Saturday, August 24, 2019

‘సచివాలయ’ ఉద్యోగాల రాత పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు సూచనలు

‘సచివాలయ’ ఉద్యోగాల రాత పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు సూచనలు
‘సచివాలయ’ ఉద్యోగాల రాత పరీక్షలకు అభ్యర్థులకు సాధ్యమైనంత మేరకు వారి నివాస ప్రాంతానికి 30 కిలోమీటర్ల పరిధిలోనే పరీక్షా కేంద్రాలను కేటాయిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ చెప్పారు
రాత పరీక్ష సమయంలో ఎటువంటి అవకతవకలకు తావివ్వకూడదన్న ఉద్దేశంతో అభ్యర్థుల సొంత మండల పరిధిలో కాకుండా పక్క మండలంలో పరీక్ష కేంద్రాన్ని కేటాయించాలని నిబంధన పెట్టామన్నారు.


‘సచివాలయ’ ఉద్యోగాల రాత పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు సూచనలు/2019/08/Instructions-to-aspirants-of-Ap-Grama-Ward-Sachivalayam-Examination.html
Add caption

ప్రభుత్వం ఒకే విడత రికార్డు స్థాయిలో భర్తీ చేస్తున్న 1,26,728 ఉద్యోగాలు మెరిట్ అభ్యర్థులకు దక్కాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని చెప్పారు. రాతపరీక్ష ఏర్పాట్లపై ఆగస్టు 20నఆయన ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. రాత పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న 21.69 లక్షల మందికి పరీక్షా కేంద్రాల కేటాయింపు పూర్తి. రెండు మూడు రోజుల్లో ఆన్‌లైన్‌లో అందుబాటులో హాల్ టిక్కెట్లు. రాత పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఉద్యోగ నియామకాలు.


పరీక్ష కేంద్రాల ఇన్విజిలేటర్లుగా ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే నియమిస్తాం. ఏ పరీక్ష కేంద్రం కేటాయించేది పరీక్షకు ఒక్క రోజు ముందు వెల్లడి. ఏ గదిలో ఎవరుంటారనేది రెండు మూడు గంటల ముందు మాత్రమే నిర్ణయం.
ప్రతి పరీక్ష కేంద్రంలో రెండు వీడియో కెమెరాలతో చిత్రీకరణ కంప్యూటర్ ద్వారానే ఓఎమ్మార్ షీట్ల స్కానింగ్. రెండు సార్లు స్కాన్ చేసి, ఫలితాన్ని క్రోడీకరించుకుంటుంది. రాత పరీక్ష ఫలితాల మార్పులు చేర్పులకు ఎలాంటి అవకాశం ఉండదు. ఒకే అభ్యర్థి ఒకే రోజు రెండు వేర్వేరు ఉద్యోగాలకు జరిగే రాత పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటే ఒకే

పరీక్షా కేంద్రం కేటాయింపు .అభ్యర్థులు రెండున్నర గంటల పాటు పరీక్ష కేంద్రంలో ఉండాల్సిందే. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా లోపలికి అనుమతించం. కంటి చూపు, రెండు చేతులు లేని వారికి సహాయకుడి ఏర్పాటు. అదనంగా మరో 50 నిమిషాల సమయం.
రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థి పేరు, ఇతర వివరాలు, అతని హాల్ టిక్కెట్ నంబర్‌తో సహా ఓఎమ్మార్షీట్ల ప్రింటింగ్ ప్రక్రియ పూర్తి. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయా జిల్లాల్లోని స్ట్రాంగ్ రూంలకు తరలింపు ప్రారంభం. స్ట్రాంగ్ రూంల వద్ద
24 గంటలు పనిచేసే సీసీ కెమెరాల ఏర్పాటు.
Click Here for

More Information on AP Grama sachivalayam Material And Model Test papers