Telangana TS Launches Board of Intermediate Grievances Redressal System @bigrs.telangana.gov.in
తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ విద్యార్థుల కోసం ఆన్‌లైన్ గ్రీవెన్స్ పోర్టల్‌ను ప్రారంభించింది
Telangana State Board of Intermediate Education (TSBIE) has launched its Board of Intermediate Grievance Redressal System (BIGRS) for Intermediate students on Tuesday. Chief Secretary Somesh Kumar inaugurated the Board of Intermediate Grievances Redressal System. The system is prepared by the Centre for Good Governance (CGG). Intermediate students can now file grievances online and get them resolved in no time. "Once the complaints are received on bigrs.telangana.gov.in, the software will immediately direct the complaint to the officers concerned. After logging on to the website, students and other stakeholders like parents, college managements will have to enter their mobile number, confirm it by using a one-time password. "After logging, students can enter the details of their grievance. They can also track the status of their complaints, with date and time till the issue is resolved.The complaints received online will be addressed immediately.
Telangana Board of Intermediate Education (TSBIE) will soon introduce various modes of accessing grievances through social media apps like Facebook, Twitter, Whatsapp, Mobile App, Gmail, helpdesk, and Call Centre.
How to Submit the Complaint at TS Intermediate Redressal System
Students can know the complaint process given below.
- Visit the BIGRS website http://bigrs.telangana.gov.in
- Enter your Mobile Number.
- OTP will be sent
- Enter OTP, Click on Verify OTP.
- You will be Redirected to Complaint form.
- Then enter applicant name.
- Your Mobile No will be displayed.
- Enter College Code.
- Select College name and District.
- Select Category of Problem.
- Enter your Village Name & Address.
- Upload any Proofs in the form of JPG, PNG and PDF.
- Write your Complaint and Click on Submit.
- Complaint ID will be sent to your Registered Mobile Number.
తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ విద్యార్థుల కోసం ఆన్‌లైన్ గ్రీవెన్స్ పోర్టల్‌ను ప్రారంభించిన సీఎస్ సోమేశ్‌కుమార్. త్వరలో హెల్ప్‌డెస్క్, కాల్‌సెంటర్ సేవలు అందుబాటులోకి
విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బీఐజీఆర్‌ఎస్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. గతేడాది ఏప్రిల్లో విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో నెలకొన్న గందరగోళంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఏ స్థాయిలో ఆందోళన చెందారో తెలిసిందే. బోర్డు తప్పుల వల్ల తాము పరీక్షల్లో ఫెయిలయ్యామనే భావనతో కొంత మంది విద్యార్థులు ఆవేశంతో ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు. అయితే, ఈసారి ఫలితాల విషయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.
ఇంటర్ బోర్డు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎస్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇంటర్ పరీక్షలను సీరియస్‌గా తీసుకుందని, ఇందులో భాగంగానే ఫలితాల గందరగోళం సమయంలో గతేడాది నియమించిన త్రిసభ్య కమిటీ చేసిన సూచనలన్నింటినీ అమలు చేస్తున్నట్లు వివరించారు. గత ఏడాది జరిగిన తప్పిదాలపై ప్రత్యేకంగా నివేదిక రూపొందించి, పీపీటీ కూడా రూపొందిస్తున్నామని చెప్పారు. దీన్ని జవాబు పత్రాలు మూల్యాంకనం చేసే లెక్చరర్లకు శిక్షణ ఇవ్వాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. పరీక్షల పేపర్లు దిద్దే సమయంలో తప్పులు చేస్తే.. సదరు లెక్చరర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇంటర్ విద్యార్థులకు ఏదైనా సమస్య ఎదురైతే BIGRS వెబ్‌సైట్‌లో ఫిర్యాదు విధానం..
- మొదట www.bigrs.telangana.gov.in వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాలి.
- మొదట విద్యార్థి మొబైల్ నంబర్‌ను నమోదుచేయాలి.
- తర్వాత మొబైల్‌కు OTP వస్తుంది. ఓటీపీని నమోదు చేయాలి.
- తర్వాత జిల్లా, కాలేజీ, గ్రామం తదితర వివరాలు నమోదు చేయాలి.
- వెబ్‌సైట్‌లో చూపించే బాక్సులో ఫిర్యాదు వివరాలను టైప్‌చేసి SUBMIT చేయాలి.
- ఫిర్యాదు రకాన్ని బట్టి దాన్ని సంబంధిత అధికారులు పరిశీలిస్తారు.
- సమస్య పరిష్కారం చేయగానే, పని పూర్తయినట్లు ఫిర్యాదు సమయంలో ఇచ్చిన మొబైల్‌కు మెసేజ్ వెళ్తుంది.
Click Here
Click Here to file the Complaint