Friday, March 27, 2020

How to do Pranayam Yoga Breathing Exercises You Must Include in Your Daily Routine Life



How to do Pranayam Yoga Breathing Exercises You Must Include in Your Daily Routine Life

అందరూ ఇంట్లోనే ఉంటున్నాము రోజూ ఉదయాన్నే ఓ పదినిమిషాలు సమయం కేటాయించి ప్రాణాయామం చేయండి... ఏ కరోనా మనల్ని ఏమీ చేయదు... దయచేసి ఈ ఒక్కపని చేయండి... ఇది కేవలం మీకోసమే కాదు మీ కుటుంబం కోసం.. సమాజం కోసం.

ప్రాణాయామం ఎలా చేయాలి..? ప్రయోజనాలేంటి

పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మనిషి యొక్క శ్వాస ప్రస్వాసలు అడుతూనే వుంటాయి. వీటిని మనస్సు గ్రహించగలగడమేు ప్రాణాయావు మన్నమాట. యోగాభ్యాసం చేస్తున్నప్పడు శ్వాస ప్రస్వాసల్ని నియంత్రించడం జరుగుతుంది.అందువల్ల ప్రతి ఆసనం ప్రాణాయనావుంతో పరిణతి సాధిస్తుంది.

ఇలా ప్రాణాయామం చేస్తే సంపూర్ణమైన ఆరోగ్యంతో పదికాలాలు జీవిస్తారు




ప్రాణాయామ వేశేషాలు:

ప్రాణం + ఆయూవుం = ప్రాణాయామం, ప్రాణవుంటే జీవన శక్తి. ఆయామం అంటే విస్తరింపచేయుటలేక నియంత్రించియుంచుట అని అర్థం. పతంజలి మహర్షి ప్రసాదించిన యోగ సూత్ర ప్రకారం శ్వాస ప్రశ్వాసల్ని నియంత్రించి యుంచడమే ప్రాణాయామం అని నిర్మారించడం జరిగింది. లోనికి పీల్చే గాలిని శ్వాస అని, బయటికి వదిలే గాలిని ప్రశ్వాస అని అంటారు. శ్వాస ప్రశ్వాసల్ని నియంత్రించడం, క్రమబద్ధం చేయడం ద్వారా అంతర్గత సూక్క ప్రాణాన్ని కూడా అదుపులో వుంచవచ్చు.

నాడీ మండలం, రక్త ప్రసారధమనులు, జీర్ణకోశం, మూత్రకోశం మొదలుగా గల వాటన్నిటి యందు ప్రాణం సంచరిసూ వుంటుంది. ప్రాణాయామం వల్ల వాటన్నింటికి శక్తి, రక్షణ లభిస్తాయి. కనుకనే “ప్రాణాయామేన యుత్తేన సర్వరోగ క్షయు భవేత్ ” అంటే ప్రాణాయామం నియమబద్ధంగా ఆచరిస్తే సర్వరోగాలు హరించిపోతాయి అను సూత్రం ప్రచలితం అయింది.

ప్రాణానికి ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యానమును 5 రూపాలు వున్నాయి. ప్రాణానికి స్మానం హృదయం. అపానానికి స్మానం గుదం, సమానానికి స్మానం నాభి, ఉదానానికి స్మానం కంఠం, వ్యానానికి స్మానం శరీరమంతా, శ్వాస క్రియకు ప్రాణం, విసర్జన క్రియకు అపానం, పాచన క్రియకు సమానం, కంఠశక్తికి ఉదానం, రక్త ప్రసార క్రియకు వ్యానం తోడ్పడుతాయి.


శ్వాసను బయటికి వదిలే క్రియను రేచకం అని, లోపలికి పీల్చే క్రియను పూరకం అని, లోపల గాలిని నిలిపి వుంచడాన్ని అంతర్ కుంభకం అని, తిరిగి బయటికి వదిలి ఆపివుంచడాన్ని బాహ్య కుంభకం అని అంటారు. యీ క్రియలు ప్రాణాయామానికి సాధనాలు.

