Wednesday, September 18, 2019

PM Kisan Maan Dhan Yojana Farmers Pension Scheme




PM Kisan Maan Dhan Yojana Farmers Pension Scheme

Under the PM-Kisan Maan-Dhan Yojana KMY, which was announced a monthly pension of Rs 3,000 will be provided to eligible farmers on attaining the age of 60

రైతులకు రూ.100లతో ప్రతినెలా రూ.3,000 పెన్షన్!

అందరికీ అన్నంపెట్టే రైతన్నలకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ప్రధాన్ మంత్రి కిసాన్ పెన్షన్ యోజన పథకంలో భాగంగా అర్హులైన రైతులకు ప్రతినెలా రూ.3,000 పెన్షన్ ఇవ్వాలని యోచిస్తోంది.

రైతుల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త స్కీమ్ ఒకటి తెచ్చారు. అదే కిసాన్ మాన్ ధన్.  చిన్న, సన్నకారు రైతులకు అరవై ఏళ్ల తర్వాత నెలకు రూ.3వేల పింఛన్ అందించేందుకు వీలుగా పీఎం కిసాన్ యోజన కిసాన్ మాన్ ధన్ పథకం తీసుకువస్తున్నారు. దీనికింద 18 నుంచి 40 ఏళ్లలోపు రైతులు చేరవచ్చు. ఇందుకు వయస్సును బట్టి రోజుకు రూ.2 నుంచి రూ.7 వరకు చెల్లించవలసి ఉంటుంది. దీనిని కేంద్రమే చెల్లిస్తుంది. వీరికి 60 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత నెలకు రూ.3వేలు వస్తుంది. ఒకవేళ రైతు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు 50 శాతం వస్తుంది. దీని వల్ల కోట్లాది మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. దీని వల్ల మొదటి మూడేళ్లలో 5 కోట్ల మంచి రైతులకు లబ్ధి చేకూరుతంది.
PM Kisan Maan Dhan Yojana Farmers Pension Scheme/2019/09/PM-Kisan-Maan-Dhan-Yojana-Farmers-Pension-Scheme.html
హైలైట్స్
  1. పీఎం కిసాన్ పెన్షన్ యోజన స్కీమ్‌కు కేబినెట్ ఆమోదం
  2. రైతులు పెన్షన్ ఫండ్‌కు నెలకు రూ.100 చెల్లించాలి
  3. కేంద్రం కూడా మీరు చెల్లించే డబ్బుకు సమానమైన మొత్తాన్ని పెన్షన్ ఫండ్‌కి జమ చేస్తుంది
పెన్షన్ పొందాలంటే రైతులు పెన్షన్ ఫండ్‌కు నెలకు నామమాత్రంగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పెన్షన్ ఫండ్‌కు మీరు చెల్లించిన డబ్బుకు సమానమైన మొత్తాన్ని జమచేస్తుంది. దిగ్గజ బీమా కంపెనీ ఎల్ఐసీ ఈ పెన్షన్ ఫండ్‌ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుంది. అంటే రైతులకు ఎల్ఐసీనే పెన్షన్ డబ్బులను అందిస్తుంది. మోదీ గవర్నమెంట్ తొలి కేబినెట్ రైతులకు ప్రత్యేకమైన పెన్షన్ స్కీమ్‌కు ఆమోదం తెలిపింది. తొలి మూడేళ్లలో 5 కోట్ల మందికి లబ్ధి చేకూర్చాలని కేంద్రం భావిస్తోంది.
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతుల పెన్షన్ స్కీమ్‌కు సంబంధించి ఇప్పటికే అన్ని రాష్ట్రాలతో మాట్లాడారు. వీలైనంత త్వరగా పథకాన్ని ప్రారంభించాలని కోరారు.
18 నుంచి 40 ఏళ్ల మధ్యలో వయసు ఉన్న రైతులను స్కీమ్ కోసం నమోదు చేసుకోవాలని ఆయన రాష్ట్రాలకు సూచించారు. అర్హులైన సన్నకారు రైతులకు 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3,000 పెన్షన్ ఇస్తారు. 29 ఏళ్ల వయసులో స్కీమ్‌‌లో చేరితే నెలకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.

