Thursday, December 13, 2018

School Assembly Useful Day Importance GK News 13.12.2018

School Assembly Useful Day Importance GK News 13.12.2018

పాఠశాల అసెంబ్లీ కోసం

 13-12-2018

నేటి వార్తల ముఖ్యాంశాలు

కేసీఆర్‌ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు: తెలంగాణ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన తెరాస అధినేత కేసీఆర్‌ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. రేపు మధ్యాహ్నం 1.25 గంటలకు ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. కేసీఆర్‌తో గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణస్వీకారం చేయించనున్నారు.

ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా వెళ్లొచ్చు!.కేసీఆర్‌ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు‌: తెలంగాణలో ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ పడిన చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తానన్న తెలంగాణ సీఎం వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా వెళ్లవచ్చు.. రావొచ్చని వ్యాఖ్యానించారు.

ట్రంప్‌కు 3లక్షల డాలర్లు చెల్లించాలి. పోర్న్‌స్టార్‌ను ఆదేశించిన న్యాయస్థానం: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు అక్కడి కోర్టులో ఊరట లభించింది. ఆయనపై పోర్న్‌ స్టార్‌ స్ట్రామీ డెనియల్స్‌ దాఖలు చేసిన పరువు నష్టం దావాను ఫెడరల్‌ న్యాయమూర్తి తోసిపుచ్చారు. అంతేకాకుండా ట్రంప్‌కు న్యాయ ఖర్చుల కింద సుమారు 3లక్షల డాలర్లు(సుమారు రూ.2కోట్లు) చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

ఆర్‌బీఐ స్వయం ప్రతిపత్తి కాపాడుతా: గవర్నర్ శక్తికాంత దాస్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) స్వయం ప్రతిపత్తి, సమగ్రత, విశ్వసనీయతను కాపాడుతానని ఆర్‌బీఐ నూతన గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఆర్‌బీఐ గవర్నర్‌గా పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తూ బ్యాంకింగ్ రంగం, ఆర్థిక వ్యవస్థ అత్యంత ప్రధానమైనవి అని పేర్కొన్నారు.

కనీస ధర రూ.2 కోట్ల జాబితాలో ఒక్క భార‌త క్రికెట‌ర్ లేడు!: వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌-12లో ఆడేందుకు 1,003 మంది క్రికెటర్లు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తం 8 జట్లకు కలిపి 70 మంది క్రికెటర్లను వేలంలో ఆయా ఫ్రాంఛైజీలు ఎంపిక చేసుకోనున్నారు. ఈనెల 18న జైపూర్‌లో వేలం జరగనున్నది.

కోస్తాకు వాయుగుండం.. అల్లకల్లోలంగా సముద్రం: కోస్తా ఆంధ్రకు వాయుగుండం ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్ప పీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈ ప్రభావంతో డిసెంబర్‌ 14 నుంచి 16 మధ్య కాలంలో కోస్తా జిల్లాల్లో భారీ వర్షం కురవనుందని తెలిపారు. సముద్రంలో అలలు 6 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే అవకాశం ఉందన్నారు.


                       సుభాషిత వాక్కు
         
"మర్యాదగా వినడం,వివేకంతో సమాధానమివ్వడం, ప్రశాంతంగా ఆలోచించడం నిన్ను ఉన్నతుడిగా, ఉత్తముడిగా నిలబెడుతాయి. ఇవి ప్రతి మనిషికి అవసరం."

"Nobody gets everything in life. So, for whatever you have got, feel grateful with every breath."


                          మంచి పద్యం


పులునిజూచి తోటి పులులు భయపడునె
నక్కజూచి నక్క నమ్ముచుండు
నరునిజూచి నరుడు నమ్మలేడిది నమ్ము
వినుర వినయశీల వెలుగుబాల !

( *శ్రీ పోతగాని కవి రచించిన "వెలుగుబాల" శతకంలోనిది. పోతగాని గారు హిందీ పండితులు. ZPHS భీమవరం, ఎర్రుపాలెం మండలం. ఖమ్మం జిల్లా. సెల్ నెం: 9441083763*)

                Today's GK

    భారత రాజ్యాంగం

1.ఏ దేశం  నుండి భారతదేశం వ్రాసిన రాజ్యాంగం పొందింది?

