Monday, February 17, 2020

Know How to Update Aadhaar Details and Online Slot Booking Appointment

Know How to Update Aadhaar Details and  Online Slot Booking Appointment

Child Aadhaar Card : ఐదేళ్లు దాటిన పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు శుభవార్త . ఆధార్ సెంటర్లో మీ పిల్లల బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేయడానికి మీరు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు . ఉచితంగానే వివరాలు అప్డేట్ చేయొచ్చని చెబుతోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా - UIDAI.



Know How to Update Aadhaar Details and Online Slot Booking Appointment /2020/02/Know-How-to-Update-Aadhaar-Details-and-Online-Slot-Booking-Appointment.html

మీ పిల్లలకు ఆధార్ కార్డు ఉందా? వారికి ఐదేళ్ల లోపు ఉన్నప్పుడే ఆధార్ కార్డ్ తీసుకొని ఆ తర్వాత వివరాలు అప్‌‌డేట్ చేయించలేదా? అయితే ఆ ఆధార్ కార్డులు చెల్లకపోవచ్చు. పిల్లలకు ఐదేళ్ల వయస్సులోపు ఆధార్ కార్డు తీసుకున్నవారంతా తమ పిల్లల వయస్సు ఐదేళ్లు దాటిన తర్వాత ఖచ్చితంగా వివరాలు అప్‌డేట్ చేయించాల్సిందే. చాలామందికి ఈ విషయాలు తెలియక... ఆధార్ కార్డు ఒకసారి తీసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా ఆధార్ కార్డు జారీ చేస్తోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI. అయితే ఐదేళ్లలోపు పిల్లలకు ఇచ్చే ఆధార్ కార్డ్ బ్లూ కలర్‌లో ఉంటుంది. దాన్ని చైల్డ్ ఆధార్ లేదా బాల్ ఆధార్ అంటారు. పిల్లల వయస్సు ఐదేళ్లు దాటిన తర్వాత ఆ ఆధార్ కార్డు చెల్లదు. తల్లిదండ్రులు మళ్లీ తమ పిల్లల్ని ఆధార్ సెంటర్‌కు తీసుకెళ్లి బయోమెట్రిక్ వివరాలు అప్‌డేట్ చేయించాలి.

మీ పిల్లలకు మొదటిసారి ఆధార్ కార్డు తీసుకునేప్పుడు బర్త్ సర్టిఫికెట్ సమర్పించాలి. చైల్డ్ ఆధార్‌ను పిల్లల తల్లిదండ్రులకు లింక్ చేస్తారు. ఐదేళ్లలోపు బయోమెట్రిక్ వివరాలేవీ తీసుకోరు. వెరిఫికేషన్, రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన కన్ఫర్మేషన్ మెసేజ్ తల్లిదండ్రుల రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వస్తుంది. రిజిస్టర్డ్ అడ్రస్‌కు 60 రోజుల్లో ఆధార్ కార్డ్ వస్తుంది. ఇక పిల్లల వయస్సు ఐదేళ్లు దాటినప్పుడు బయోమెట్రిక్ వివరాలు అప్‌డేట్ చేయించాల్సి ఉంటుంది. ఆధార్ సేవా కేంద్రం లేదా ఆధార్ సెంటర్‌కు వెళ్లి తల్లిదండ్రుల వివరాలతో పాటు పిల్లల వివరాలతో ఫామ్‌ పూర్తి చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించాలి. పిల్లల వేలిముద్రలు, ఐరిస్ లాంటి అప్‌డేట్ చేసి కొత్త ఆధార్ కార్డ్ జారీ చేస్తారు. కొత్త ఆధార్ కార్డు 90 రోజుల్లో రిజిస్టర్డ్ అడ్రస్‌కు వస్తుంది.

పిల్లల వయస్సు ఐదేళ్లు దాటగానే బయోమెట్రిక్ వివరాలు అప్‌డేట్ చేస్తే సరిపోదు. మళ్లీ వాళ్ల వయస్సు 15 ఏళ్లు దాటిన తర్వాత కూడా బయోమెట్రిక్ డీటెయిల్స్ అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. పిల్లల బయోమెట్రిక్ వివరాలు అప్‌డేట్ చేయడానికి యూఐడీఏఐ ఎలాంటి ఛార్జీలను వసూలు చేయదు. తల్లిదండ్రులు తమ పిల్లల వివరాలను ఉచితంగానే అప్‌డేట్ చేయొచ్చు. మరి మీ పిల్లల ఆధార్ కార్డు వివరాలు అప్‌డేట్ చేయడానికి ఆధార్ సేవా కేంద్రాల్లో స్లాట్ ఎలా బుక్ చేయాలో తెలుసుకోవడానికి

Aadhaar: ఆధార్ అప్‌డేట్ చేయించాలా? ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేయొచ్చు ఇలా.


Aadhaar Slot Booking :  మీరు మీ ఆధార్‌ కార్డులో ఏవైనా కరెక్షన్స్ చేయించాలా? ఆధార్‌లో వివరాలు అప్‌డేట్ చేయించాలా? ఆధార్ సెంటర్లతో పాటు ఆధార్ సేవా కేంద్రాల్లోనూ ఈ సేవలు పొందొచ్చు. ఆధార్ సేవా కేంద్రాల్లో సేవలు పొందాలంటే ముందే స్లాట్ బుక్ చేసుకోవచ్చు.


1.  పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల లాగా ఆధార్ సేవా కేంద్రాలు ఏర్పాటవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విజయవాడలో ఆధార్ సేవా కేంద్రం ప్రారంభమైంది. ఆధార్ సేవా కేంద్ర-ASK ప్రాజెక్ట్‌‌లో భాగంగా దేశవ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేయనుంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI.

2. అడ్రస్, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, పుట్టిన తేదీ, బయోమెట్రిక్ లాంటి వివరాల అప్‌డేషన్ లాంటి సేవలు ఏవైనా పొందొచ్చు.

3.  ఆధార్ సేవా కేంద్రాల్లో ఎక్కువ సేవలు వేగంగా అందుతాయి. ఆధార్ సేవా కేంద్రాల్లో సేవలు పొందాలంటే స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్‌పోర్ట్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నట్టే ఆధార్ సేవా కేంద్రాలకు స్లాట్ బుక్ చేసుకొని నిర్ణీత సమయంలో వెళ్లి సేవలు పొందొచ్చు. పబ్లిక్ హాలిడేస్ రోజు ఆధార్ సేవా కేంద్రాలకు సెలవు. ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు టైమ్ స్లాట్ సెలెక్ట్ చేసుకోవచ్చు.

4. ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ ఓపెన్ చేయండి. My Aadhaar ట్యాబ్‌లో 'Book an Appointment' పైన క్లిక్ చేయండి.

5. సిటీ లొకేషన్ సెలెక్ట్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. New Aadhaar, Aadhaar Update, Manage Appointment ఆప్షన్స్ కనిపిస్తాయి.

6.  మీకు కావాల్సిన ఆప్షన్ ఎంచుకొని మొబైల్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. మీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. ఓటీపీ వెరిఫికేషన్ తర్వాత మీ వివరాలన్నీ ఆన్‌లైన్ ఫామ్‌లో ఎంటర్ చేయాలి.

7. అపాయింట్‌మెంట్ వివరాలు, వ్యక్తిగత వివరాలు ఫిల్ చేసిన తర్వాత టైమ్ స్లాట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ అపాయింట్‌మెంట్ వివరాలన్నీ ఓసారి సరిచూసుకోవాలి. 

Click Here for