Friday, January 10, 2020

Modifications in SSC Public Examinations Grade and Evaluation Pattern of Examination System


Modifications in SSC Public Examinations Grade and Evaluation Pattern of Examination System

GOVERNMENT OF ANDHRA PRADESH
ABSTRACT

School Education – Examination reforms – Continuous and Comprehensive Evaluation pattern of examination system – Modifications in SSC Public Examinations w.e.f March2020 and onwards – Amendment - Orders – Issued.


AP SSC Exams: 'టెన్త్‌'లో పేపర్ల వారీగా గ్రేడ్లు.
AP SSC Exams Dates : పదోతరగతి పరీక్షల్లో ఎప్పటిలాగే హిందీ మినహా ప్రతి సబ్జెక్టులోనూ రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ల వారీగా 'గ్రేడింగ్' విధానాన్ని ఇవ్వనున్నారు.
సవరణ ఉత్తర్వులు జారీచేసిన పాఠశాల విద్యాశాఖ.
పెరిగిన పరీక్ష సమయం.


Modifications in SSC Public Examinations Grade and Evaluation Pattern of Examination System /2020/01/Modifications-in-SSC-Public-Examinations-Grade-and-Evaluation-Pattern-of-Examination-System.html


ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్షకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో భాగంగా ఇకపై పదోతరగతి మార్కుల మెమోలో పేపర్ల వారీగా 'గ్రేడ్' ఇవ్వనున్నారు. దీంతో పాటు.. రెండు పేపర్లకు కలిపి సబ్జెక్టు వారీగా మరో గ్రేడ్‌ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది.

పరీక్షల్లో మార్పులకు సంబంధించి విద్యాశాఖ జనవరి 9న సవరణ ఉత్తర్వులను విడుదల చేసింది. ప్రభుత్వ పరీక్షల విభాగం ఆధ్వర్యంలోనే ప్రశ్నపత్రాల రూపకల్సన జరగనుంది. పదోతరగతిలో అంతర్గత మార్కులు తొలగించినందున వంద మార్కులకు రాత పరీక్షలు నిర్వహించనున్నారు.





అదనపు సమయం..
పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు క్వశ్చన్ పేపర్ చదువుకునేందుకు వీలుగా అదనంగా 15 నిమిషాల సమయం ఇవ్వనున్నారు.దీంతో విద్యార్థులకు పరీక్ష సమయం 2.30 గంటల నుంచి 2.45 గంటలకు పెరిగింది.

ఫస్ట్ లాంగ్వేజ్(కంపోజిట్‌) పేపర్‌-1కు 3.15 గంటలు, పేపర్‌-2కు 1.45 గంటలు సమయం కేటాయించారు.
ఇక సెకండ్ లాంగ్వేజ్ హిందీకి 3.15 గంటల సమయం కేటాయించారు.


ఇంటర్నల్ మార్కుల్లేవ్..
పదోతరగతి విద్యార్థులకు ఇప్పటికే ఇంటర్నర్ మార్కులను తొలగిస్తున్నట్లు ఇప్పటికే విద్యాశాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ప్రతి సబ్జెక్టులోనూ 20 ఇంటర్నల్ మార్కులు ఉండేవి. 80 మార్కులకే ప్రశ్నపత్రం ఉండేది.. తాజాగా ఇంటర్నల్ మార్కులను ఎత్తివేయడంతో.. ఒక్కో సబ్జెక్టులో మొత్తం 100 మార్కులకూ రాతపరీక్షే నిర్వహించనున్నారు. ఎప్పటిలాగే హిందీ మినహా ప్రతి సబ్జెక్టులోనూ రెండు పేపర్లు ఉంటాయి. అదేవిధంగా విద్యార్థులు సమాధానాలు రాసేందుకు 18 పేజీల బుక్‌లెట్లను ఇవ్వనున్నారు. విడిగా అడిషనల్ షీట్లను ఇచ్చే విధానం ఇకపై ఉండదు.
కొత్త ప్రశ్నపత్రం ఇలా...
  1. ఎప్పటిలాగే పరీక్షలో మొత్తం 11 పేపర్లు ఉంటాయి. వీటిలో హిందీకి మాత్రం ఒక పేపరు, మిగతా సబ్జెక్టులకు రెండు పేపర్లు ఉంటాయి.
  2. ఒక్కో ప్రశ్నపత్రానికి 50 మార్కులు ఉంటాయి.
  3. పరీక్షల్లో బిట్‌ పేపర్‌ను ఎత్తివేయడంతో... దీనికి బదులుగా ప్రశ్నపత్రంలోనే ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇవ్వనున్నారు.
  4. మొత్తం నాలుగు విభాగాలుగా పదోతరగతి ప్రశ్నాపత్రం రూపకల్పన చేశారు. వీటిలో ప్రతి పేపరులోనూ 12 అర మార్కు ప్రశ్నలు (6 మార్కులు), 8 ఒకమార్కు ప్రశ్నలు (8 మార్కులు), 8 రెండు మార్కుల ప్రశ్నలు (16 మార్కులు), 5 నాలుగు మార్కుల ప్రశ్నలు (20 మార్కులు) ఇవ్వనున్నారు.
  5. ఇప్పటి వరకు రెండు పేపర్లలో కలిపి 35 మార్కులు వస్తే ఉత్తీర్ణులుగా ప్రకటించే వారు.. అయితే మారిన విధానం ప్రకారం రెండు పేపర్లలోనూ కచ్చితంగా ఉత్తీర్ణత సాధించాల్సిందే. ఒక్కో పేపరులో కనీసం 18 మార్కులు సాధిస్తేనే ఉత్తీర్ణులైనట్లుగా గుర్తిస్తారు.
Click Here for