Monday, December 16, 2019

మనం ముందు జాగ్రత్తతో అడుగులు వేయకపోతే ఫిబ్రవరి 2020 నెలలో మన జీతం ఐటీ కే సరిపోతుంది

Want to reduce your taxable income -  Get Details Here

మనం ముందు జాగ్రత్తతో అడుగులు వేయకపోతే ఫిబ్రవరి 2020 నెలలో మన జీతం ఐటీ కే సరిపోతుంది.
 *ముఖ్యంగా జీతం (GROSS) మొత్తం ఏడు లక్షల 50 వేల రూపాయలు లోపల ఉండి, సేవింగ్స్ మొత్తము 1,50,000 రూపాయలు ఉంటే ఎటువంటి టాక్స్ పడదు. వీరికి taxable income ఐదు లక్షల లోపు ఉంటుంది కాబట్టి Rs12,500 వరకు  రిబేట్  వస్తుంది..*


Want to reduce your taxable income - Get Details Here మనం ముందు జాగ్రత్తతో అడుగులు వేయకపోతే ఫిబ్రవరి 2020 నెలలో మన జీతం ఐటీ కే సరిపోతుంది./2019/12/how-to-reduce-your-taxable-income-income-tax-get-details-here.html

➧ *ఫిబ్రవరి 2019 నాటికి  ఎవరికైతే బేసిక్ పే Rs40,270 పైన ఉంటే ఇన్కమ్ టాక్స్  కంపల్సరీ కట్టవలెను. వీరికి  Net taxable income ఐదు లక్షల పైన  ఉంటుంది. కావున టాక్స్ మినహాయింపు ( రిబేట్) లేదు. వీరి జీతం(GROSS) మొత్తం Rs7,68,464 అగును. వీరికి టాక్స్ Rs14,260 కట్టవలెను. savings 1,50,000+50,000  standard deduction+ HRA"60,000  తగ్గించిన టాక్స్ ఇన్కమ్ 5,08,464 (aprox) వచ్చును.*
--------------------------------
 క్రింది విధంగా టాక్స్  లెక్క కట్టవచ్చును
 Up to Rs.250000----tax- nil

 250000-5lakhs---- 5%tax.......12,500

 8,464---- 20% tax....1,693

 Edu.cess( టాక్స్ పైన)4%....67

Total tax 14260
-------------------------------
మరి కొన్ని బేసిక్ PAY లు  వారి కట్టవలసిన ఇన్కమ్ టాక్స్ వివరాలు( షుమారు)
ఫిబ్రవరి 2019 నాటి BASIC PAY.........GROSS ...... TAX
➧39,160...7,47,29    - NO TAX

➧40,270...7,68,464  - 14,441

➧41,380...7,75,950  - 15,881

➧42,490...8,18,868  - 24,140

➧43,680...8,41,576  - 28,506

➧46,060...8,87,526  - 37,344

➧47,330...9,11,768  - 42,006

➧48,600...9,36,016  - 46,690

➧49,870...9,60,856  - 51,447

➧53,950...1039394  - 66,552

➧61,450...1183208  - 94,207

➧64,670..1245318  - 106153

➧77,030..1482694  - 169204 tax
Also Read
How to Download Financial Year Salary Statement Online - Know here
-------------------------------------

Net taxable income 5 lakhs లోపు ఉన్నవారికి రు.12500 tax rebate కలదు.
(ఇంతకు ముందు 2500 గా ఉండేది)
ఈ financial year లో housing loan తీసుకున్న వారికి  మాత్రమే:
ఈ"financial year లో  నూతనంగా ఇచ్చిన u/s 80EEA ప్రకారం
Housing loan interest amount ఈ financial year లో 3.5 lakhs వరకు చూయించవచ్చు.
ఇంతకు ముందు housing loan తీసుకున్న వారికి మాత్రం housing loan interest section 24 ప్రకారం 2 lakhs మాత్రమే.

Standard deduction Rs:50000/- (ఇంతకు ముందుRs:40000)
Bank వారు fixed deposit  etc.... Interest ను రు.10000/ దాటితే TDS cut చేసేవారు దానిని ఇపుడు రు.40000 దాటితేనే TDS cut చేస్తారు.
Cps వారికి 80C కింద 150000 పూర్తి అయితే ఇంకా 80CCD(1B) కింద additionalగా  Rs.50000 వరకు savings  చూయించవచ్చు. *కావున మీ savings ను సరి చూసుకోగలరు.
Tax పడే దానిని బట్టి Advance tax pay చేసుకోగలరు.

