Are you Not Receiving any SMS Alerts to your Mobile from SBI for any transactions. Follow the below given Procedure to know your bank transactions.
No SMS Alerts from SBI to your Mobile for any transaction. Follow this procedure.
SBI SMS Alerts: ఎస్‌బీఐ నుంచి ఎస్ఎంఎస్ అలర్ట్స్ రావట్లేదా? ఇలా చేయండి.
ఇటీవల కాలంలో ఆర్థిక మోసాలు ఎక్కువైపోయాయి. కార్డు మోసాలు పెరిగిపోతున్నాయి. ఏటీఎం కార్డు మీ జేబులో ఉన్నా ఎక్కడో లావాదేవీలు జరిగిపోతుంటాయి. తర్వాత ఎప్పుడో స్టేట్‌మెంట్ చూస్తే తప్ప అసలు విషయం బయటపడదు. ఇలాంటి మోసాలను వెంటనే గుర్తించడానికి ఉపయోగపడేది ఎస్ఎంఎస్ అలర్ట్. మీ అకౌంట్‌పై జరిగే ప్రతీ లావాదేవీకి ఎస్ఎంఎస్ అలర్ట్స్ పంపిస్తుంటాయి బ్యాంకులు. చాలామంది వీటి గురించి పెద్దగా పట్టించుకోరు. ఫోన్ నెంబర్ మార్చినప్పుడు బ్యాంకులో అప్‌డేట్ చేయరు. దీంతో ఎస్ఎంఎస్ అలర్ట్స్ అందుకోలేరు. మీ అకౌంట్‌లో జరిగే లావాదేవీల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఎస్ఎంఎస్ అలర్ట్స్‌కు రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి.బ్యాంకులో మొబైల్ నెంబర్‌ను రిజిస్టర్ చేస్తే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌కి ఓటీపీలు పొందడం కూడా సులువే.ఏదైనా అనధికార లావాదేవీలు జరిగితే వెంటనే మెసేజ్ వస్తుంది కాబట్టి అప్రమత్తం కావచ్చు.
మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు ఎస్ఎంఎస్ అలర్ట్స్‌కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోండి.
- ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయండి.
- హోమ్ పేజీలో SMS Alerts లింక్ పైన క్లిక్ చేయండి.
- మీ సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్ల జాబితా కనిపిస్తుంది.
- అందులో మీరు ఎస్ఎంఎస్ అలర్ట్స్ పొందాలనుకునే అకౌంట్‌ను క్లిక్ చేయండి. ఎలాంటి అలర్ట్స్ పొందాలనుకుంటున్నారో సెలెక్ట్ చేయండి.
- మీరు ఎస్ఎంఎస్ అలర్ట్స్ కోసం రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ లావాదేవీలపై అలర్ట్స్ వస్తాయి.
- ఆన్‌లైన్‌లో కాకుండా మీరు బ్రాంచ్‌కు వెళ్లి కూడా ఎస్ఎంఎస్ అలర్ట్స్‌కి రిజిస్టర్ చేసుకోవచ్చు.
- మీరు ఎస్ఎంఎస్ అలర్ట్స్‌కి రిజిస్టర్ చేసుకోవడం మాత్రమే కాదు... మీరు పొందాల్సిన అలర్ట్స్‌ని మార్చుకోవచ్చు. అప్‌డేట్ చేయొచ్చు. మీరు ఎస్ఎంఎస్ అలర్ట్స్‌కి రిజిస్టర్ చేసుకుంటే ఈ కింది అంశాలకు అలర్ట్స్ పొందొచ్చు.
- Hold on account balance: అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్‌ని హోల్డ్ చేయొచ్చు.
- Pos Transaction: పీఓఎస్ ట్రాన్సాక్షన్ అలర్ట్ అంటే ఎక్కడైనా పాయింట్ ఆఫ్ సేల్స్‌లో మీ డెబిట్ కార్డును స్వైప్ చేస్తే అలర్ట్ వస్తుంది.
- Cheque Stop alert: మీరు ఎవరికైనా ఇచ్చిన చెక్‌ను నిలిపివేయొచ్చు.
- Cheque dishonor alert: ఇన్‌వార్డ్ లేదా ఔట్‌వార్డ్ క్లియరింగ్ నిలిపివేయొచ్చు.
- Cheque book: కొత్త చెక్ బుక్ కోసం దరఖాస్తు చేస్తే అలర్ట్ పొందొచ్చు.