A: అమెరికా (USA)

2. ఏ దేశ రాజ్యాంగం నుంచి ప్రాథమిక విధులు రూపొందించారు?

A: రష్యా (USSR)

3. ఏ దేశం నుండి ఐదు సంవత్సరాల ప్రణాళిక స్వీకరించారు?

A: రష్యా (USSR)
నేటి సామెతలు


13-11-2018

జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లు

వివరణ:- *ఎవరైనా ఏదైనా పని చేయడానికి ఎంచుకున్నపుడు ఆ జట్టులో ఎవరికీ సరైన అవగాహన లేకపోతే ఈ సామెతను వాడతారు. పూర్వకాలంలో సన్యాసులు తమ ఒంటికి బూడిద రాసుకోవడం మీకు తెలిసే ఉంటుంది. అదే విధంగా పుట్టిన మరో సామెత సన్యాసీ సన్యాసీ రాసుకుంటే బూడిద రాలిందంట

జాతీయము
జులాయిగా తిరుగుతున్నాడు

వివరణ:- పని పాట లేకుండా తిరుగు తున్నాడని అర్థం: ఉదా: వాడు జులాయిగా తిరుగు తున్నాడు. ఇది జాతీయము. దీనిని ఆ జాబితాలో చేర్చవచ్చు.

జోడు గుర్రాలమీద స్వారీ చేస్తున్నాడు

వివరణ:- ప్రమాదంలో వున్నాడని అర్థం: ఉదా: జోడు గుర్రాలమీద స్వారి చేస్తున్నావు జాగ్రత్త.



నేటి కథ

                 గాడిద నేర్పిన గుణపాఠం

చాలా కాలం క్రితం పర్షియా దేశంలోని ఒక పట్టణంలో కొందరు సూఫీలు కలిసి ఒక హోటల్ నడిపించేవాళ్ళు. సూఫీ బాటసారులు, యాత్రీకులు వేరే చోట్లకాక, ఆ హోటల్లో‌ దిగేందుకు ఇష్టపడేవాళ్ళు.

ఒకసారి సూఫీ యాత్రికుడొకడు, చాలా దూరం నుండి ఒక మంచి గాడిదనెక్కి ప్రయాణిస్తూ, చీకటి పడే వేళకు ఆ సత్రం చేరుకున్నాడు. హోటల్ యజమాని అతన్ని సాదరంగా ఆహ్వానించి, అతను ఉండేందుకు ఒక చక్కని గది చూపించాడు. అతని గాడిదను ప్రక్కనే గల తమ జంతుశాలలో వదలమన్నాడు. యాత్రికుడు స్వయంగా తన గాడిదను అక్కడికి తీసుకెళ్ళి, ముందుగా దానికి పచ్చిగడ్డి, దాణా పెట్టించి, "బాబూ! నా యీ గాడిదంటే నాకు చాలా ఇష్టం; దీన్ని జాగ్రత్తగా చూసుకో. ఇలాంటి మేలురకం గాడిద ఖరీదు కూడా‌ బాగా ఎక్కువ" అని దాన్ని అక్కడి కాపలావాడికి అప్పగించి వచ్చాడు.

అదే రోజున, ఆ హోటల్లో దిగిందొక అల్లరి కుర్రాళ్ల మూక. వాళ్ళు అందరూ‌ మామూలుగా బాగా కట్టుదిట్టాలలో పెరిగినవాళ్ళే- అయితే అవకాశం దొరికితే చాలు- స్వేచ్ఛను- అదెంత క్షణికమైనా సరే- అనుభవించాలని తపన పడే రకాలు. ఆ రోజు సాయంత్రం నుండి బాగా ప్రొద్దు పోయేంతవరకు పార్టీ చేసుకోవాలని సంకల్పించారు వాళ్ళు.

