SBI SUKANYA SAMRIDDHI YOJANA SCHEME
GENERAL INFORMATION, Latest Information, Star
SBI ‘సుకన్య సమృద్ది’ అకౌంట్.. పూర్తి వివరాలు!
ప్రధానాంశాలు:
- స్టేట్ బ్యాంకులో సుకన్య సమృద్ది ఖాతా ప్రారంభించొచ్చు
- వడ్డీ రేటు ఇప్పుడు 8.4 శాతంగా ఉంది
- కనీసం రూ.1,000 అకౌంట్ తెరవొచ్చు
- ఆడ పిల్ల ఉన్నత చదువు, పెళ్లికి ఉత్తమమైన పొదుపు పథకం ఇది
- సుకన్య సమృద్ది స్కీమ్ గురించి దాదాపు చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది ఒక చిన్న మొత్తాల పొదుపు స్కీమ్.
- ఆడపిల్లల కోసం ఈ పథకాన్ని ఆవిష్కరించారు. ఆడ పిల్లల పేరుపై ఈ ఖాతాను వీలైనంత త్వరగా తెరిచి ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభిస్తే.. అందులోని డబ్బులు వారి చదువుకు, పెళ్లికి ఉపయోగపడతాయి.
- గతంలో తల్లిదండ్రులు ఆడపిల్లల పేరుపై బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీ) చేసేవారు.
- ఈ డబ్బును వారి పెళ్లి, చదువు కోసం ఉపయోగించేవారు. ఇప్పుడు తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్ కోసం సుకన్య సమృద్ది అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారు.
- సుకన్య సమృద్ది అకౌంట్‌లో ఇన్వెస్ట్ చేసే డబ్బుపై ఆదాయపు పన్ను మినహాయింపు కూడా ఉంది.
ఎస్‌బీఐ సుకన్య సమృద్ది అకౌంట్ ప్రయోజనాలు..
- పదేళ్ల వయసులోపు ఉన్న ఆడ పిల్ల పేరుపై ఆమె తల్లిదండ్రులు లేదా సంరక్షులు సుకన్య సమృద్ది అకౌంట్‌ను తెరవొచ్చు.
- ఒక కుటుంబంలో ఇద్దరు ఆడ పిల్లల పేరుపై రెండు ఖాతాలు ప్రారంభించొచ్చు.
- ఒక్కోసారి కవలలు పుడితే ముగ్గురి పేరుపై కూడా ఈ అకౌంట్‌ను తెరవొచ్చు.
- కనీసం రూ.1,000తో సుకన్య సమృద్ది అకౌంట్‌ను ప్రారంభించాల్సి ఉంటుంది.
- ఒక ఆర్థిక సంవత్సరంలో అకౌంట్‌లో గరిష్టంగా 1,50,000 వరకు మాత్రమే డిపాజిట్ చేయగలం.
- సుకన్య సమృద్ది అకౌంట్ ప్రారంభించిన దగ్గరి నాటి నుంచి 21 ఏళ్లు వరకు కొనసాగుతుంది.
- ఖాతా తెరిచిన దగ్గరి నుంచి 15 ఏళ్లు వరకు అకౌంట్‌లో డబ్బు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
- ఎస్‌బీఐ సుకన్య సమృద్ది అకౌంట్‌పై 8.4 శాతం వడ్డీ రేటు లభిస్తోంది.
- గత త్రైమాసికంలో ఈ రేటు 8.5 శాతంగా ఉంది. అంటే వడ్డీ రేటు ఇప్పుడు 0.1 శాతం తగ్గింది. వడ్డీ రేటు ప్రతి మూడు నెలలకు ఒకసారి మారుతుంది.
- ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ కింద సుకన్య సమృద్ది ఖాతాలో డిపాజిట్ చేసిన, అర్జించిన వడ్డీ, విత్‌డ్రా మొత్తంపై ఎలాంటి పన్ను ఉండదు.
- తీవ్రమైన అనారోగ్యం, డిపాజిటర్ మరణించడం వంటి అనూహ్య పరిస్థితుల్లో అకౌంట్‌లోని డబ్బులు ముందుగానే వెనక్కు తీసుకోవచ్చు.
- ఆడ పిల్లకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత ఉన్నత చదువులు లేదా పెళ్లి కోసం అకౌంట్ నుంచి 50 శాతం డబ్బుల్ని వెనక్కు తీసుకోవచ్చు.
- మిగతా మొత్తాన్ని అకౌంట్ మెచ్యూరిటీ (21 ఏళ్లు) తర్వాత తీసుకోవాలి.