Monday, December 2, 2019

TSRTC Hiked Bus Fare to be effective from 02.12.2019


TSRTC Hiked Bus Fare to be effective from 02.12.2019


Telangana State Road Transport Corporation (TSRTC) as the state government on Thursday decided to take back all striking employees but announced hike in bus charges to mobilise an additional Rs 750 crore annually.After the state cabinet meeting was held on Thursday night Chief Minister K. Chandrashekhar Rao told reporters  that the government has decided to increase the bus tariff by 20 
paise per km to generate additional income to cut down the losses of state-owned transport body. The new tariff will come into effect from Monday.

The CM has also announced that the government will immediately release Rs 100 crore to the TSRTC as it wants to save the Corporation and strengthen it.The decision came three days after the employees decided to call off the strike. The TSRTC management had refused to take them back till the Labour Commissioner takes a decision on legality of the strike as directed by the Telangana High 
Court.




TSRTC Hiked Bus Fare to be effective from 02.12.2019 /2019/12/TSRTC-Hiked-Bus-Fare-to-be-effective-from-02.12.2019.html


తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పడిన తర్వాత రెండోసారి బస్సు ఛార్జీలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ కార్మికులను శుక్రవారం నుంచి విధుల్లో చేరాల్సిందిగా కోరుతూ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. ప్రస్తుతం టిఎస్ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉన్నందున ఆర్టీసీ ఛార్జీలు పెంచితే కానీ సంస్థ మనుగడ కష్టం అని చెప్పి ప్రయాణికులకు షాక్ ఇచ్చారు. కిలోమీటర్‌కి 20 పైసలు చొప్పున ఛార్జీలు పెంచుతున్నట్టు సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. దీంతో ఇకపై ప్రతీ 5 కిమీ రూ.1 చొప్పున, అలాగే ప్రతీ 100 కిమీ దూరం ప్రయాణానికి సుమారు రూ20 చొప్పున ఛార్జీల ధరలు పెరగనున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేవలం ఒక్కసారే బస్సు ఛార్జీలు పెరిగాయి. 2016 జూన్‌లో 8.77% మేర ఛార్జీలు పెంచుతూ అప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ మూడేళ్లకు ఆర్టీసీ ఛార్జీలు పెరగడం ఇదే తొలిసారి. టీఎస్ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె కారణంగా చార్జీలను పెంచనున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి విదితమే. ఇక ఈ చార్జీల పెంపు.. సోమవారం అర్ధరాత్రి అనగా డిసెంబర్ 3వ తేదీ నుంచి అమలు కానుంది. కిలోమీటర్‌కు 20 పైసల చొప్పున చార్జీలు పెంచుతూ ఆర్టీసీ అధికారులు పూర్తి నివేదికను కేసీఆర్‌కు అందజేసినట్లు తెలుస్తోంది. అంతేకాక కనీస చార్జీల విషయంలో కూడా కసరత్తులు చేశారని.. ఆర్డినరీ బస్సుల్లో కూడా సాధారణ చార్జీ పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు మాత్రం కిలోమీటర్‌ ఆధారంగా వసూలు చేయనున్నట్లు సమాచారం.

బస్సులు వారీగా ప్రస్తుత చార్జీలు ఇలా ఉన్నాయి…

 *పల్లె వెలుగు కనీస చార్జీ రూ.5 నుంచి రూ.10కు పెంపు
 *సెమీ ఎక్స్‌ప్రెస్‌ కనీస చార్జీ రూ.10గా నిర్దారించిన అధికారులు
 *ఎక్స్‌ప్రెస్‌ కనీస చార్జీ రూ.10 నుంచి రూ.15కి పెంపు
 *డీలక్స్‌ కనీస చార్జీ రూ.15 నుంచి రూ.20కి పెంపు
 *సూపర్‌ లగ్జరీ కనీస చార్జీ రూ.25
 *రాజధాని, వజ్ర బస్సుల్లో కనీస చార్జీ రూ.35
 *గరుడ ఏసీ లో కనీస చార్జీ రూ.35 గరుడ ప్లస్ ఏసీలో కనీస చార్జీ రూ.35
 *వెన్నెల ఏసీ స్లీపర్ లో కనీస చార్జీ రూ.75
 *ఎక్స్‌ప్రెస్ – 87 పైసలు
 *డీలక్స్ – 98 పైసలు
 *సూపర్ లగ్జరీ – 1.16 పైసలు
 *రాజధానికి – 1.46 పైసలు
 *గరుడకు – 1.71 పైసలు
 *గరుడ ప్లస్ – 1.82 పైసలు
వెన్నెల సర్వీసు – 2.53 పైసలు చొప్పున ప్రస్తుతం చార్జీలు ఉండగా.. ఇప్పుడు వీటికి కిలోమీటర్ చొప్పున 20 పైసలు కలుపుతారు. ఉదాహరణకు హైదరాబాద్- కరీంనగర్ మధ్య 160 కిలోమీటర్లు దూరం కాగా.. దీని బట్టి కొత్త చార్జీ రూ.172 వరకు పెరుగుతుంది. ఇలా పెరిగిన చార్జీలన్నింటిని అధికారులు టికెట్ మిషన్స్‌లో ఫిక్స్ చేస్తున్నారు. అటు సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఇకపై కనీస టికెట్ ధర రూ.10గా చేయాలని నిర్ణయించగా.. పల్లెవెలుగు బస్సుల్లో ఆ రేట్.. రూ.8గా ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ కొత్త రేట్ల వివరాన్నింటిని సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన గ్రీన్ సిగ్నల్ కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. కాగా, కొత్తగా పెరగనున్న చార్జీలు ద్వారా ఆర్టీసీకి అదనంగా రూ. 752 కోట్లు రాబడి రానున్నట్లు తెలుస్తోంది.


Click Down for