 తగ్గించుకుందాం పన్ను భారం:
ఆర్థిక ప్రణాళికలో ఆదాయపు పన్ను లెక్కలూ కీలకమే అందుకే, 
ఆదాయపు పన్ను చట్టం నిర్దేశించిన పరిమితికి మించి ఆదాయం ఉన్నప్పుడు పన్ను చెల్లించక తప్పదు. ఈ భారం తగ్గించుకునేందుకూ చట్ట ప్రకారం కొన్ని మార్గాలున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఎంత పన్ను చెల్లించాలనేది ఒక స్పష్టత వచ్చి ఉంటుంది ఈ నేపథ్యంలో చివరి నిమిషం వరకూ ఆగకుండా. ఇప్పటి నుంచే పన్ను ప్రణాళికలో భాగంగా ఏం చేయాలన్నది తెలుసుకోవాలి.

ఆర్టిక సంవత్సరం ముగియడానికి మరో మూడున్నర నెలల సమయం ఉంది. ఆర్థిక సంవత్సరం ముందు నుంచే దీనిపై ఆప్రమత్తంగా ఉండాలి, ఎంత పెట్టుబడి పెట్టాలన్నది తెలుసుకొని, దాన్ని నెలవారీగావిభజించి మదుపు చేస్తే.. ఒకేసారి పెద్ద మొత్తంలో మదుపు చేయాల్సిన ఆవసరం తప్పుతుంది.  ఇప్పుడు పన్ను ప్రణాళికల గురించి ఆలోచించకుండా.. మార్చి 31న పెట్టుబడులు పెట్టాలని ప్రయత్నిస్తే.. సరైన నిర్ణయం తీసుకోలేకపోవచ్చు. కాబట్టి, ఇప్పటి నుంచి ఏం చేయాలన్నది పరిశీలిద్దాం.

2019-20 ఆర్థిక సంవత్సరం కి ఆదాయపన్ను  శ్లాబులు
1.రు.  2,50,000/-  వరకు పన్ను లేదు
2.రు. 2,50,000/- నుండి రు 3,00,000/- వరుకు  5 శాతం
3. రు 3,00,000/- నుండి రు 5,00,000/- వరకు  రు 2,500+5 శాతం
4.రు 5,00,000/- నుండి  రు 10,00,000/- వరకు  రు 12,500 +20  శాతం
5. రు 10,00,000/-లకు పైన రు 1,10,000+30 శాతం

ఎంత చెల్లించాలి.....

ఆర్థిక సంవత్సరంలో చివరి త్రైమాసికం మరో పది హేనురోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే మీరు ఎంత పన్ను చెల్లించాల్సి వస్తుందనేది మీ సంస్థ ఆకౌంట్స్ విభాగం చెప్పి ఉంటుంది. ఇక మీరు చేయాల్సింది... ఏ పథకంలో ఎంత మేరకు మదుపు చేయాలన్నది నిర్ణయించుకోవడమే. సాధ్యమైనంత వరకూ పన్ను మొత్తం ఎలా తగ్గుతుందన్నది చూసుకోవాలి, అరోగ్య బీమా లేకపోతే.. తీసుకోండి. సెక్షన్ 80సీ పరిమితి ఇంకా పూర్తికాపోతే.. పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, యులీప్ లు వంటివి పరిశీలించవచ్చు. ఈ రెండు పరిమితులు పూర్తయితే సెకషన్ 80సీసీడీ కింద రూ,50,000 వరకూ పన్ను మినహాయింపు పొందేందుకు జాతీయ పింఛను పథకాన్ని ఎంచుకోవచ్చు.


లెక్కలు తీయండి....

ముందే చెప్పినట్లు. పన్ను భారం తగ్గించుకునే చివరి దశలోఉన్నాం. అదే సమయంలో అందుబాటులో ఉన్న సెక్షన్లను పూర్తిగా వినియోగించుకునే ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద రూ.1,50,000 వరకూ పొదుపు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇందులో ఈపీఎఫ్, జీవిత బీమా పాలసీలు, ఈఎల్ఎస్ఎస్. ఇంటి రుణం అసలు చెల్లింపు, పిల్లల ట్యూషన్ఫీ జులు, జాతీయ పొదుపు పత్రాలు... పీపీఎఫ్ ఉంటాయి. ఒకసారి ఈ పరిమితి పూర్తిగా నిండిందా లేదా చూసుకోండి. మీటికి సంబంధించిన వివరాల కోసం మీ సంస్థలో సంప్రదించండి. ఇందులో పరిమితి పూర్తిగా నిండకపోతే.. సంబంధిత పథకాల్లో మీ ఆర్థిక ప్రణాళికకు సరిపోయే వాటిని ఎంచుకోండి. ఆరోగ్య బీమా పాలసీకి చెల్లించిన ప్రీమియానికి సెక్షన్ 80డీ ప్రకారం మినహాయింపు లభిస్తుంది. తల్లిదండ్రుల పేరుమీద పాలసీ తీసుకున్నా ఈ మినహాయింపు లబిస్తుంది. ఒకవేళ మీరు మీతల్లిదండ్రుల పేరు మీద పాలసీ తీసుకోలేదనుకుందాం. అప్పుడు వారి కోసం చేసిన వైద్య చికిత్స ఖర్చులను ఈ సెక్షన్ కింద క్లెయిం చేసు కునే వెసులుబాటు ఉంది. ఇక్కడ మనం గమనించాల్సినవిషయం ఏమిటంటే. పన్ను బారం తగ్గించుకునేందుకు అవకాశం ఉన్న ప్రతి వెసులుబాటునూ పూర్తిగా వినియోగించుకోవాలి, అదే మన లక్ష్యం కావాలి.