మెడికల్ సైన్సు ప్రకారం రెండు ముక్కు రంధాల ప్రయోజనం ఒక్కటే. కాని యోగులు యీ రెండిటికి మధ్య గల భేదం గ్రహించారు. వారి పరిశోధన ప్రకారం కుడి ముక్కు రంధాన్నుంచి నడిచే గాలి కొద్దిగా ఉష్ణం కలిగిస్తుంది. అందువల్ల దీన్ని వారు సూర్య నాడి లేక సూర్య స్వరం అని అన్నారు. అట్లే ఎడమ ముక్కు రంధ్ర ప్రభావం చల్లని దనం, అందువల్ల దాన్ని చంద్రనాడి లేక చంద్రస్వరం అని అన్నారు. యీ రెండిటికి మధ్య సమన్వయం సాధించుటకు యోగ శాస్త్రంలో ప్రాధాన్యం యివ్వబడింది. హ అను అక్షరం చంద్రుడికి, ఠ అను అక్షరం సూర్యుడికి గుర్తులుగా నిర్మారించారు. అందువల్ల హఠయోగం వెలువడింది. హఠయోగమంటే చంద్రసూర్యనాడులకు సంబంధించిన విజున మన్నమాట. హఠం అనగా బలవంతం అని కాదు. ప్రాణాయామ విజ్ఞానమంతా చంద్రసూర్యస్వరాలకు సంబంధించినదే.

ప్రాణాయామం వల్ల కలిగే ప్రయోజనాలు:

1) ఊపిరితిత్తులు బాగా పని చేస్తాయి.

2) శరీరానికి ప్రాణవాయువు బాగా లభిస్తుంది.

3) రక్త శుద్ధి జరిగి అందలి చెడు అంతా బయటికి వెళ్లి పోతుంది.

4) గుండెకు సత్తువ లభిస్తుంది.

5) మెదడు చురుగా పని చేస్తుంది.

6) పేగులు, నరాలు, నాడులు శుభ్ర పడతాయి.

7) జఠరాగి పెరుగుతుంది.

8) శరీరం ఆరోగ్యంగా వుంటుంది.

9) ఆయుస్సు పెరుగుతుంది. యిది అన్నిటి కంటే మించిన విశేషం


తీసుకోవలసిన జాగ్రత్తలు:

1) మైదానంలో గాని, తోటలో గాని, తలుపులు తెరిచి యున్న గదిలో గాని, కంబళీ లేక బట్టలేక ఏదేని ఆసనం మీద కూర్చొని ప్రాణాయామం చేయాలి.

2) గాలి విపరీతంగా వీసూ వుంటే ఆ గాలి మధ్య ప్రాణాయామం చేయకూడదు.

3) మురికిగా వున్న చోట, దుర్వాసన వస్తున్న చోట, పొగ వస్తున్న చోట ప్రాణాయామం ప్రాణాయామం చేయకూడదు.

4) సిగరెట్ట, బీడీ, చుట్ట పొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు.

5) పొట్ట నిండుగా వున్నప్పుడు ప్రాణాయామం చేయకూడదు.

6) ప్రాణాయామం చేసే ముందు, చేసిన తరువాత కూడా యితర యోగాసనాలు పేయవచ్చు. అయితే చివరన శవాసనంపేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి.

7) ప్రాణాయామం చేస్తున్నప్పడు బట్టలు తక్కువగాను, వదులుగాను ధరించాలి.

8) పద్మాసనం, సుఖాసనం, సిదాసనం, వజ్రాసనం ప్రాణాయామానికి అనువైన ఆసనాలు. నేల మీద కూర్చో లేని వాళ్లు కుర్చీ మీద నిటారుగా కూర్చొని ప్రాణాయామం చేయవచ్చు.

9) నడుం, వీపు, వెన్నెముక, మెడలను నిటారుగా వుంచి ప్రాణాయామం చేయాలి.

10) ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఒక సారి కుడి ముక్కు రంధాన్ని మరో సారి ఎడమ ముక్కు రంధాన్ని మూయ వలసి వస్తుంది. కుడి ముక్కు రంధాన్ని కుడి చేతి బొటన ప్రేలితోను, ఎడమ ముక్కు రంధాన్ని కుడి చేతి ఉంగరం ప్రేలితోను మూయాలి.

11) ముక్కు రంధాలు సరిగా శుభ్రంగా లేకపోతే ప్రాణాయామం చేసే ముందు జలనేతి, సూత్రనే తి క్రియులు సక్రమంగా చేయూలి. అలా చేస్తే ప్రాణాయామం చేస్తున్నప్పడు శ్వాస సరిగా ఆడుతుంది.

12) ప్రాణాయామ క్రియలు చేసూ వున్నప్పడు మనస్సును పూర్తిగా శ్వాస ప్రశ్వాస ప్రక్రియలపై కేంద్రీకరించాలి. వేరే యోచనలకు తావుయీయ కూడదు.