Tuesday, January 7, 2020

IRCTC iMudra Wallet Assist In Quick Train Ticket Booking Know the Process



IRCTC iMudra Wallet Assist In Quick Train Ticket Booking Know the Process

ట్రైన్ టికెట్‌ను ఇలా ‘ఫాస్ట్‌’గా బుక్ చేసుకోండి.. చాలా సింపుల్!
ప్రధానాంశాలు:
ఐఆర్‌సీటీసీ నుంచి ఐముద్రా వాలెట్ సేవలు
ఐముద్రా ద్వారా ట్రైన్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు
అంతేకాకుండా ఆన్‌లైన్ షాపింగ్ కూడా చేయొచ్చు
ఫిజికల్ కార్డు కూడా పొందొచ్చు



IRCTC iMudra Wallet Assist In Quick Train Ticket Booking Know the Process /2020/01/IRCTC-iMudra-Wallet-Assist-In-Quick-Train-Ticket-Booking-Know-the-Process.html


రైల్వే టికెట్ బుకింగ్ చేసుకోవడం ఒత్తిడితో కూడుకున్న విషయం. పేమెంట్స్ చాలా టైమ్ తీసుకుంటాయి. మీ ఫోన్‌లో పేమెంట్ గేట్‌వే ఓపెన్ అయ్యేసరికి టికెట్లు అప్పటికే వేరొకరికి బుక్ అయిపోయి ఉండొచ్చు. టికెట్ బుకింగ్ ప్రత్యేకింగి తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో పేమెంట్ వేగంగా జరిగిపోతే టికెట్ కన్ఫార్మ్ అయ్యేందుకు ఛాన్స్‌లు ఎక్కువగా ఉంటాయి.ఇక్కడ ఐఆర్‌సీటీసీ ఐముద్రా పేమెంట్ వాలెట్‌తో టికెట్ బుకింగ్ పేమెంట్‌ను త్వరితగతిన జరపొచ్చు. ట్రైన్ టికెట్ బుకింగ్‌తోపాటు ఆన్‌లైన్ షాపింగ్ చేయొచ్చు. స్నేహితులకు, ఇతరులకు డబ్బులు కూడా పంపొచ్చు. ఈజీ ఓటీపీ ఫీచర్‌తో ట్రైన్ టికెట్లను సులభంగానే బుక్ చేసుుకోవచ్చు. కేవలం 4 స్టెపుల్లో పని పూర్తి చేయొచ్చు.

ఐముద్రా డిజిటల్ వాలెట్ కలిగినవారు వర్చువల్ లేదా ఫిజికల్ కార్డును పొందొచ్చు. దీంతో ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో షాపింగ్ చేయొచ్చు. ఐఆర్‌సీటీసీ ఐముద్రా వెబ్‌సైట్‌కు వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి. వర్చువల్ కార్డుకు రూ.10, ఫిజికల్ కార్డుకు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. మినిమమ్ కేవైసీ వెరిఫై కస్టమర్లకు వాలెట్ మంత్లీ లిమిట్ రూ.10,000గా ఉంటుంది. అదే ఫుల్ కేవైసీ కస్టమర్లకు మంత్లీ వాలెట్ లిమిట్ రూ1,00,000. ఫుల్ కేవైసీ కస్టమర్లు ఇతరుకు డబ్బులు కూడా పంపొచ్చు. ఏటీఎం నుంచి కార్డు ద్వారా డబ్బులు విత్‌డ్రా కూడా చేసుకోవచ్చు.




ఐముద్రా ఓటీపీ ఫీచర్‌తో ట్రైన్ టికెట్ బుకింగ్ ఇలా..
  1. ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి. 
  2. టికెట్ బుకింగ్‌ను ప్రారంభించాలి.
  3. పేమెంట్ ఆప్షన్‌లో ఐపే అని సెలెక్ట్ చేసుకోవాలి.
  4. తర్వాత ఐఆర్‌సీటీసీ ముద్రా ఎంచుకోవాలి. 
  5. మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి.
  6. ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేస్తే టికెట్ బుక్ అయిపోతుంది.
IRCTC iMudra Wallet Assist In Quick Train Ticket Booking: Know Process here.

How to use iMudra wallet of IRCTC for train booking: 

1. Book your ticket as usual on the IRCTC website or app 
2. Then for the payment option, select iPay. Now choose Mudra and key in your mobile number 3. Now you need to key in the OTP generated via iMudra and confirm your train ticket booking.

Click Here to download