Sunday, August 25, 2019

10వ తరగతి విద్యార్థులకు బంపరాఫర్, విద్యార్థులకు స్కాలర్‌షిప్... దరఖాస్తుకు ఆగస్ట్ 28 చివరి తేదీ

10వ తరగతి విద్యార్థులకు బంపరాఫర్,  విద్యార్థులకు స్కాలర్‌షిప్... దరఖాస్తుకు ఆగస్ట్ 28 చివరి తేదీ

స్కాలర్‌షిప్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు NCERT తీపికబురు చెప్పింది. 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ ఇచ్చేందుకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్-NCERT సంస్థ 'నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్' నిర్వహిస్తోంది.

*ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలివే.*



10వ తరగతి విద్యార్థులకు బంపరాఫర్, విద్యార్థులకు స్కాలర్‌షిప్... దరఖాస్తుకు ఆగస్ట్ 28 చివరి తేదీ/2019/08/ncert-Scholarship-to-10th-class-bse.telangana.gov.in-main.bseap.org-scholarships.gov.in.html

ఈ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ ప్రతీ ఏటా జరుగుతోంది. ఈ స్కీమ్‌లో పీహెచ్‌డీ వరకు స్కాలర్‌షిప్ పొందొచ్చు. ఇందుకోసం రెండు అంచెల పరీక్ష పాస్ కావాల్సి ఉంటుంది. ఇది మెరిట్ ఆధారంగా ఇచ్చే స్కాలర్‌షిప్ ఇచ్చేందుకు ప్రతీ ఏటా NCERT 'నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్' నిర్వహిస్తూ ఉంటుంది. ప్రతీసారి 1,000 మందికి స్కాలర్‌షిప్స్ ఇచ్చే NCERT ఈసారి మాత్రం 2,000 మందికి స్కాలర్‌షిప్స్ ఇవ్వనుంది. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1,250 చొప్పున ఇంటర్ వరకు, నెలకు రూ.2,000 చొప్పున డిగ్రీ, పీజీ వరకు ఆర్థిక సాయం లభిస్తుంది. యూజీసీ నియమనిబంధనల ప్రకారం పీహెచ్‌డీ స్కాలర్‌షిప్ ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల విద్యార్థులు 'నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్'కు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణలో దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. తెలంగాణలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసేందుకు ఆగస్ట్ 28 చివరి తేదీ. *తెలంగాణ విద్యార్థులు bse.telangana.gov.in* వెబ్‌సైట్‌లో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. *ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు http://main.bseap.org/* వెబ్‌సైట్‌లో స్కాలర్‌షిప్ వివరాలు తెలుసుకోవచ్చు.


పరీక్ష తేదీ వివరాలివే..

*తెలంగాణ, ఆంధ్రప్రదేశ్* విద్యార్థులకు నవంబర్ 3న నేషనల్ టాలెంట్ సెర్చ్ మొదటి దశ ఎగ్జామినేషన్ ఉంటుంది. 2020 మేలో రెండో దశ పరీక్ష ఉంటుంది.

*మైనార్టీ స్కాలర్‌షిప్‌ లకు దరఖాస్తుల ఆహ్వానం*

2019-20 విద్యా సంవత్సరానికి గాను జాతీయ మైనార్టీ స్కాలర్‌షిప్‌ లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మైనార్టీ సంక్షేమాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. పోస్ట్‌మెట్రిక్, ప్రీ -మెట్రిక్, మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. విద్యార్థులు, పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న తర్వాత సంబంధిత విద్యాసంస్థల యాజమాన్యాలు లాగిన్ అయ్యి, ఆన్‌లైన్‌లో ఆమోదించి, తదుపరి ప్రింట్‌తీసి ఆయా ప్రతులను మైనార్టీ సంక్షేమాధికారి కార్యాలయంలో సమర్పించాలన్నారు. తమ కార్యాలయంలో సంప్రదిస్తే విద్యా సంస్థలకు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను జారీ చేస్తామన్నారు.


  1. ప్రీ -మెట్రిక్  స్కాలర్ షిప్ లు దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది.. 15-10-19  చివరి తేది..  31-10-19
  2. పోస్ట్ మెట్రిక్  స్కాలర్ షిప్ లు దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది..  31-10-19  చివరి తేది..   15-11-19
  3. మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్ షిప్ లు దరఖాస్తు చేసుకోవడానికి  ప్రారంభ తేది..  31-10-19  చివరి తేది..   15-11-19

వెబ్‌సైట్‌:  http://scholarships.gov.in