Monday, February 10, 2020

Disha App is a Step towards the safety Download


Disha App is a Step towards the safety Download


DISHA is a step towards the safety and location by Andhra Pradesh govt.. Disha SOS services helps the women and citizens in emergency situation. DISHA app also integrated with needful information like nearby safety places, nearby police stations, nearby hospitals and useful contacts.Disha contains tracking safety feature for every user. This APP also gives you phone numbers that you can dial to get emergency help and support. DISHA also contains links like Helpline Numbers. We hope that this APP makes more safety to women and citizens and makes the crime rate less.



Disha App is a Step towards the safety Download /2020/02/Disha-App-is-a-Step-towards-the-safety-Download.html


హైదరాబాద్ లో జరిగిన ‘దిశా’ సంఘటన అనంతరం దేశంలో మహిళల భద్రతపై మళ్లీ ప్రశ్నలు తలెత్తాయి. ప్రమాదం ఏ వైపు నుంచి తరుముకు వస్తుందో చెప్పలేని నేటి యుగంలో మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ ద్వారా మనం ఆపదలో ఉన్నామని అయిన వారికి తెలిసేలా చేయవచ్చు. సాధారణంగా వాట్సాప్ లో ఉన్న లైవ్ లొకేషన్ ఫీచర్ మనందరికీ తెలుసు. కానీ గూగుల్ మ్యాప్స్ లో కూడా అటువంటి లైవ్ లొకేషన్ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ద్వారా మన లైవ్ లొకేషన్ మాత్రమే కాకుండా మన ఫోన్ లో ఎంత చార్జింగ్ ఉంది అనే విషయం కూడా తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ ను ఉపయోగించుకోవాలంటే కింద తెలిపిన విధానాన్ని పాటించాలి.

ముందుగా మీ ఫోన్ లో గూగుల్ మ్యాప్స్ ను ఓపెన్ చేయాలి. గూగుల్ మ్యాప్స్ ను ఓపెన్ చేసిన అనంతరం ఎడమవైపు పైభాగంలో ఉండే హాంబర్గర్(మూడు గీతల ఐకాన్) ఐకాన్ పై క్లిక్ చేయాలి. అక్కడ మీకు చాలా ఆప్షన్లు కనిపిస్తాయి.

అందులో లొకేషన్ షేరింగ్ పై క్లిక్ చేయాలి. అనంతరం మీకు ఒక పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ‘Get Started’ పై క్లిక్ చేయాలి. అక్కడ మీకు పైన ‘Share Your Live Location’ అనే ఆప్షన్ కనపడుతుంది.


దాని కిందనే మీకు మొట్ట మొదటగా టైమ్ ఆప్షన్ కనపడుతుంది. అక్కడ మీరు 15 నిమిషాల నుంచి మూడు రోజుల వరకు ఎంత సేపు కావాలంటే అంత సేపు ఆ లొకేషన్ షేర్ చేసే ఆప్షన్ ఉంటుంది. గరిష్టంగా మూడు రోజుల వరకు ఈ లొకేషన్ షేర్ చేయవచ్చు. కింద ‘Until you turn this off’ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. దాని ద్వారా మనం ఆపే వరకు లొకేషన్ షేర్ చేయవచ్చు.

ఇక ఎలా షేర్ చేయాలంటే.. మనం పైన టైమ్ లిమిట్ సెట్ చేయగానే కింద మీకు గూగుల్ కాంటాక్ట్స్ తో పాటు వాట్సాప్, మెసెంజర్, హ్యాంగ్ అవుట్స్, టెలిగ్రాం, ఎస్ఎంఎస్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం వంటి వివిధ సామాజిక మాధ్యమాలు కనిపిస్తాయి. వాట్సాప్ పై క్లిక్ చేసి మీరు సాధారణంగా ఒక మెసేజ్ ని ఫార్వార్డ్ చేసినట్లు మీ లొకేషన్ ను కూడా షేర్ చేయవచ్చు. ఇలా లొకేషన్ షేర్ చేస్తే కేవలం అవతలి వ్యక్తులు మీ లొకేషన్ తో పాటు మీ ఫోన్ లో ఎంత చార్జింగ్ ఉందో కూడా చూడవచ్చు.

అయితే కేవలం గూగుల్ మ్యాప్స్ ద్వారానే కాకుండా.. వాట్సాప్ ద్వారా కూడా లైవ్ లొకేషన్ షేర్ చేయవచ్చు. అది ఎలాగంటే..

Step 1 : మీ ఫోన్ లో వాట్సాప్ ఓపెన్ చేయండి. అనంతరం మీరు ఈ లైవ్ లొకేషన్ ఎవరికి షేర్ చేయాలనుకుంటున్నారో వారి చాట్ లోకి వెళ్లండి

Step 2 : వాటిలో లొకేషన్ పై క్లిక్ చేయండి. అక్కడ మీకు సెండ్ యువర్ కరెంట్ లొకేషన్, షేర్ లైవ్ లొకేషన్ అనే రెండు ఆప్షన్లు ఉంటాయి. సెండ్ యువర్ కరెంట్ లొకేషన్ పై క్లిక్ చేస్తే మీరు ప్రస్తుతం ఉన్న లొకేషన్ షేర్ అవుతుంది. షేర్ లైవ్ లొకేషన్ పై క్లిక్ చేస్తే గంట సేపు మీ లొకేషన్ అవతలి వారికి షేర్ అవుతుంది.

Step 3 : కాబట్టి ఎవరైనా, ఎప్పుడైనా అనుకోని ప్రమాదం బారిన పడినా, ఏదైనా అనుమానాస్పదంగా అనిపించినా తమ లొకేషన్ ను వెంటనే తమకు తెలిసిన వారికి షేర్ చేయండి. దీన్ని బట్టి మీరు ఆపదలో ఉన్నారని వారికి అర్థం అవుతుంది. వారు మిమ్మల్ని రక్షించడానికి, మీ దగ్గరకు రావడానికి అవకాశం ఉంటుంది.

Click Here for

Download Disha App