సివిల్స్-2020 సక్సెస్ మార్గాలు
ఐపిఎస్, ఐఎఎస్‌లు కావాలని చాలామంది అనుకుంటారు. కానీ ఆ దిశగా పట్టుదలతో ప్రయత్నించేవారు కొద్దిమందే. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ దేశంలో అత్యున్నత సర్వీసు లుగా భావించే ఐఎఎస్, ఐపిఎస్ సర్వీసుల్లో పోస్టుల భర్తీకి నిర్వహించే ఎంపిక ప్రక్రియ! యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపిఎస్సీ) వచ్చే నెలలో (ఫిబ్రవరి-2020) సివిల్స్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
Career
మూడంచెల్లో సివిల్స్ ఎంపిక ప్రకియ జరుగుతుంది. ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూలు. తొలిదశ ప్రిలిమినరీ పరీక్ష మే 31వ తేదీన ఉంటుంది. అంటే దాదాపు ఇంకా నాలుగునెలల సమయం అందుబాటులో ఉంది.
విస్తృతమైన సిలబస్ దృష్ట్యా అభ్యర్థులు నిర్దిష్ట ప్రణాళికతో ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభించడం మేలు అంటున్నారు నిపుణులు. ఈ నేపధ్యంలో సివిల్స్ ఎంపిక ప్రక్రియ ప్రిలిమ్స్ పరీక్ష విధానం సిలబస్ విశ్లేషణ..ప్రిపరేషన్ గైడెన్స్‌తొలిదశ ప్రిలిమ్స్
మూడుదశల సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో ప్రలిమినరీ పరీక్ష అత్యంత కీలకం. ఎందుకంటే సివిల్స్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసి పోస్టుల సంఖ్య వేయి లోపే! కాని పోటీపడే అభ్యర్థుల సంఖ్య తొమ్మిద నుంచి పది లక్షల మంది. ప్రిలిమి నరీ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా 1:12 లేదా 1:12.5 నిష్పత్తిలో మెయిన్‌కు ఎంపిక చేస్తారు. అంటే ప్రిలిమ్స్‌కు దరఖాస్తు చేసుకునే పదిలక్షల మంది నుంచి మెయిన్‌కు ఎంపిక య్యేది కేవలం 12వేల మంది. దీన్నిబట్టే ప్రిలిమ్స్‌లో పోటీ ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక పోస్టుల సంఖ్య తక్కువయ్యే కొద్ది మెయిన్‌కు పోటీ మరింత తీవ్రం అవుతుంది. కాబట్టి ప్రిలిమ్స్‌లో గట్టెక్కడం అత్యంత కీలకమని చెప్పొచ్చు. అందుకే ప్రిలిమ్స్‌లో విజయం సాధించాలంటే నోటిఫికేషన్ వెలువడే వరకూ వేచి చూడకుండా సాధ్యమైనంత ముందుగానే ప్రిపరేషన్ ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు.
సిలబస్ పరిశీలన:
సివిల్స్ అభ్యర్థులు ముందుగా ప్రిలిమ్స్ సిలబస్‌ను అసాంతం పరిశీలించాలి. ఇందుకోసం గత నోటిఫికేషన్‌ను ఆధారం చేసుకోవాలి. సిలబస్‌లో పేర్కొన్న అంశాలతోపాటు తమ వ్యక్తిగత సామర్థ్య స్థాయిని అంచనా వేసుకోవాలి. ఫలితంగా ప్రిపరేషన్‌పరంగా తాము ఎక్కువగా దృష్టిసారించాల్సిన అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. సిలబస్‌ను క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా దేనికి ఎంత సమయం కేటాయించాలి? ఏ పుస్తకాలు చదవాలి? మనకు సులువైన, క్లిష్టమైన అంశాలేవో తెలుస్తుంది. తద్వారా నిర్దిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్ సాగించడానికి మార్గం సుగమం అవు తుంది. అదేవిధంగా గత ప్రశ్నపత్రాలను పరిశీలించడం ద్వారా ప్రశ్నలు అడుగుతున్న శైలి ఏఏ సబ్జెక్టులకు ఎంత ప్రాధాన్యం లభిస్తోంది తదితర అంశాలపై అవగాహన కలుగుతుంది.
మెటిరియల్ సేకరణ:
ప్రిలిమ్స్ అభ్యర్థులు సిలబస్‌లో పేర్కొన్న అంశాలకు సంబంధించి ప్రామాణిక మెటీరియల్ సేకరణపై దృష్టిపెట్టాలి. మెటీరియల్ ఎంపిక కోసం ప్రత్యేకంగా కొంత సమయం కేటాయించుకోవాలి. తొలుత అందుబాటులో ఉన్న పుస్తకాలను పరిశీలించాలి. ప్రతి సబ్జెక్టు విషయంలోనూ సిలబస్‌లో పేర్కొన్న అన్ని టాపిక్స్ సమగ్రంగా పొందుపర్చిన పుస్తకాన్ని ఎంపిక చేసుకోవాలి. అలాగే ఆయా టాపిక్‌కు సంబంధించి నాలు గైదు పుస్తకాలకు బదులు ఏదో ఒక ప్రామాణిక మెటీరియల్‌ను నాలుగైదుసార్లు చదవడం మేలు చేస్తుంది. ముఖ్యంగా మొదటిసారి ప్రిలిమ్స్ రాస్తున్న అభ్యర్థులు ఇలాంటి వ్యూహం అనుసరించడం ఉపయుక్తం.
