APSRTC Bus Fare Hike Will Come into Effect from Tomorrow
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపునకు ముహూర్తం ఖరారైంది. బుధవారం నుంచి బస్సు ఛార్జీలు పెంచనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. బస్సు ఛార్జీలు పెంచే విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆమోదముద్ర తెలిపినట్టు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ‘‘పల్లెవెలుగు బస్సుల్లో కిలోమీటరకు 10పైసలు పెంపు. పల్లె వెలుగు బస్సుల్లో మొదటి రెండు స్టేజీలు లేదా 10 కిలోమీటర్ల వరకు ఛార్జీల పెంపు లేదు. సిటీ, ఆర్డినరీ బస్సుల్లో 11 స్టేజీల వరకు ఛార్జీల పెంపులేదు. ఎక్స్‌ప్రెస్, ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులకు కి.మీ.కు 20 పైసలు పెంపు. ఇంద్ర ఏసీ, గరుడ, అమరావతి బస్సుల్లో కి.మీ.కు 10 పైసలు చొప్పున పెంపు. వెన్నెల, స్లీపర్ బస్సుల్లో ఛార్జీలపెంపు లేదు’’ అని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. పెంచిన ఛార్జీలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. డీజిల్ ధర పెంపు వల్ల సంస్థపై ఏటా రూ.630 కోట్ల అదనపు భారం పడుతోందని, విడిభాగాలు, సిబ్బంది జీతభత్యాల వల్ల ఏటా మరో రూ.650 కోట్ల భారం పడుతోందని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. డీజిల్ ధర నాలుగేళ్లలో రూ.49 నుంచి రూ.70కి చేరిందని వెల్లడించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయంపై ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్ని నాని తెలిపారు.
APSRTC has decided in this regard. Bus fares in AP will go into effect from tomorrow. APSRTC has decided in this regard. APSRTC has decided to increase the rate of 10 paise per km in rural light buses while 20 paise per kilometre in other services.
The Andhra Pradesh Transport minister Perni Venkataramaiah (Nani) told media on Saturday that the date when the new fares would come into effect would be announced on Monday. The state government has decided to hike the fares of Palle Velugu and city service buses by 10 paise per kilometre and by 20 paise for other categories.
"The government has decided to enhance the fares with the sole objective of bringing the corporation out of losses. The fare hike became inevitable as the diesel price has been steadily rising since 2015 to reach Rs 70 per litre now," said Nani.
Bus fares across Andhra Pradesh are set to rise with the Andhra Pradesh State Road Transport Corporation announcing a marginal hike in fares on Saturday across all bus categories. The state government has also announced that 240 new buses will be added to the fleet by March 2020.