Tuesday, March 12, 2019

స్థలాలు లేదా ఇల్లు కొని లేదా అమ్మినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు

స్థలాలు లేదా ఇల్లు కొని లేదా అమ్మినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు

precautions-to-be-taken-during-selling-and-purchasing-of-land-or-house


స్థలాలు లేదా ఇల్లు కొని లేదా అమ్మినప్పుడు Brokers, Banks నమ్మకంగా మన పక్కనే ఉండే వాళ్ళు చేసే మోసాలు. చాలా మంది తెలియక మోసపోతూ ఉంటారు వారికోసం ఇది. (కొంతమంది మాత్రమే)


స్థలాలు లేదా ఇల్లు కొని లేదా అమ్మినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు precautions-to-be-taken-during-selling-and-purchasing-of-land-or-house/2019/03/precautions-to-be-taken-during-selling-and-purchasing-of-land-or-house.html


ముందుగా Brokers చేసే మోసాలు


1) Brokers స్థలం కొనేటప్పుడు తప్పుడు వివరాలు ఇస్తారు. 100% వాళ్ళ మాటలు నమ్మవద్దు. సంపాదించడం చేతకాని వాళ్ళు ఇలాంటి తప్పుడు మాటలు చెప్పి సంపాదిస్తారు. ఎంగిలి మెతుకులు కోసం ఆశ పడే వారు ( కొంత మంది కి మాత్రమే)

 2) 2% broker commision తీసుకుంటారు. బేరం మాట్లాడేటప్పుడు ఎక్కువ brokers వస్తారు. మనలని రెచ్చగొట్టి ఎక్కువ రేట్ కి కొనే విధముగా చేస్తారు.

3) నిజ యజమానిని తీసుకురాకుండా నకిలీ వాళ్ళని తీసుకొచ్చి బేరం చేస్తారు.

4) ఆస్తి ఎవరి పేరు మీద ఉందో తెలుసుకోవాలి అంటే registration office లో EC  తెస్తే తెలుస్తుంది. 300 అవుతుంది ECకి.

5) కొనే ముందు original sale deed (Original document) లో ఉండే యజమాని photo చూడండి. అన్ని links documents history చూడాలి.

6) ఎట్టి పరిస్థితుల్లో Sale agreement ( contract) min 3months ఉండేలా చూడండి. మీ దగ్గర డబ్బు ఉన్నా 3Months తక్కువ వెయ్యవద్దు. ఈరోజు ఏమి జరుగుతుందో తెలియదు. Agreement amount 5-10% కన్నా ఎక్కువ ఇవ్వవద్దు. Agrement cancel చేస్తే తిరిగి ఇవ్వకుండా బాగా తిప్పుకుంటారు.

7) మీ సొంత మనుషులు, మీ స్నేహితులు చెప్పే మాటలు నమ్మవద్దు. వల్లే commission కోసం కకృతి పడతారు.

8.) A, B brokers ఉన్నారు అనుకుందాం. A broker నీకు తెలుసు, వీడు B broker దగ్గరకి బేరం కోసం తీసుకొని వెళ్తాడు. యజమాని B broker కి agrement వేసాడు అని అబద్ధం చెపుతారు. స్థలం రేట్ 1Lakh అనుకుందాం, స్థలం యజమానికి తో ఈ brokers  1Lakh కన్నా ఎక్కువ వస్తే మేము తీసుకుంటాము అని deal చేసుకుంటారు. అప్పుడు B broker 1,10,000 కి కొనే వారి దగ్గర బేరం కుదుర్చుకుంటాడు.

9) ఎట్టి పరిస్థితుల్లో బేరం మాట్లాడే తప్పుడు నిజమైన యజమానితోనే మాట్లాడండి. ఈ brokers యజమాని busy గా ఉన్నాడు, వేరే దేశాలలో ఉన్నాడు అని అబద్దాలు చెపుతారు. కనీసం video call లో ఇన మాట్లాడండి. యజమాని ఏదయినా ID proof చూపించమనాలి.

10) మీరు కొనే స్థలం , వాటి డాకుమెంట్స్ address నిజమో కాదో తెలుసుకోండి. ఎక్కడో ఉన్న స్థలం డాకుమెంట్స్ తో  మంచి area లో ఉన్న స్థలం చూపించి మోసం చేస్తారు.
మీరు అనుకున్న స్థలం orginal స్థలాలు వేరుగా ఉంటాయి.

11) original స్థలం size, document స్థలం size లో తేడాలు ఉంటాయి.