అయితే వాళ్ల దగ్గర డబ్బులెక్కడివి? మన యాత్రికుడి గాడిదను చూడగానే వాళ్ళ కళ్ళు మెరిసాయి. వాళ్ళంతా జంతుశాల కాపలావాడిని మాయచేసి, ఆ గాడిదను తీసుకెళ్ళి, గుట్టుచప్పుడు కాకుండా అమ్మేశారు. ఆ డబ్బులతో పిండి, మాంసం, నెయ్యి, నూనె, కూరగాయలు, చక్కెర, ఇంకా చాలా సారాయి- ఇవన్నీ కొనేశారు. అటుపైన అందరూ వంట పనుల్లోను, పార్టీకి కావలసిన ఇతర సరంజామా అంతా సిద్ధంచేసుకోవటంలోను మునిగారు.

కొందరు ఆ గాడిద యజమాని ఉన్న గదికి వెళ్ళి, ఆయన్ని కూడా పార్టీకి రమ్మని మర్యాదగా ఆహ్వానించి మరీ వచ్చారు!

ఎనిమిది గంటలయ్యేసరికి వంట అంతా సిద్ధమైంది. గది అలంకరణ పూర్తైంది; సంగీతం-వగైరాలన్నీ సిద్ధం అయ్యాయి. గదినిండా పెద్ద పెద్ద తివాచీలు పరిచారు. వండిన పదార్థాలన్నిటినీ‌ఆ తివాచీలమీద, గది మధ్యలో, పెద్ద పెద్ద పింగాణీ పాత్రల్లో పెట్టారు. అయితే ఇంకా గాడిద యజమాని రాలేదు.

అందుకని, వాళ్ళు ఆయన్ని సగౌరవంగా పిలుచుకు వచ్చేందుకుగాను ఒక మనిషిని పంపారు- వెంట ఉండి పిలుచుకు రమ్మని. ఆయన రాగానే అందరూ ఆయన్ని రాజును పలకరించినట్లు పలకరించారు; ప్రత్యేక అతిథికోసం ఉంచిన సీట్లో కూర్చోబెట్టారు. ఆపైన ఇక అందరికీ వంటకం తర్వాత వంటకం వడ్డించారు. అందరూ తింటూ వంటవాళ్ళని మెచ్చుకున్నారు విపరీతంగా.

విందు సగంలో ఉందనగా సారాయిల్ని తెచ్చారు: రకరకాల రుచుల సారాయిలు; రకరకాల రంగుల సారాయిలు; కొత్తది-పాతది-మేలురకంది- ఇట్లా రకరకాల సారాయిలు. అక్కడ ఉన్నవాళ్ళు అందరూ తాగారు. సారాయి గొంతులోకి జారినకొద్దీ వాళ్ల పట్టు జారిపోయింది. కొందరు నవ్వుతున్నారు; కొందరు పగలబడి నవ్వుతున్నారు; కొందరు తూలుతున్నారు; కొందరు మామూలుగా పాడటం మొదలుపెట్టారు- గదిలో శబ్దాల స్థాయి బాగా పెరిగింది- చివరికి అందరూ సంగీతంమీదా, నాట్యం మీదా పడ్డారు. తినటం, తాగటం, పాడటం, నాట్యం చెయ్యటం: అందరూ ఒళ్ళు మరచిపోయారు.

వాళ్లలో ఒకడు గాడిద మీద పాట కట్టాడు- గాడిద యజమానితో సహా అందరూ‌గొంతులు కలిపారు ఉత్సాహంగా.
జగతిలోని జీవాలల్లో
ఉత్తమమైనది గాడిద
అది గాడిద గాడిద గాడిద!
జంతు జాతిలో
అత్యుపయోగం గాడిద
అది గాడిద గాడిద గాడిద!
ఎవరేం తిన్నా దానికి మూలం గాడిదే
అది గాడిద గాడిద గాడిదే!
ఎవరేది త్రాగినా ఇచ్చేదా గాడిదే
గాడిద గాడిద గాడిదే!
*గాడిద పాటనే అందరూ మార్చి మార్చి పాడారు: రాగాలు కట్టి; విరగ్గొట్టి పాడారు. విచిత్రం ఏంటంటే 'ఆ గాడిద తనదే' అని ఎరుగని గాడిద యజమాని కూడా‌ ఆ పాటల్లో మునిగి తేలాడు! అట్లా మొదలైన పార్టీ రాత్రంతా కొనసాగింది. గాడిద యజమాని బాగా అలసిపోయి, రాత్రి రెండుగంటల ప్రాంతంలో తన గదికి వెళ్ళి హాయిగా గుర్రుకొట్టి నిద్రపోయాడు.*

