తెలుసుకోండి : గ్రామ వాలంటీర్ల ఇంటర్వ్యూ విధానం.. అడిగే ప్రశ్నలు.. అర్హతలు
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పంచాయతీల్లో ప్రతి 50 కుటుంబాలకు వాలంటీర్లను నియమిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే నోటిఫికేషన్ వేశారు. ఇప్పటికే 4 లక్షల మంది గ్రామ వాలంటీర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. నోటిఫికేషన్ లో 4లక్షల 33వేల 126 గ్రామ వాలంటీర్ల పోస్టులు ప్రకటించారు. గ్రామ వాలంటీర్ల
అర్హతలు..
> గ్రామ వాలంటీర్ కు ఇంటర్మీడియెట్ పాసై ఉండాలి. గిరిజన ప్రాంతాలకు సంబంధించి పదో తరగతి చదివితే సరిపోతుంది.> వార్డు వలంటీర్ కు డిగ్రీ పాసై ఉండాలి.
> గ్రామ/ వార్డు వాలంటీర్ గా పనిచేయాలనుకునే వారు స్థానికులై ఉండాలి.
> అభ్యర్ధులు వయసు 2019, జూన్ 30 నాటికి 18 నుంచి 35 ఏళ్లు మించకూడదు. > నిబంధనల మేరకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. మహిళలకు దాదాపు 50 శాతం రిజర్వేషన్ ఉంటుంది.
కొన్ని సమూనా ప్రశ్నలు...
> మీ గ్రామ రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి..?
> మీరు ఇంతకముందు ఏవైనా సోషల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారా..?
> పిల్లలు మధ్యలో స్కూల్ మానేయకుండా చూడాలంటే ఏం చేస్తే బాగుంటుంది..?
> రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే 'నవరత్నాల' గురించి చెప్పండి..?
> పిల్లలను స్కూల్ కి పంపితే 'అమ్మ ఒడి పథకం' కింద తల్లి ఖాతాలో ఎంత మొత్తం జమచేస్తారు..?
ఇంటర్వ్యూలో అభ్యర్థికి ఉండాల్సిన లక్షణాలు...
ఇంటర్వ్యూ అనగానే ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో అని టెన్షన్ విద్యార్ధుల్లో ఉంటుంది. అయితే అలాంటి టెన్షన్ లేకుండా, ఒత్తిడిని దరిచేరనీయకుండా ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూకు వెల్లమంటుంన్నారు నిపుణులు.
- చెప్పే సమాధానాల్లో నిజాయితీ కనిపించాలి.
- భావ వ్యక్తీకరణలో స్పష్టత.
- సామాజిక అవగాహన ఉండాలి.
- నాయకత్వ లక్షణాలు.
- ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్.
- ఇంటర్వ్యూ సమయంలో సమాధానాలను సూటిగా, స్పష్టంగా చెప్పాలి.
- అవసరమైతే ఉదాహరణలతో వివరించాలి.
- అడిగిన ప్రశ్న పూర్తికాకుండానే సమాధానం చెప్పేందుకు ప్రయత్నించకూడదు.
- ఆర్గుమెంట్ (వాదన చేయకూడదు.
వాలంటీర్ విధులు..
> తమకు కేటాయించిన కుటుంబాలకు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాలను చేరవేయాలి.
> కులం, మతం, రాజకీయంతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను చేరవేయాలి.
> తమ పరిధిలోని కుటుంబాల సమస్యలను ప్రభుత్వానికి తెలిచయజేయాలి.
> ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరించాలి.
> ఉన్నతాధికారులు అప్పగించిన ఇతర విధులను కూడా నిర్వర్తించాల్సి ఉంటుంది.
> పనితీరు సంతృప్తికరంగా లేకుంటే వాలంటీర్లను తొలగిస్తారు.
గ్రామ వాలంటీర్ ఎంపిక విధానం:
> తొలిదశలో దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. ఆ తర్వాత గ్రామాల్లో అయితే MPDO / తహసీల్దార్/EO లతో కూడిన సెలక్షన్ కమిటీ అర్హులైన అభ్యర్ధులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది.
> ఇందులో ప్రతిభ చూపిన వారికి గ్రామ వాలంటీర్గా సెలక్షన్ కమిటీ చైర్మాన్ నియామక పత్రాలు అందిస్తారు.
ముఖ్య తేదీలు:
> దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా.> దరఖాస్తు చివరి తేదీ : జూలై 5, 2019.
> ఎంపికైన అభ్యర్ధులకు సమాచారం ఇచ్చే తేదీ : ఆగస్టు 1, 2019.
> విధులు ప్రారంభం: ఆగస్ట్ 15, 2019.
CLICK HERE FOR
AP Grama Volunteer Syllabus 2019 | Check Andhra Pradesh Volunteer Exam Pattern
AP Gram Volunteer Study Material Download
Official Website AP Gram Volunteer Study Material Download