రైతులకు ఆసరా కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలు ప్రవేశపెట్టింది. వారికి రుణాలివ్వడం కోసం కిసాన్ క్రెడిట్ కార్డులను ఇస్తున్నారు.
పెట్టుబడి సాయం కింద ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేస్తోంది. అలాగే వృద్ధాప్యంలో ఉన్న సన్న, చిన్నకారు రైతులకు తోడుగా నిలవాలనే ఉద్దేశంతో అమలు చేస్తున్న మరో పథకం పేరే కిసాన్ మాన్ ధన్ యోజన. 60 సంవత్సరాలు నిండిన రైతులు దీనిద్వారా నెలకు రూ.3వేల చొప్పున పింఛను పొందొచ్చు. ఈ పథకం అర్హత ఏమిటి? నమోదు వివరాలు తెలుసుకుందాం.
అర్హత
దేశంలోని కేంద్ర పాలిత ప్రాంతాలు, వివిధ రాష్ట్రాల సంబంధిత భూ రికార్డుల్లో పేర్లు ఉండాలి. అందులో 2 హెక్టార్ల వరకు సాగు భూమి కలిగి ఉండాలి. 18-40 మధ్య వయసున్నవారై, వారి వయసు 60 దాటాక ఈ పథకం కింద నెలకు కనీస పింఛను రూ.3 వేలు అందుతుంది. ఒక వేళ అర్హత కలిగిన రైతు మరణిస్తే అతడి జీవిత భాగస్వామికి 50 శాతం పింఛను వస్తుంది. కేవలం జీవిత భాగస్వామికి మాత్రమే ఇలా పింఛను లభించే వెసులుబాటు ఉంటుంది. మరణించిన వ్యక్తి పిల్లలకు వర్తించదు.
ఎంత కట్టాలంటే?
అర్హుడైన రైతు తనకు 60 ఏళ్లు వచ్చేంత వరకు నెలకు రూ.55 నుంచి రూ.220 వరకు చెల్లించాలి. అర్హత కలిగిన వ్యక్తికి 60 సంవత్సరాలు నిండగానే పింఛను కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ప్రతి నెలా రైతు బ్యాంక్‌ ఖాతాలో ప్రభుత్వం ఆ పింఛను అందజేస్తుంది.
కావాల్సినవేవంటే.
ఈ పథకంలో చేరడానికి దరఖాస్తుదారుడు పేరు, పుట్టిన తేదీ, బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్‌కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌, మొబైల్‌ నంబర్‌, ఈ-మెయిల్‌ ఐడీ, జీవిత భాగస్వామి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. అర్హత కలిగిన రైతులు తమ ప్రాంతంలో ఉన్న కామన్‌ సర్వీస్‌ సెంటర్‌/ మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసున్న రైతులు 60 సంవత్సరాలు వచ్చే వరకు నెలవారీ చందాగా రూ.55 నుంచి రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ పింఛన్‌ అందుతుంది.
వీరు అనర్హులు
ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌వో, నేషనల్‌ పెన్షన్‌ స్కీం (NPS) పథకం తో పాటు ఏ ఇతర చట్టబద్ధమైన సామాజిక భద్రతా పథకాల నుంచి లబ్ది పొందుతున్నవారు.. జాతీయ పింఛను పథకాన్ని ఎంచుకున్న ప్రభుత్వ ఉద్యోగులు, రైతులకు ఈ పథకానికి అనర్హులు.
PM Kisan Maan Dhan Yojana Farmers Pension Scheme:
Pradhan Mantri Kisan Maan-Dhan Yojana (PM-KMY) is an old age pension scheme for all land holding Small and Marginal Farmers (SMFs) in the country. It is a voluntary and contributory pension scheme for the entry age group of 18 to 40 years.The Modi government has launched the PM Kisan Maan Dhan Yojana, a pension scheme for small and marginal farmers of the country. The cultivators who are so-called marginal farmers as they mostly own less than 2 hectares of land.
Under this scheme, any eligible farmer between 18-40 years can register himself for the pension scheme and on completion of 20 years, he or she will get a monthly pension of Rs 3000. In this scheme, a farmer who is 18 years, the entry level age, will have to pay a monthly premium of Rs 55, while a farmer who is  aged 40 years will have to pay Rs 200 depending on their age of entry, in the Pension Fund till they reach the retirement date i.e. the age of 60 years.
The pension fund will be maintained by the Life Insurance Corporation of India and farmers can enroll themselves by visiting their nearest common service centres, an official said.
  1. The spouse is also eligible to get a separate pension of Rs.3000/- upon making separate contributions to the Fund.
  2. In case of death of the farmer before retirement date, the spouse may continue in the scheme by paying the remaining contributions till the remaining age of the deceased farmer. If the spouse does not wish to continue, the total contribution made by the farmer along with interest will be paid to the spouse. If there is no spouse, then total contribution along with interest will be paid to the nominee.
  3. If the farmer dies after the retirement date, the spouse will receive 50% of the pension as Family Pension. After the death of both the farmer and the spouse, the accumulated corpus shall be credited back to the Pension Fund.
  4. The beneficiaries may opt voluntarily to exit the Scheme after a minimum period of 5 years of regular contributions. On exit, their entire contribution shall be returned by LIC with an interest equivalent to prevailing saving bank rates.
How to apply:
The enrollment to the Scheme can be done through self registration online or through the Common Service Centres in various states. The enrollment is free of cost.
For enrollment through Common Service Centre:
The Common Service Centres will charge Rs.30/- per enrollment which will be borne by the Government.