 Documents required for Property


1) Main Owner Sale Deed document original, ఒరిజినల్ పేపర్స్ మీద stamp చూడాలి.
2) All Linked Documents
3)  అన్ని డాకుమెంట్స్ లో కొనేవారు, అమ్మేవారు ఒక్కరు కాకపోతే అమ్మేవాడి Family tree certificate ( తండ్రి చనిపోతే పిల్లలు స్థలం ఆమ్మితె లేదా వరాసత్వముగా వచ్చే ఆస్తి ఐతే)
4) Documents front page లో ఏదయినా court seal, sign ఉంటే property మీద case ఉన్నది అని అర్థం.
5) EC - Encumbrance certificate (EC)
6) Mother deed certificate
7) RTC - Record of Rights, Tenancy and Crops (For Agriculture Land)
8.) Survey Sketch
9) Layout Approval
10) Katha Certificate
11) DC Conversion certificate ( agriculture to Non-Agriculture land conversion)
12) Property Tax Certificate
13) SC, ST సోదరులకు ప్రభుత్వామ్ ఉచితముగా స్థలాలు ఇచ్చినది. అటువంటి స్థలాలు కొన్న మళ్ళీ వారికే వెళ్తాయి, రిజిస్ట్రేషన్ చెల్లదు.
14) పేద వారికి ప్రభుత్వామ్ ఉచితముగా స్థలాలు ఇచ్చినది, అటువంటి స్థలాలు కొనకూడదు.

15) మనతో మంచిగా నటిస్తూ మనం అనుకునే మాటలని brokers చెప్తూ commission తీసుకుంటారు. వాళ్ళతో జాగ్రత్త.

16) స్థలం కాగితాల copys ఎట్టి పరిస్థితులలో ఎవరికి ఇవ్వకండి. ఆ copy paper ఇతరుల దగ్గర ఉండటం వల్ల మనకి చెడు చేసే అవకాశం ఎక్కువ.

17) ఇల్లు కట్టి ఉంటే building Plan approval ఉండాలి.

18)Agrement రోజు, Registration ముందు రోజు  EC తీయండి. కొంత మంది వేరే వాళ్ళకి అమ్మి మన దగ్గర Agrement వేస్తారు. EC లో స్థల యజమాని ఎవరో , ఎప్పుడు కొన్నారు, ఎవరి దగ్గర కొన్నారు ఉంటాయి.

19) ఆ ల్యాండ్ పైన ఎమైనా విద్యుత్ lines ఉన్నాయా, ల్యాండ్ క్రింద ఎమైనా underground drainage ఉన్నదా.  Land govt ప్రజా అవసరాలకు తీసుకుంటున్న కోనకూడదు.

20) ఇప్పుడు Online Registration process ఉన్నది. 15Years back online లేదు ఆ time లో ఒకే property ని ఎక్కువ మంది పేరుతో రిజిస్టర్ చేశారు మోసం చేసి.

...Loan తీసుకొనే అప్పుడు వాళ్ళు చేసే మోసాలు.......


1) ఎట్టి పరిస్థితుల్లోనూ Broker లేదా  యజమాని Refer చేసిన బ్యాంక్ లో Loan తీసుకోవద్దు. వాళ్ళు బ్యాంక్ వాడికి కమిషన్ ఇచ్చి వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉన్నది.

2) బ్యాంక్ Loan రావాలి అంటే పైన చెప్పిన documents compulsary ఉండాలి. అవి లేకుండా బ్యాంక్ loan ఇవ్వదు.

3) బ్యాంక్ loan 70% నుంచి 80% వరకు ఇస్తారు. అది కూడా మీరు Registration Document లో చూపించిన Property value లో. Property government value 5Lak అనుకోండి. Actual market price 30Lak అనుకోండి. మీకు loan 15Lak కావాలి అనుకోండి. అప్పుడు మీరు registration document లో 20L చూపించి Register చేసుకోవాలి. మీకు 20L లో 75% అంటే 15L బ్యాంక్ లోన్ ఇష్టది.

4) మీరు 20Lks registration document లో చూపిస్తే మీకు registration charges పెరుగుతాయి. స్థల యజమానికి TAX పడుతుంది. INDEX based Tax యజమాని Govt కి కట్టాలి.  అందువల్ల యజమాని ఒప్పుకొడు.

5) బ్యాంక్ లోన్ ఇచ్చేటప్పుడు processing fee ఉంటది min 10,000. 1.5%  loan amount లో Insurance తీసుకోవాలి . కొన్ని Banks (DHFL)  5% కన్నా ఎక్కువ insurance charge చేస్తాయి మనకి తెలియకుండా Enable చేస్తారు. Mortage(తాకట్టు) registration బదులు 0.3% value లో Revenue stamp మీద లోన్ agrement వేస్తే సరిపోతుంది.

6) Registration అప్పుడు Bank agent వచ్చి check యజమానికి ఇచ్చి, అన్ని Original documents తీసుకొనిపోతారు. అందువల్ల వాటి zerox తీసుకోండి.

7) పైన చెప్పిన process బ్యాంక్ లో చేసేది. అవి అవసరం లేదు మేము Loan ఇప్పిస్తాము , Sale agreement వేసుకొండి అని బ్యాంక్స్ చెపుతాను. 1Week లో Loan process complete అవుతుంది అని చెపుతారు.  Agreement వేసుకొని వెళ్లిన తరువాత చుక్కలు చూపిస్తారు.

8) బ్యాంక్ లోన్ process min 20days పడుతుంది. బ్యాంక్ వెదవలు చెప్పే మాటలు నమ్మి  sale agrement తక్కువ రోజుల్లో వేసుకోవద్దు. Min 3months agreement వేసుకోవాలి.

9) personal loan తీసుకుంటే Processing fee ఉంటది, Insurance optional.  ముందే Insurance వద్దు అని చెప్పాలి


Kindly Share this information to your friends and wellwishers