మర్నాడు ఇక అతను లేచి, సామాన్లు సర్దుకొని ప్రయాణానికి సిద్ధమయ్యేసరికి మధ్యాహ్నం కావచ్చింది. ఆ సమయంలో గాడిదకోసం జంతుశాలకు వెళ్ళిన అతనికి, గాడిద బదులు ఖాళీ గుంజ దర్శనమిచ్చింది! కొంచెంసేపు వెతుక్కున్న తర్వాత, అతను కాపలాదారును పిలిచి అడిగాడు: "గాడిద ఏమైంది?" అని.*

"అయ్యా! తమరి గాడిదని ఆ కుర్రాళ్ళంతా కలిసి తీసుకెళ్ళి అమ్మేశారండి! ఆ డబ్బులతోటే నిన్న రాత్రి పార్టీ‌జరిపారండి!"అన్నాడు కాపలావాడు, నిజాయితీగా.

"కానీ నేను గాడిదను నీ సంరక్షణలోనే గదా, వదిలింది? నీదే బాధ్యత. నేను నిన్ను పోలీసులకు అప్పగిస్తాను" అన్నాడు యాత్రికుడు, వేడెక్కిపోతూ.

"ఈ కుర్రాళ్ళు సార్! ఎవ్వరిమాటా వినరు. వీళ్ళనెవ్వరూ ఆపలేరు- పోలీసులైనా సరే. నేనేమైనా ప్రయత్నించి ఉంటే నన్నూ నాలుగు వాయించేవాళ్ళు" అన్నాడు కాపలాదారు, వినమ్రంగా.

"అలాగైతే నువ్వు కనీసం నాతో చెప్పి ఉండవచ్చునే!" అన్నాడు యాత్రికుడు బాధగా.

"నేను మీకు చెప్పాలని విశ్వప్రయత్నం చేశాను సార్! అయితే మీరు ఆ సమయానికి తినటంలోను, త్రాగటంలోను బిజీగా ఉండి, నేను చెప్పేదాన్ని అస్సలు పట్టించుకోలేదు. మీరు ఆ గాడిదపాట పాడుతున్నప్పుడైతే, నేను మీ ప్రక్కకు వచ్చి, మీ చెయ్యిపట్టుకొని లాగి, మిమ్మల్ని అవతలికి తీసుకుపోయేందుకు కూడా ప్రయత్నించాను. అయితే మీరు నా చెయ్యి వదిలించుకొని, మళ్ళీ వాళ్ళ మధ్యన చేరి, ఎంత గట్టిగా- ఎంత సంతోషంగా కేకలు వేస్తూ నాట్యం చేశారంటే, నేను ఇక 'ఏంజరిగిందో‌ మొత్తం మీకూ తెలుసేమో, ఆ కుర్రాళ్ళు మీ అనుమతితోనే అదంతా చేశారేమో' అనుకొని ఊరుకోవాల్సి వచ్చింది!" అన్నాడు కాపలాదారు.

ఆలోచించగా 'అతను చెప్పిందంతా నిజమే' అని తోచింది యాత్రికుడికి. తను గాడిద పాట పాడుతున్నప్పుడు ఇతను నిజంగానే తనని ప్రక్కకి లాక్కెళ్ళాడు! తనే, అతని చేయి విదిలించుకొని, మళ్ళీ వెళ్ళి గుంపుతో పాటు గోవిందా కొట్టాడు! ఇప్పుడు, ఇక తప్పులో తనకూ భాగం ఉందని తెలిశాక, పోలీసుల దగ్గరికి పోయే ఆలోచనను విరమించుకున్నాడు అతను. "జరిగిందేదో జరిగిపోయింది- నా తప్పూ ఉంది. ఇప్పుడు చింతించి ప్రయోజనం లేదు" అనుకొని, పడుతూ లేస్తూ వచ్చినదారి పట్టాడు.

