Saturday, November 23, 2019

HOW TO TRANSFER SBI ACCOUNT TO OTHER BRANCH IN ONLINE

HOW TO TRANSFER SBI ACCOUNT TO OTHER BRANCH IN ONLINE
SBI Bank has good news for its customers. No need to roam around the bank anymore to change the branch. All you have to do is go to the bank's website and fill in the relevant details. In a few days your account will be transferred to the desired branch. SBI has made this facility available for people to stay at home and avail banking services while Covid is being extracted.
ఖాతాను వేరే బ్రాంచ్‌కి బ‌దిలీ చేయాలా..
మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఖాతాదారులా? మీ ఖాతాను వేరే బ్రాంచ్‌కి బదిలీ చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు బ్యాంకుకు వెళ్ళ‌కుండానే, ఆన్‌లైన్ ద్వారా ఒక శాఖ నుంచి మ‌రొక శాఖ‌కు ఖాతాను బ‌దిలీ చేసుకునే స‌దుపాయాన్ని క‌ల్పిస్తున్న‌ట్లు ఎస్‌బీఐ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. కరోనా నేప‌థ్యంలో, కాంటాక్ట్ లెస్ డిజిట‌ల్ సేవ‌ల‌కు బ్యాంకు ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని ఇందులో భాగంగానే ఈ సేవ‌ల‌ను అందిస్తున్న‌ట్లు అధికార వ‌ర్గాలు వెల్ల‌డించాయి.
ఎస్‌బీఐ ఖాతాదారులు ప్ర‌స్తుతం ఉన్న ఖాతాను మ‌రొక శాఖ‌కు బ‌దిలీ చేయాల‌నుకుంటే బ్యాంకు మీకు స‌హాయ‌ప‌డుతుంది. యోనో ఎస్‌బీఐ, యోనో లైట్‌, ఆన్‌లైన్ ఎస్‌బీఐ ద్వారా ఇంటి వ‌ద్ద నుంచి సౌక‌ర్య‌వంతంగా , సుర‌క్షితంగా బ్యాంకింగ్ లావాదేవీల చేయ‌వ‌చ్చ‌ని ఎస్‌బీఐ ట్వీట్ చేసింది.

ఆన్‌లైన్‌లోనే బ్రాంచ్ మార్చుకునే సేవలు
  1. స్టేట్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ https://www.onlinesbi.com కు వెళ్లండి పర్సనల్ బ్యాంకింగ్ ఎంచుకోండి.
  2. మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అవ్వండి.
  3. ఇప్పుడు టాప్ మెనూ బార్‌లోని ఇ-సర్వీసెస్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
  4. మీకు ట్రాన్స్‌ఫర్ ఆఫ్ సేవింగ్స్ అకౌంట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ట్రాన్స్‌ఫర్ చేయాలని భావించే అకౌంట్‌ను ఎంచుకోవాలి. మీకు ఒక అకౌంట్ ఉంటే అదే డిఫాల్ట్‌గా సెలెక్ట్ అవుతుంది.
  5. ఇప్పుడు మీరు అకౌంట్‌ను ఎక్కడికైతే ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బ్రాంచ్ కోడ్ ఎంటర్ చేయాలి.
  6. సబ్‌మిట్ చేయాలి.
  7. మీ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ వివరాలను మరోసారి చెక్ చేసుకోవాలి.
  8. ఓకే అనుకుంటే కన్ఫర్మ్‌పై క్లిక్ చేయాలి.
  9. ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
  10. దీన్ని ఎంటర్ చేసి ఓకే చేయాలి.
  11. మీకు ఒక పాపప్ మెసేజ్ వస్తుంది. ఇందులో మీ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ రిక్వెస్ట్ సక్సెస్‌ఫుల్‌గా రిజిస్టర్ అయ్యిందని ఉంటుంది.
  12. బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ కేవైసీ నిబంధనలకు అనుగుణంగా ఉండి, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటేనే ఆన్‌లైన్‌లో బ్యాంక్ అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకోగలరు.
ఆన్‌లైన్ ఎస్‌బీఐ ద్వారా మాత్ర‌మే కాకుండా యోనో ఎస్‌బీఐ, యోనో లైట్ ద్వారా కూడా ఖాతాల‌ను బ‌దిలీ చేసుకోవ‌చ్చు. ఇక్క‌డ గుర్తుంచుకోవాల్సిన విష‌యం ఏంటంటే.. మీ బ్యాంకు వ‌ద్ద మొబైల్ నెంబ‌రు రిజిస్ట‌ర్ చేసుకున్న‌ప్పుడు మాత్ర‌మే ఆన్‌లైన్ ద్వారా ఈ సేవ‌ల‌ను పొంద‌గ‌లుగుతారు.

కోవిడ్‌-19 కార‌ణంగా చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్ విధిస్తున్నాయి. దీంతో ప్ర‌జ‌లు బ్యాంకుకు వ‌చ్చే వీలులేదు. అలాగే ప్ర‌జ‌ల భ‌ద్ర‌త దృష్ట్యా కూడా డిజిట‌ల్ మార్గాల ద్వారా వివిధ ర‌కాల‌ను సేవ‌ల‌ను ఎస్‌బీఐ అందిస్తుంది. కేవైసీ అప్‌డేట్‌ను కూడా ఆన్‌లైన్ ద్వారానే నిర్వ‌హించేందుకు వీలుక‌ల్పిస్తున్న‌ట్లు కొద్ది రోజుల క్రిత‌మే ఎస్‌బీఐ ప్ర‌క‌టించింది. ఆన్‌లైన్ ద్వారా కేవైసీని అప్‌డేట్ చేయాల‌నుకునే వారు ఇ-మెయిల్ ద్వారా గానీ పోస్ట్ ద్వారా గానీ అవ‌స‌ర‌మైన ప‌త్రాల‌ను బ్యాంకుకు పంపిచాల్సి ఉంటుంది. కేవైసీ కార‌ణంగా ఖాతాల తాత్కాలిక నిలుపుద‌ల‌ను అడ్డుకునేందుకు మే31,2021 లోపుగా అప్‌డేట్ చేయాల‌ని బ్యాంకు ఖాతాదారుల‌ను కోరింది.
HOW TO TRANSFER SBI ACCOUNT TO OTHER BRANCH IN ONLINE  Watch Video Here