పత్రాలు సిద్ధంగా....

స్థిరాస్తి లావాదేవీలూ నిర్వహించినా దానికి సంబంధించిన ఆధారాలు ఉంచుకోవాలి. పెట్టుబడులు పెట్టడమే కాదు.. వాటికి సంబంధించిన అన్ని ఆధారాలూ జాగ్రత్తగా ఉంచుకోవాలి, వాటిని మీ యాజమాన్యానికి గడువులోపు అందించాలి. లేకపోతే మీరు పెట్టుబడులు పెట్టినా ఉపయోగం ఉండకపోవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మీరు పెద్ద ఎత్తున బంగారం కొన్నా.  మ్యూచువల్ ఫండ్లు, షేర్లలో పెట్టుబడులు పెట్టి, లాభాలు ఆర్జించినప్పుడు ఆ లెక్కలను తెలియజేయాలి. స్వల్పకాలిక, దీర్ఘకాలిక లాభనష్టాల గురించిన వివరాలు అందుబాటులో పెట్టుకోవాలి. ఈ ఆర్థికసంవత్సరంలో ఉద్యోగం మారితే.. పాత యాజమాన్యం నుంచి ఫారం -16 తీసుకోవాలి. దీని ఆధారంగా ఉమ్మడి ఫారం-16 ఇవ్వాల్సిందిగా కొత్త యాజమాన్యాన్ని కోరవచ్చు.

వడ్డీ చెల్లించండి....

ఈ ఆర్థిక సంవత్సరంలో విద్యా రుణం తీసుకున్నారా? దానికి వడ్డీ చెల్లించలేదా? అలస్యం చేయకండి. దానికి సంబంధించిన వడ్డీని వెంటనే చెల్లించేయండి. ఇలా చెల్లించిన మొత్తానికి సెక్షన్ 80ఈ కింద మినహాయింపు వర్తిస్తుంది. ఇంటి రుణం తీసుకున్నప్పుడు, దానికి చెల్లించే వడ్డీరూ.2,00,000 వరకూ మినహాయింపు లభిస్తుంది.

ఈక్విటీలను అమ్మితే....

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మీ మూలధన లాభం రూ.లక్ష దాటుతుందని అనుకుంటే... రూ.లక్షకు చేరే లోపే వాటిని విక్రయించండి ,మర్నాడు అవే షేర్లు/ఈక్విటీ ఫండ్లనుకొనుగోలు చేయండి. దీనివల్ల 10శాతం ఎల్ టీసీజీ పన్ను పడకుండా చూసుకోవచ్చు.ఒక ఆర్ధిక సంవత్సరంలో ఈక్విటీ పెట్టుబడుల ద్వారా రూ.1,00,000కు మించి లాభం సంపాదించినప్పుడు దీర్ఘకాలిక మూలధన రాబడి పన్ను (ఎల్టీసీజీ) చెల్లించాల్సి ఉంటుంది. లాభం రూ.లక్షకు మించినప్పుడు.. ఆపై మొత్తం పై ఈ పన్ను 10శాతం ఉంటుంది. 

లక్ష్యం మర్చిపోవద్దు....

అశించిన పనితీరు చూపించని పథకాల్లో మార్పులు, చేర్పులు చేసేందుకు మొహమాటపడొద్దు.పన్ను తగ్గించుకునే క్రమంలో మనకు అనువుగాని పెట్టుబడి పథకాలను ఎంచుకోవడం మంచిది కాదు. పన్ను ఆదాతోపాటు.. మన ఆర్థిక లక్ష్యాలను సాధించేలా మన పెట్టుబడులు ఉండాలి, 2019తో పోలిస్తే.. 2020లో ఆర్థిక పరంగా ఎన్నో మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. ఈ ధోరణికి తగ్గట్టూ పథకాల ఎంపిక ఉండాలి. ఇప్పటికే మీరు చేసిన పొదుపు, మదుపులను సమీక్షించుకోండి. మీరు అనుకున్న విధంగానే వాటి పనితీరు ఉందా లేదా చూసుకోండి.