Tuesday, December 24, 2019

అమెరికాలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం- Apply for International Teachers Placements


అమెరికాలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం- Apply for International Teachers Placements


      అమెరికాలోని పాఠశాలల్లో గణితం, సైన్స్‌ సబ్జెక్టులు బోధించేందుకు నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ నాన్‌రెసిడెంట్‌ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టీ) అధ్యక్షుడు మేడపాటి వెంకట్‌ తెలిపారు. 50 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అక్లెమ్‌ గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ ఇండియా ఆధ్వర్యంలో టెక్సాస్‌లోని పలు పాఠశాలల్లో బోధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎంపికైన ఉపాధ్యాయులు మూడేళ్ల గడువు కలిగిన జే1 వీసా పొందుతారని, మరో రెండేళ్లు పొడిగించేందుకు అవకాశం ఉందని వివరించారు. బీఈడీ/ఎంఈడీ చదివి, ఐదేళ్లకు పైగా బోధన అనుభవం ఉండాలన్నారు. వీసా పొందేందుకు టోఫెల్‌ పరీక్ష ఉత్తీర్ణులు కావాలన్నారు. అర్హత కలిగినవారు https://dev.apnrts.ap.gov.in/home/teacherjobs  వెబ్‌సైట్‌లో జనవరి 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.




APNRTS in association with Acclaim Global Education India Pvt Ltd (AGE), a subsidiary of Star Tech Group, USA (STG) is extremely pleased to announce successful identification and placement of 26 world class teachers of Andhra Pradesh in the month of August 2019 at Ector County Independent School District and Kermit Independent School District with a strength of 32,000 students located in Texas, USA.
In the second phase, Acclaim Global Education India Pvt Ltd (AGE), a subsidiary of Star Tech Group, USA (STG) approached APNRTS with a requirement of 50 teachers experienced in Mathematics and Science to be placed at Ector County Independent School District and Kermit Independent School District. Interested Candidates can register below.

For more information please contact: 91 863 2340678, 8500027678


Click Here to Apply Online