రెండు పేపర్లు:
సివిల్స్, ప్రిలిమ్స్ పరీక్షలో రెండు అబ్జెక్టివ్ తరహా పేపర్లు..జనరల్ స్టడీస్-1, జనరల్ స్టడీస్
్-2 (సిశాట్) ఉంటాయి. అభ్యర్థులు రెండు పేపర్లకు భిన్నమైన ప్రిపరేషన్ వ్యూహాలు అనుసరించాలి. జనరల్ స్టడీస్-1లో హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌కు సంబంధించిన ప్రశ్నలు అడుగూరు. రెండో పేపర్ సీశాట్‌లో రీడింగ్ కాంప్రెహెన్షన్, న్యూమరికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్స్‌పై ప్రశ్నలు ఉంటాయి. ప్రిలిమ్స్ ప్రిపరేషన్‌లో కరెంటు అఫైర్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.
ఎందుకంటే గత మూడు, నాలుగేళ్లుగా వర్తమాన అంశాలపై ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్‌ను కోర్ టాపిక్స్‌తో అన్వయం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. వర్తమాన అంశాలతోపాటు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన టాపిక్స్ జాగ్రఫీ, ఎకాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారిన పర్యావరణ కాలుష్యం, అందుకు సంబంధించి అంతర్జాతీయ, జాతీయస్థాయిలో తీసుకుంటున్న చర్యలు వంటి వాటిపై ప్రశ్నలు అడుగుతు న్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనదేశం తాజాగా ప్రయోగించిన ఉపగ్రహాలు, వాటి లక్ష్యాలు వంటి అంశాలు తెలుసుకోవాలి.
సివిల్స్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్‌లో అభ్యర్థులు ఆయా అంశాలను అనుసంధానం చేసుకుంటూ అధ్యయనం చేయాలి. ఉదాహరణకు జాగ్రఫీని చదివేటప్పుడు అందులో ఉండే జనాభా, పంటలు, సహజ వనరులు-ఉత్పాదకత తదితర అంశాలను ఎకనామిక్స్‌తో అన్వయం చేసుకుంటూ చదవాలి. ఫలితంగా ఒకే సమయంలో రెండు అంశాలపైనా పట్టు లభిస్తుంది. ఇదే తరహాలో పాలిటీ-ఎకానమీని అన్వయం చేసుకుంటూ చదవొచ్చు. ఇటీవల కాలంలో ప్రిలిమ్స్‌లో ప్రభుత్వ నిర్ణయాలు ఆర్థికంగా వాటి ప్రభావం ఎలా ఉంటుంది అనే కోణంలో ప్రశ్నలు అడుగు తున్నారు. ఉదాహరణకు జిఎస్‌టినే తీసుకుంటే శాసనపరంగా తీసుకున్న ఈ నిర్ణయం..ఆర్థిక, వాణిజ్యరం గాలపై చూపే ప్రభావం గురించి అవగాహన పెంచుకోవాలి. ఇలా అనుసంధా నించుకుంటూ చదివితే ఏకకాలంలో అనేక అంశాలపై పట్టు చిక్కుతుంది. అంతేకాకుండా ప్రిపరేషన్‌పరంగా ఎంతో విలువైన సమయం ఆదా అవుతుంది.
డిస్క్రిప్టిప్ అప్రోచ్:
వాస్తవానికి ప్రిలిమినరీ పరీక్ష రెండు పేపర్లలో అబ్జేక్టివ్ విధానంలో జరుగుతుంది. పరీక్ష అబ్జేక్టివ్ విధానంలో జరిగినా అభ్యర్థులు డిస్క్రిప్టివ్ పద్ధతిలో చదవాలి. దీనివల్ల సదరు టాపిక్‌పై అన్ని కోణాల్లో అవగాహన లభిస్తుంది. ఇది మెయిన్ ప్రిపరేషన్ సులభం చేస్తుంది. కాబట్టి ఒక అంశానికి సంబంధించి ప్రామాణిక మెటీరి యల్‌లో ఉండే అన్ని కోణా లపై స్పష్టత ఏర్పర చుకోవాలి. అభ్యర్థులు ప్రిలిమ్స్ ప్రిపరేషన్ సమ యంలోనే మెయిన్ సిలబస్‌తో అనుసంధానం చేసుకుంటూ చదవాలి. మెయిన్‌లో ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్లు, ఎథిక్స్ పేపర్ మినహా మిగతా అన్ని పేపర్లు ప్రిలి మ్స్ జన రల్ స్టడీస్‌లో పేర్కొన్న విభాగాలకు సంబంధించినవే. కాబట్టి ఆయా సబ్జెక్టులను డిస్క్రిప్టివ్ అప్రో చ్‌తో చదివితే మెయిన్‌కు కూడా ఉపయోగపడుతుంది