ఉష్ణోగ్రతఉండేలా చూస్తారు. స్వచ్ఛమైన గాలి అందేలా ఏర్పాట్లు చేస్తారు.
ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకోవడం, ఫేస్ కవర్లను ధరించడం, థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవడం తప్పనిసరి. కరోనా వ్యాధి లక్షణాలు లేని ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఇస్తారు.
సెల్‌ఫోలో ఆరోగ్య సేతు యాప్‌ను తప్పకుండా డౌన్‌లోడు చేసుకోవాలి. టికెట్‌తో పాటుగా విధి నిషేధాలను పొందుపరుస్తారు.
మంగళవారం నాడు కేవలం దిల్లీలోనే రైళ్లు ప్రారంభమవుతాయా? లేదా ఆవలి వైపు ఉన్న నగరాల నుంచి కూడా ప్రారంభమవుతాయా అన్నది తెలియరాలేదు. దిల్లీ నుంచి బయలు దేరిన రైళ్లే ప్రయాణం ముగించుకున్న తరువాత (దాదాపుగా మరుసటి రోజున) ఆయా నగరాల నుంచి బయలుదేరుతాయా అన్నది తేలాల్సి ఉంది. ప్రధాని సీఎంలతో సమావేశం కావడానికి ముందు రైల్వేశాఖ ఈ కీలక నిర్ణయం వెల్లడించింది. 20 వేల కోచ్‌లను కొవిడ్ కేర్ సెంటర్లకు, 300 రైళ్లను వలస కూలీల తరలింపునకు కేటాయించిన తర్వాత మిగిలిన కోచ్‌లను బట్టి ఈ సేవలను ప్రారంభించనుంది. క్రమంగా ఇంకా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు ప్రారంభంకానున్నాయి.
- ముందుగా మీరు ఐఆర్‌టీసీ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
- మీ యొక్క యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.
- ఇప్పుడు Book Your Ticket పైన క్లిక్ చేయాలి.
- ఏఏ రూట్లలో రైళ్లు నడుస్తున్నాయో ముందే తెలుసుకొని టికెట్లు బుక్ చేయడం మంచిది.
- రైల్వే స్టేషన్, ప్రయాణ తేదీ, ట్రావెల్ క్లాస్ ఎంచుకోవాలి.
- మీరు ఏ తేదీలో ప్రయాణించడానికైనా సరే అనుకుంటే Flexible with Date పైన క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత Find trains పైన క్లిక్ చేస్తే కొత్త పేజీలో రైళ్ల యొక్క వివరాలు కనిపిస్తాయి.
- రైలు రూట్, టైమింగ్స్ చెక్ చేసుకొని ఎంచుకోవాలి.
- check availability & fare పైన క్లిక్ చేసి ఖాళీ బెర్తులు, ఛార్జీల వివరాలు తెలుసుకోవచ్చు.
- తర్వాత Book Now పైన క్లిక్ చేసి ఆ తర్వాత ప్రయాణికుల వివరాలు ఎంటర్ చేయాలి.
- క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్‌లో ఏదైనా ఆప్షన్ ఎంచుకొని బుకింగ్ పూర్తి చేయాలి.
- మీ యొక్క బుకింగ్ పూర్తైన తర్వాత మీ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది.
It is mandatory to have Aarogya Setu app in your mobile before travel. Please download the one, if you have not downloaded yet.
Click Here for