Wednesday, September 18, 2019

DR YSR Kantivelugu To Be Launched On October 10



DR YSR KANTI VELUGU programme to be launched on October 10

The State government will launch Dr YSR Kantivelugu, a mass eye screening programme, across the State on October 10.

Dr.YSR Kanti velugu programme-Phase 1 Eye Screening of School Children- instructions Rc.365 dated 18.09.2019.

ప్రతీ ఒక్కరికీ మంచి కంటిచూపు ఉండాలనే ఉద్దేశంతో వైయస్ఆర్ కంటి 'వెలుగు వైఎస్సార్ కంటి వెలుగు' పథకానికి జగన్ శ్రీకారం చుట్టారు. అక్టోబర్ 10 నుంచి రాష్ట్రంలోని ప్రజలకు నేత్ర నిపుణులు కంటి పరీక్షలు నిర్వహించనున్నారు.
తెలంగాణ ప్రజలకు కంటి చూపు సమస్యలు లేకుండా చేయడమే లక్ష్యంగా గత ఏడాది సీఎం కేసీఆర్ కంటి వెలుగు పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద రాష్ట్రంలోని ప్రజలందరికీ ప్రభుత్వమే ఉచితంగా కంటి పరీక్షలు చేసి కళ్లద్దాలు పంపిణీ చేసింది. అవసరమైన వారికి శస్త్రచికిత్స కూడా చేశారు. రాష్ట్రంలో లక్షలాది మంది కంటి పరీక్షలు చేయించుకొని కళ్లద్దాలు వాడుతున్నారు. ఐతే ఏపీలోనూ ఈ కంటి వెలుగు పథకాన్నితీసుకొస్తున్నారు సీఎం జగన్.ప్రతీ ఒక్కరికీ మంచి కంటిచూపు ఉండాలనే ఉద్దేశంతో వైయస్ఆర్ కంటి 'వెలుగు వైఎస్సార్ కంటి వెలుగు' పథకానికి జగన్ శ్రీకారం చుట్టారు. అక్టోబర్ 10 నుంచి రాష్ట్రంలోని ప్రజలకు నేత్ర నిపుణులు కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి గ్రామంలోనూ ప్రత్యేక శిబిరాలను ఏర్పాటుచేసి ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహిస్తారు. దృష్టి లోపం ఉన్న వారికి కళ్లద్దాలను అందజేయడమే గాక..అవసరమైన వారికి ప్రభుత్వమే ఆపరేషన్లను చేయిస్తుంది.



The State government will launch Dr YSR Kantivelugu, a mass eye screening programme, across the State on October 10. /2019/09/YSR-Kantivelugu-to-be-launched-on-October-10.html


రాష్ట్రంలోని 5.3 కోట్ల మంది ప్రజలకు ఆరు విడతలుగా వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమం కింద కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఎం వైఎస్‌  జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. మూడేళ్ల కాలంలో మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ కంటికి సంబంధించిన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రూ.560 కోట్లతో వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమం చేపట్టనున్నామని.. స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్‌ శస్త్ర చికిత్స, ఇతరత్రా అవసరమైన పరీక్షలన్నీ ఈ పథకం కింద జరుగుతాయని చెప్పారు. ‘స్పందన’ కార్యక్రమంపై మంగళవారం ఆయన సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమం కోసం చేసిన ఏర్పాట్లపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. అక్టోబరు 10 నుంచి 16 వరకు తొలి దశలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని 70 లక్షల మందికి పైగా విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తామని, రెండో విడతలో నవంబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు అవసరమైన విద్యార్థులకు శస్త్రచికిత్సలు చేయిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మూడు, నాలుగు, ఐదు, ఆరు విడతల్లో మిగిలిన ప్రజలందరికీ దశల వారీగా కంటి పరీక్షలు, చికిత్సలు అందిస్తామని స్పష్టం చేశారు. జిల్లాల్లో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేసి పటిష్టంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని సీఎం సూచించారు. మొదటి స్క్రీనింగ్‌లో చికిత్స అవసరమున్న విద్యార్థులను గుర్తించి ఆ మేరకు వారికి తదుపరి చికిత్స అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించామని చెప్పారు. 


రక్తహీనతను అధిగమించాల్సిందే 

పౌష్టికాహార లోపం, రక్తహీనతతో బాధపడుతున్న మహిళలకు రోజుకు రూ.43, చిన్నారులకైతే రూ.18 ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా పౌష్టికాహార లోపం, రక్తహీనతను అధిగమించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్లు, అంగన్‌వాడీ కేంద్రాలను సమర్థవంతంగా వినియోగించుకోగలిగితే ఈ సమస్యను అధిగమించవచ్చన్న విశ్వాసం ఉందని సీఎం పేర్కొన్నారు. వలంటీర్లు ప్రతి ఇంటినీ సర్వే చేసి, పిల్లలను, తల్లులను, మహిళలను అంగన్‌వాడీ కేంద్రాల దగ్గరకు వెళ్లేలా మోటివేట్‌ చేయించి, అక్కడ వారికి పరీక్షలు నిర్వహించాలని సూచించారు.





రక్తహీనత పరీక్షలు నిర్వహించాక వారి ఆరోగ్య కార్డులో వివరాలు పొందుపరిచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. పర్యవేక్షణ బాధ్యతను వలంటీర్లకు అప్పగించాలన్నారు. అంగన్‌వాడీల ద్వారా ఏమేమి ఇవ్వబోతున్నామో వలంటీర్లకు సమాచారం ఇచ్చి, ఆ మేరకు అవన్నీ కూడా పిల్లలు, తల్లులకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందన్నారు. పారిశుద్ధ్యం, ఆహారం, తాగునీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని, వచ్చే సమీక్షా సమావేశానికి దీనిపై ఏం చర్యలు తీసుకున్నారన్న దానిపై నివేదించాలని అధికారులను ఆదేశించారు.

Government of Andhra Pradesh decided to launch DR YSR KANTI VELUGU programme with an objective to provide comprehensive and sustainable Universal Eye Care to all the people in the state by conducting eye screening and provision of appropriate interventions like distribution of Spectacles, Surgeries in case of Cataract, Glaucoma, Retinopathy, Corneal disorders etc in a Phased manner. Programme will be launched on 10.10.2019 on the occasion of world sight day. . 


CLICK HERE FOR


Notification