అయితే ఆరోజున అతనికి ఒక మంచి గుణపాఠం లభించింది: "మెలకువతో ఉండి వాస్తవాన్ని చూడాలి తప్పిస్తే, ఇలా వ్యసనాలకు బానిసై, మత్తులో మునిగి తేలి, ఆ తాత్కాలిక ఆనందాన్నే సుఖం అనుకుంటే నష్టమే తప్ప- ఏమాత్రం‌ ప్రయోజనం లేదు. తను ఇంతకాలమూ అర్రులు చాచిన సారాయి-మాంసాల మత్తు-రుచీ తాత్కాలికాలు. వాటికి లోబడే బదులు, తనలోకి తాను తొంగి చూసుకొని, ఏది సత్యమో వెతికేది మేలు" అని అతనికి అర్థమైంది!
Daily One Word

*13-12-2018*

*Sticky*

Sticky : *బ్రౌన్ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు 1852*    adj.

*బంకగా వుండే, జిగటగా వుండే.*

gum is * బంక జిగటగా వుంటున్నది.

boiled rice is * అన్నము చేతికి అంటుకొంటున్నది.

sticky : *ఆధునికవ్యవహారకోశం ఇంగ్లీష్-తెలుగు (బూదరాజు రాధాకృష్ణ) 2008*

*జిగురైన, బంకలాంటి, అతుక్కొనే, అంటి ఉండే.*

Stick'y : *శంకరనారాయణ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు 1972*    a.

అంటుకొనెడు, బంకయైన, జిగటయైన, adhesive, viscous, viscid, glutinous, gluey, tenacious.

ADHESIVE : *సమాన వ్యతిరేకార్థ పదనిఘంటువు ఇంగ్లీష్‍-తెలుగు (ఆం.ప్ర.సా.అ.) 1973*

అంటుకొనెడు

Synonyms [సమానార్థకములు]

Cohesive [పట్టియుంచెడు], Gluey [బంకగానుండు], Glutinous [జిగటగానుండు], Gummy [జిగురుగానుండు], Mucilaginous [జిగటగానుండు], Sticking [అతుకుకొనియుండు], Sticky[పట్టుకొనియుండు], Viscid [సంలగ్నశీలమైన; స్నిగ్ధమైన], Viscous [చిక్కనయైన; జిడ్డైన]*

Antonyms [వ్యతిరేకార్థకములు]

Free [అసంలగ్నమైన], Inadhesive [అంటుకొనని], Loose [వదులైన], Separable [వేరుచేయగలిగిన]*
Check Your English

*13-12-2018

Pronouns Exercise

Fill in the blanks with an appropriate pronoun.

1. I really ...................... when I was on holiday.

enjoyed

enjoyed me

enjoyed myself

2. He hurt ...................... while playing football.

him

himself

Either could be used here

3. They praised .........................

them

themself

themselves

4. He patted ................... on the back.

him

himself

Either could be used here

5. She was beside ....................... with sorrow.

her

herself

6. He did it all by ......................

him

himself

himselves

7. No one loves me better than .................... do.

yourself

you

yourselves

8. He only loves .......................

him

himself

himselves

9. Rani and .................. went shopping yesterday.

me

I

myself

10. The first prize was won by John and ................

I

me

myself

11. .................. wrote this essay.

Me

I

Myself

12. You have never offered ............ any help.

me

I

myself



Answers

1. I really  *enjoyed myself* when I was on holiday.
2. He hurt  *himself* while playing football.
3. They praised  *themselves.*
4. He patted  *himself* on the back.
5. She was beside  *herself* with sorrow.
6. He did it all by  *himself.*
7. No one loves me better than  *you* do.
8. He only loves  *himself.*
9. Rani and  *I* went shopping yesterday.
10. The first prize was won by John and  *me.*
11.  *I* wrote this essay.
12. You have never offered  *me* any help.