Andhra Pradesh Covid-19 Emergency Pass Apply Online @citizen.appolice.gov.in
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్ COVID-19 అత్యవసర వాహనం స్పెషల్ పాస్‌లు జారీ దరఖాస్తు వివరాలిలా
The lock-down is known to be part of a nationwide coronavirus prevention campaign. The AP government has taken a key decision to supply agricultural products, including those involved in emergency services. AP Government has decided to issue COVID19 emergency special passes for the public and Issued key directions for those who want to go out for important tasks.The Police Department has made several suggestions to this effect.such as Emergency medical treatment, family death, social work, government duties, etc.E-passes will be issued to those who want to travel on urgent tasks social work and government duties, the police department said.
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా లాక్ డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. అత్యవసర సేవలలో నిమగ్నమై ఉన్న ప్రవేటు వ్యక్తులతో సహా, వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
ఏపీ ప్రజల కోసం జగన్ సర్కార్ COVID19 అత్యవసర స్పెషల్ పాస్‌లు జారీ చేయాలని నిర్ణయించింది. ముఖ్యమైన పనులు నిమిత్తం బయటకు వెళ్ళేవారికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పోలీస్ శాఖ పలు సూచనలు చేయగా.. అత్యవసర వైద్య చికిత్స, కుటుంబంలో మరణం, సామాజిక పనులు, ప్రభుత్వ విధి నిర్వహణ తదితర అత్యవసర పనులపై ప్రయాణించాలనుకునే వారికి ఈ-పాస్‌లు జారీ చేయనున్నట్టు పోలీస్ శాఖ తెలిపింది.
ఈ-పాస్‌ల కోసం https:citizen.appolice.gov.in అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం సమర్పించిన వివరాలను పోలీసులు ఆమోదిస్తే దరఖాస్తు చేసుకున్న వారి మొబైల్, మెయిల్ ఐడీకి వాహన అత్యవసర పాస్‌ను పంపిస్తారు. అత్యవసర పనుల నిమిత్తం అవసరమైన వారు పాస్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీ డీజీపీ కార్యాలయం సూచించింది.
పాస్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే కొన్ని డాక్యుమెంట్లు తప్పనసిరి అని సూచించింది.
COVID19 అత్యవసర వాహనం పాస్ కావాల్సిన వాళ్లు ఈ డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలి
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
- ప్రయాణించేవారి వివరాలు
- ప్రయాణించే వారి ఐడీ ప్రూఫ్స్
- మెయిల్ ఐడీ
- అవసరమైన సంబంధిత డాక్యుమెంట్లు
- మొబైల్ నంబర్
- వాహనానికి సంబంధించిన వివరాలు
డాక్యుమెంట్లు అన్ని పక్కాగా ఉండి.. కారణాలు నిజమైతే ఆ తర్వాత మీకు రూటు పాస్ లభిస్తుంది.
Click Here for