PAN-Aadhaar Linking Deadline is Extend to March 31, 2020
పాన్-ఆధార్ రెండింటినీ లింక్ చేయలేదా చేసుకోని వారికి ఇది శుభవార్త మార్చి 31 వరకు గడువు పొడిగింపు
పాన్ కార్డు-ఆధార్ కార్డు లింక్ చేసుకోని వారికి ఊరట! ఈ గడువును సీబీడీటీ పొడిగించింది. పాన్-ఆధార్ లింకింగ్‌ను ఇప్పటికే పలుమార్లు పొడిగించింది. ఇప్పుడు డిసెంబర్ 31, 2019 చివరి తేదీ కాగా, దీనిని మరో మూడు నెలల పాటు పొడిగించింది. ఈ ఏడాది (2020) మార్చి 31వ తేదీ వరకు దీనిని పొడిగించింది. పాన్-ఆధార్ అనుసంధానం ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కేంద్రం తప్పనిసరి చేసింది. ఇటీవల ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారికి తప్పనిసరి అయింది. డిసెంబర్ 31వ తేదీలోపు ఆధార్ అనుసంధానం చేయకపోతే పాన్ కార్డు చెల్లదని ఐటీ శాఖ తెలిపింది.
పాన్ - ఆధార్ లింకింగ్ తేదీని పొడిగిస్తూ ఆదాయపు పన్ను శాఖ సోమవారం రాత్రి ట్వీట్ చేసింది. ఆధార్ - పాన్ కార్డు అనుసంధానంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) గడువును పొడిగించడం ఇది ఎనిమిదోసారి.
ఆర్థిక శాఖ నోటిఫికేషన్ ప్రకారం.. పాన్ కలిగిన ప్రతి ఒక్కరూ ఆధార్ నెంబర్‌తో పాన్‌ను అనుసంధానం చేసుకోవాలి. ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో కచ్చితంగా ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఆధార్-పాన్ లింక్ చేసుకోవాలని భావించే వారు ఆదాయను పన్ను శాఖ వెబ్‌సైట్ లేదా ఎస్ఎంఎస్ రూపంలో రెండింటిని అనుసంధానం చేసుకోవచ్చు. పాన్, ఆధార్ అనుసంధానం సమయంలో రెండింటిలోనూ పేరు, పుట్టిన తేదీ, జెండర్ వంటి వివరాలు ఒకేలా ఉండేలా చూసుకోండి. ఒకవేళ వివరాలు వేర్వేరుగా ఉంటే పాన్ కార్డు లేదా ఆధార్ కార్డులో సమాచారాన్ని కరెక్ట్‌గా మార్చుకోండి.
The last date for the mandatory linking of the Permanent Account Number (PAN) with Aadhaar has been extended till March 2020 the CBDT said on Monday. The earlier deadline was Tuesday, December 31
The due date for linking of PAN with Aadhaar as specified under sub-section 2 of section 139AA of the Income-tax Act, 1961 has been extended from December 31, 2019 to March 31, 2020,” the department said on its official Twitter handle.
Click Here for