Eating Chicken is Danger Now Chicken Becoming Poison - Read Here
Chicken and its Adverse Effects
ఇప్పుడు అన్నీ కల్తీ మయం అయిపోయాయి. తానే నీరు దగ్గరి నుంచి, పీల్చే గాలి వరకు అన్నీ కల్తీలే.. ఇదీ అని కాదు ప్రతి ఒక్కటీ కల్తీ చేస్తున్నారు. బయటి ఫుడ్ తిందామంటే సరైన నాణ్యత పాటిస్తారో లేదో? ఎలాంటి నూనెలు వాడారో? అనే భయం ఇప్పుడు అందరినీ పట్టుకుంది. అందుకనే ఆరోగ్య స్పృహ కలిగిన చాలా మంది తమకు నచ్చినవి ఇంట్లోనే వండుకుంటున్నారు. కాని ఇప్పుడు అంతా బిజీ లైఫ్.. క్షణం ఖాళీ ఉండడం లేదు. తినడానికే సమయం లేదంటే తయారు చేసుకుని తినే తీరిక ఎక్కడిది? అయినా సరే ఆరోగ్యం ముఖ్యం కాబట్టి కాస్త పనిని పక్కనపెట్టి ఇంట్లో వండుకుని తిందామంటే అందులోనూ ఫ్రాడ్ చేస్తున్నారు కల్తీగాళ్లు..
చిన్న పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా లొట్టలేసుకుని తినే చికెన్ ఇప్పుడు విషంగా మారుతోంది. ఎంతలా అంటే ఆ చికెన్ ను తింటే మనకు తెలియని రోగాలను సైతం కొని తెచ్చుకునేంతగా… మలై చికెన్.. ఈ పేరు ఎప్పుడయినా విన్నారా? ఇప్పుడు ఈ పేరు రాష్ట్ర వ్యాప్తంగా జనాలను భయాందోళనలకు గురిచేస్తోంది. మామూలుగా అయితే బాయిలర్ కోళ్ల మాంసానికి అందరూ అలవాటు పడిపోయారు. వీటిని 60 రోజులు పెంచి అప్పుడు మాత్రమే మాంసం మార్కెట్ కు తరలించాలి. ఇక ఆ అరవై రోజులూ నాణ్యమైన ధాణా వాటికి పెట్టాలి. మంచి నీరు ఇవ్వడం, గాలి తగిలేలా పెంచడం చేస్తే అలాంటి చికెన్ వల్ల మనకు ఎలాంటి ఇబ్బందీ లేదు. కాని..
How Chicken is Becoming Poison - Read Here
Eating Chicken is Danger Now Chicken is Becoming Poison - Read Here |
కాసులకు కక్కుర్తి పడే కల్తీ కేటు గాళ్లు కోడి పిల్లల మెడ, తొడలకు స్టెరాయిడ్లు ఎక్కించి కేవలం 25 రోజుల్లోనే వాటిని 60 రోజులకు రావాల్సినంత బరువు వచ్చేలా చేస్తున్నారు. ఇక ఆ మాంసాన్నే చాలా వరకు దుఖాణాలకు సరఫరా చేసి కోట్లాది రూపాయలు వెనుకేసుకుంటున్నారు పలువురు కోళ్ల ఫారాల యజమానులు. ఇలాంటి మాంసం తింటే సుమారు 200 రకాల వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఇలాంటి చికెన్ వల్ల చాలా ప్రమాదం పొంచి ఉంది. వారి భవిష్యత్ ఆరోగ్యానికి ఈ చికెన్ తీరని నష్టం చేస్తుంది.
ఇక నుంచి చికెన్ కొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోమని ఆరోగ్య నిపుణుల సలహా.. కాస్త రేటు ఎక్కువయినా ఫర్వాలేదు మీకు దగ్గరలో ఏదయినా పల్లెటూరు ఉంటే అక్కడ ఇళ్లలో పెంచుకునే కోళ్లను కొనుక్కొచ్చుకుని తినమని సలహా ఇస్తున్నారు. అసలే ఇది పాడు కాలం.. నాలుగు రోజులు ఆరోగ్యంగా బతకాలంటే ఈమాత్రం అప్రమత్తత లేకుంటే కష్టం మరి. అన్నట్టు నలుగురికి ఈ విషయం తెలియపర్చేందుకు షేర్ చేయడం మరువకండి…