To Boost Your Immunity Eat these in order to Keep the Corona Away from you
కరోనా వైరస్ ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందుతాయన్న ప్రచారం జరుగుతున్న తరుణంలో కరోనా మీ నుండి దూరంగా ఉండాలంటే ప్రతి రోజూ ఇవి తినండి రోగనిరోదక శక్తిని పెంచుకోండి. కరోనా, ఇప్పుడు అందరి నోట ఇదే మాట ఈ వైరస్‌కు మందులేదని, రోగనిరోదక శక్తి పెంచుకుంటే దీని తీవ్రతను తట్టుకొని త్వరగా కోలుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉందని ప్రచారం జరుగుతున్న నేపద్యంలో అనేక మంది రోగనిరోదక శక్తిని పెంచుకోవడానికి అనేక రకాల టిప్స్ అందిస్తున్నారు. అందులో ప్రధానంగా అలోవెరా జ్యూస్ తాగాలని, పసుపు అల్లం, వెల్లుల్లి తినాలని దీనిలో వైరస్ ఇమడలేదని విపరీతంగా ప్రచారం జరుగుతుంది. వీటితోపాటు సమతుల, సూక్ష్మ పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. కానీ కొందరు ఒక్క అడుగు ముందుకేసి ప్రతి పది నిమిషాలకు వేడి నీరు తాగితే రోగనిరోదక శక్తి పెరుగుతుందని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజం. అసలు ఇమ్యూనిటి పెరగాలంటే వైద్యులు ఇస్తున్న సూచనలు ఏమిటి? వాటి గురించి తెలుసుకుందాం. విటమిన్ ఏ, బీ, సీ, డీ, ఈ, ఇనుము, జింక్ లాంటి యాంటి ఆక్సిడెంట్స్ వ్యాధి నిరోధక కణాల ఉత్పతి బాగా జరగడానికి తోడ్పడుతాయి.
Watch Video Here :
Watch Video Here :
కరోనా ఇప్పుడు అందరి నోట ఇదే మాట ఈ వైరస్‌కు మందులేదని, రోగనిరోదక శక్తి పెంచుకుంటే దీని తీవ్రతను తట్టుకొని త్వరగా కోలుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది .
కరోనా మీ నుండి దూరంగా ఉండాలంటే ఇవి తినండి...విటమిన్ ఏ, బీ, సీ, డీ, ఈ, ఇనుము, జింక్ లాంటి యాంటి ఆక్సిడెంట్స్ వ్యాధి నిరోధక కణాల ఉత్పతి బాగా జరగడానికి తోడ్పడుతాయి. రోగనిరోదక శక్తి పెంచుకోండి మన శరీరంలో కొవ్వుకీ, విటమిన్ C కి లింక్ ఉంటుంది. విటమిన్ C సమృద్ధిగా ఉంటే... అది మన శరీర బరువును బ్యాలెన్స్ చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. వేరే దారిలేక జంక్ ఫుడ్ తింటున్నవారికీ, రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్‌లు చెయ్యలేకపోతున్నవారికీ వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతూ ఉంటుంది.
మనం తినే ఆహారంలో అన్ని రకాల పోషకాలూ ఉండాలి. విటమిన్లూ, మినరల్స్ కలిగి ఉండాలి. మీకు తరచుగా అలసట వస్తున్నా, కండరాల్లో నొప్పులు వస్తున్నా, జుట్టు, స్కిన్ ఎండిపోతున్నా... మీకు సీ విటమిన్ తగ్గిపోతున్నట్లు లెక్క. మన శరీరానికి విటమిన్ సీ రెగ్యులర్‌గా అవసరం. ఇది వ్యాధినిరోధక శక్తిని కూడా పెంచడమే కాదు... మన శరీర కణాలు పాడవకుండా చేస్తుంది. అంతేకాదు... అధిక బరువును తగ్గించి... బాడీ మెటబాలిజం (అన్నీ సక్రమంగా పనిచేసేలా చెయ్యడం)ను సరిచేస్తుంది.
ఆరోగ్య చిట్కాలు : వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు రోజూ ఇవి తినండి.
Health Tips : Eat it on a regular basis to boost your immunity.
Watch Video Here :
విటమిన్ సీ రెగ్యులర్‌గా తీసుకోవడానికి ఉసిరి నిమ్మకాయ పండ్లను తినాలి.
ఉసిరి : ఉసిరి కాయల్లో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. ఇదో అద్భుతమైన ఔషధ గుణాలున్న కాయ. పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఉసిరికాయలు తిన్నా, వాటి రసం తాగినా బాడీలో చెడు బ్యాక్టీరియా చచ్చిపోతుంది. వైరల్ ఇన్ఫెక్షన్ల వంటివి రావు. దగ్గు, జలుబు కూడా పరారవుతాయి. అందువల్ల మీకు వీలు దొరికినప్పుడల్లా ఉసిరి కాయలు రెగ్యులర్‌గా తినండి.
నిమ్మకాయ : మనకు మార్కెట్లలో ఏడాది మొత్తం దొరికే వాటిలో నిమ్మకాయలు ఒకటి. వీటిలో వ్యాధినిరోధక శక్తిని పెంచె విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. ప్రతి రోజూ నిమ్మకాయ రసం తీసుకుంటే పైన చెప్పిన ప్రయోజనాలతోపాటూ... ఇంకా చాలా ఉపయోగాలుంటాయి. అందువల్ల ప్రతి ఒక్కరు నిమ్మకాయ రసం రెగ్యులర్‌గా తాగాలి. కొద్దిగా చక్కెర లేదా సాల్ట్ వేసుకొని కూడా తాగొచ్చు.