AP SSC/ 10th Class Biology Preparation Plan and Important Questions
10వ తరగతి జీవశాస్త్రం - ప్రిపరేషన్ ఎలావుండాలి?
బట్టీవిధానానికి
స్వస్తిపలికి, వివిధ
సామర్థ్యాలను
విధ్యార్థులలో
కల్పించాలనే
ఉద్దేశ్యంతో మన
రాష్ట్ర ప్రభుత్వం
సి.సి.ఇ
విధానంను
ప్రవేశపెట్టటం
జరిగిందని మనందరికీ
తెలిసిందే. ఈ
విధానంలో 10వ
తరగతి జీవశాస్త్ర పరీక్ష
పేపరును ఒకసారి లోతుగా
పరిశీలిద్దాం.
చాఫ్టరువారీ
మార్కుల
కేటాయింపు:
పాఠ్యపుస్తకం లోని
10 చాప్టర్లకు సమాన
వెయిటేజీ ఇవ్వటం
జరుగుతుంది. అనగా ప్రతి
చాప్టరు నుండి
అత్యధికంగా 5 మార్కుల వరకు
ప్రశ్నలిస్తారు. 9,10 చాప్టర్ల నుండి
మూడు లేదా నాలుగు
మార్కులు తగ్గించి
వాటిని పర్యావరణ విధ్య
నుండి అడిగే అవకాశం
ఉంది. ఈ విధంగా మొత్తం
50 మార్కులకు
ప్రశ్నాపత్రం
ఉంటుంది.
సెక్షన్లవారి మార్కుల కేటాయింపు:
సెక్షన్-1లో
లక్ష్యాత్మక ప్రశ్నలు
12
(1-12) ఉంటాయి. ప్రతి
ప్రశ్నకు అర మార్కు
చొప్పున 6 మార్కులకు
ప్రశ్నలిస్తారు.
అన్నింటికి సమాధానం
వ్రాయాలి.
సెక్షన్-2లో
అతిస్వల్ప సమాధాన
ప్రశ్నలు 8 (13-20) ఉంటాయి.
ప్రతిప్రశ్నకు ఒక మార్కు
చొప్పున
8 మార్కులకు
ప్రశ్నలిస్తారు.
అన్నింటికి సమాధానం
వ్రాయాలి.
సెక్షన్-3లో స్వల్ప
సమాధాన ప్రశ్నలు
8 (21-28) ఉంటాయి.
ప్రతి ప్రశ్నకు రెండు
మార్కుల చొప్పున 16
మార్కులకు ప్రశ్న
లిస్తారు.
అన్నింటికి సమాధానం
వ్రాయాలి.
సెక్షన్-4లో
వ్యాసరూప ప్రశ్నలు 5
(29-33) ఉంటాయి.
ప్రతిప్రశ్నకు 4 మార్కుల
చొప్పున 20 మార్కులకు
ప్రశ్నలిస్తారు.
వీటికి మాత్రం
ఇంటర్నల్ ఛాయిస్
ఉంటుంది.
Click Here to Download
Click Here to Download